పోస్ట్‌లు

జూన్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

గాలి ఈలలు వేసేనని!

మొదటి యీల తోడ ముదితను మరలించు, పిదప యీల వేసి పిల్చు త్వరగ, మరల యీల వేసి మగువను దరి జేర్చు ప్రెజరు కుక్కరెంత ప్రేమ మూర్తి! (ప్రెజరు కుక్కరెంత పెద్ద రౌడి?) — కోడూరి ఈల వేసి సంతోషపెట్టేది కుక్కరు కాక మరొకటి ఉంది. అది ఆవిరి మీద నడిచే రైలింజను. ఊటీ వెళితే అలాంటి బొమ్మ రైలు ఎక్కి ఇంచక్కా రైలు ఈలలు వినొచ్చు. నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది అని సినిమా వాళ్ళు ఈలను వివిధ సందర్భాల్లో బానే వాడుకుని జనాల చేత ఈలలు వేయించారు.  భావుకులకు గాలి కూడా ఈలలు వేస్తుంది,సైగ చేస్తుంది! ప్రేమలోను, విరహంలోను,విషాదంలోనూ ఈల పాట పాడుకోగల స్వేచ్ఛ మగవారికే ఎక్కువ.  ఎప్పుడైనా పాడుకోగలిగింది ఈలపాట. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు, పొలం గట్ల మీద,తోటల్లో,తోపుల్లో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు.  ఏ వయసు వారైనా ఎప్పుడైనా ఈల వేసుకుని యవ్వనాన్ని తిరిగి అనుభూతి చెందవచ్చు! 🙂