పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

పుట్టపర్తి వారి స్మరణలో-

చిత్రం
  కళ-కళాకారులు, వీరికి లభించే ఖ్యాతి, లేక లభించని ఖ్యాతి లేక అవార్డులు వంటివి,జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ చక్రానికి అతీతమైనవి కావు. తేలిగ్గా చెప్పాలంటే “ప్రాప్తం“. ప్రాప్తాల సంగతి పక్కన పెట్టండి. అసలు, కళామతల్లి దేవాలయంలో పూజారిత్వానికి అర్హత సాధించడం ఏ సాధకుడికైనా బహు కష్టసాధ్యం. తగినంత సాధన లేక, సాధనకు సమయం లేక,వేరే వ్యాపకాల మధ్య అప్పుడప్పుడూ కళాసాధనకు పదును పెట్టాలని ప్రయత్నిస్తూ, తుప్పును వదిలించలేక తంటాలు పడేవాళ్ళు-సాటి కళాకారులను గురించి చాడీలు,పుకార్లు చెప్పుకోవడంలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీళ్ళు కళామ తల్లి దేవాలయం బయట బిచ్చమెత్తుకునే భిక్షగాళ్ళు. ఇంకొక శాఖవారు ఆ వాదం,ఈ వాదం అని జెండాలెత్తి అరుస్తూ, వాటి ప్రచారం కోసం సంపాదక పీఠాలెక్కి అక్కడనించీ తస్మదీయుల మీద విమర్శలనే రాళ్ళవర్షం కురిపించే అల్లిబిత్తిరి జెఫ్ఫా భాయిలు. వీళ్ళను కళామతల్లి ఎడమకాలితో తంతుంది.  కళను కళగా ఆరాధిస్తూ,తమ జీవితాలను కళకు అర్పించిన వారికే కళామతల్లి గుడిలో అమ్మకు పూజ చేసే అవకాశం. వాళ్ళు ప్రజల మదిలో నిలుస్తారు,వారి కళ ప్రజల నాల్కల మీద నర్తిస్తుంది.  ఆ కళామతల్లి పూజరుల్లో విశ్వనాథ ఒకరు. మా ముగ్గురిలో జ్ఞానపీఠాని