పోస్ట్‌లు

ఏప్రిల్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

తాతా,ఊతునా?

  క్రౌంచద్వీపంలో తెలుగు ప్రొఫెసర్ గా కొలువు చేస్తున్న  తాతాచారి సూటూబూటు వేసుకుని తెలుగు వాళ్ళ తెలుగు సభలో ప్రసంగించడానికి డాబుగా వెళ్ళాడు. అన్నింటికీ ఈలలు,చప్పట్లు కొట్టే సభికుల మందలో, దురదృష్టవశాత్తూ  ఓ తెలివైన తెలుగువాడు కూర్చున్నాడు.  తాతాచారి: తెలుగు కూతురులాంటిది. ఎవరి కూతురు వాళ్ళకి అందంగా ఉంటుంది. నీ కూతురు బాగోలేదని ఎవరూ అనరుగా. కాబట్టి తెలుగు అందమైన భాష అని మనలో మనం అనుకోవడమే.  హిహ్హిహ్హీ..  చప్పట్లు, నవ్వులు. తెలివైన తెలుగువాడు (మనసులో) : అదేమిటీ? భాష తల్లిలాంటిది కదా? కూతురులాంటిది అంటాడేమిటి? తల్లి ఎలా ఉన్నా అందమైనది కాదా? అనుకుని, ఇంకా నయం girl friend లాంటిది, ఎవడి girl friend వాడికి అందంగా కనిపిస్తుంది,అనలేదు. ఏదో తేడాగాడిలా ఉన్నాడే? తాతాచారి: మనలో మనం తెలుగు అందమైనది,గొప్పది అనుకుంటే చాలదు, ఇంగ్లీషు వాళ్ళు, పోనీ  ఫ్రెంచివాళ్ళతో నిండి ఉన్న సభలోకి వెళ్ళి ఈమాట అనండి,చూద్దాం? ఎవడైనా ఒప్పుకుంటాడేమో? హిహ్హిహ్హీ..  చప్పట్లు, నవ్వులు. తెలివైన తెలుగువాడు (మనసులో): ఎందుకు చెప్పలేను? ఎక్కడైనా చెప్పగలను. నా భాష గొప్పదని చెప్పుకోవడాన్ని ఎవ్వడైనా అర్థం చేసుకుంటాడు. ఒకడు ఒప్పుకోవడంతో

లోకాభిరామాయణం

అది సంసార యంత్రంలో ఇరుక్కున్న మృతజీవుని  మూలుగు స్త్రీదాహం కట్టని భావుకుని నాజూకు అలుపెరుగని అభిమాని గుడ్డి గాడిద సినీ పైత్యం నానావాదులు విరజిమ్ము బీజాలకు మాగాణి  కాగితపు పులులు ఉత్తుత్తి పంజాలు విసురుకునే విపణి వీథి ఆరిపోయిన వయసుల అరిగిపోయిన గ్రామ్‌ఫోను గరగర సరి,సరి కాలాన్ని  బూడిద చేసే ఇచ్చకపు  మాటల సూరేకారం.

Oh,Baby! Don’t break my heart!

  “PK తో హృదయాన్ని తెరువుము” అన్న సుప్రసిద్ధ కార్యక్రమాన్ని, తన సుప్రసిద్ధ ఛానెల్లో, మన సుప్రసిద్ధ PK నిర్వహించడం అనేది తరతరాలుగా తెలుగువారి సంప్రదాయంగా వస్తోంది.  PK: మీరు తీసుకోనని చెప్పుకుంటారు కానీ మీ ప్రసంగాలకు ఎనకమాలగా డబ్బులు తీసుకుంటారని బయట టాకు.  ప్రవచనకారుడు:  PK గారు,  ప్రవచనాలకు తాంబూలం పుచ్చకోవడం తప్పేమీ కాదు కదండీ. పుచ్చుకోవడమెందుకు? పుచ్చుకుని, పుచ్చుకోలేదని చెప్పుకోవడమెందుకు? ఎందుకొచ్చిన ఖర్మ చెప్పండి? ఒకవేళ పుచ్చుకోదల్చుకుంటే మీ అందరి ఎదుటా అడిగే పుచ్చుకుంటాను. నేనింత వరకూ నా ప్రసంగాలకు పైసా పుచ్చుకోలేదు, ఇక మీదట పుచ్చుకోను. PK: ఆ, ఇచ్చినా ఎంతలేండి? ప్రసంగానికి పదేలన్నా ఇత్తారా?                     కిక్కిక్కిక్కీ… PK: మీకు ఆ రోజుల్లో ఫలానా హీరోతో “రికరిక” అని ఇండస్ట్రీలో గుసగుస.  సీనియర్‌ నటీమణి: అయ్యో, బాబు PK, ఆ నటుడూ పోయాడు, నేనూ చివరి రోజుల్లో ఉన్నా. అవ్వన్నీ ఇప్పుడెందుకు బాబు? PK: వృద్ధనారీ పతివ్రతః అంటారు, అంతేగా?         కిక్కిక్కిక్కీ… PK: మీరు మంత్రిగా చాలా లంచాలు పట్టి బాగా ఎనకేసారని లోకమంతా కోడై కూస్తాంది. మంత్రి: నేను చాలా నిజాయితీ మనిషిని. నేను అవినీతికి

నే చెప్పలే? చెప్పలే?చెప్పలే?

  పాఠకుడు: అయ్యా, భాషాశాస్త్రపరిశోధకులు గారు,మీ భాషావ్యాసాలు నాకు కొరకరాని కొయ్యలుగాను,మాయావిడ అప్పుడప్పుడూ చేసే రాళ్ళలాంటి మైసూరుపాకుల్లాగాను ఉంటవి. అయినా కష్టపడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. మా ఇంటి పేరు “రావులపిండి” వారు. దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియజేయగలరు. భాషేష్‌: మీ పూర్వీకులు రేవుల వద్ద పిండి అమ్మేవారు కావచ్చును. “రేవుల” అన్న పదం కాలక్రమంలో “రావుల” అయి ఉండవచ్చును. లేదా మీ పూర్వీకులు పంజాబులోని “రావల్పిండి” నుండి వచ్చి ఉండవచ్చును. పాఠకుడు: అయ్యో,అయ్యో, పిండి అమ్ముకోవడమేమిటి ? మేము తరతరాలుగా కోనసీమలో వేదపండితులమయ్యా నాయనా! భాషేష్‌: మీరు రావల్పిండి నుండి నడుచుకుంటూ కోనసీమకు వచ్చి, కోనసీమ రేవుల్లో పిండి అమ్ముతూ ఆ తర్వాత ఎప్పుడో వేదం నేర్చుకుని ఉండవచ్చు. ఇంకా వివరాలు పంపండి, ఊహించి చెప్తా. పాఠకుడు: ఓరి నీ భాషాశాస్త్రం తగలెయ్య! నా బొందలా ఉంది నీ వివరణ. కాస్త గాయత్రి చెయ్యి, నీ బుద్ధి దారిలోకొస్తుంది.  భాషేష్‌: “గాయ్‌” అన్నది పర్షియానుండి, “త్రి” అనేది ధృవప్రాంతాల నుండి వచ్చిన పదాలు. పాఠకురాలు: సినిమాల్లోను, వీడియోల్లోను, శృంగార సన్నివేశాల్లో అన్నమయ్య పాటలు,త్యాగయ్య పాటలు

ఏవిుటండీ మీరు మాట్లాడేది??

చిత్రం
  భాషేష్‌: నేను చాలా చాలా శోధించి బర్మనీ,డబ్రూ గ్రంథాలు మరగేసి కనుక్కున్న రహస్యాలు నీతో పంచుకుంటున్నా. ఈ రహస్యాలు నువ్వు అందరితో పంచుకోవాలి,తెలిసిందా? మన దేవుళ్ళంతా ఆటవిక జాతుల టోటెమ్స్ నుండి వచ్చారు. అంటే వారి జెండా గుర్తుల కాంబినేషన్‌ల నుండి.  రెండు ఆటవిక జాతుల మధ్య ఫైటింగ్‌ జరిగి, తరువాత సంధి చేసుకుంటే, రెండు గుర్తులు కలిపి ఒక గుర్తు చేస్తారన్న మాట.  సింహం గుర్తు + మనిషి గుర్తు= నరసింహ స్వామి;  ఏనుగు గుర్తు+ మనిషి గుర్తు= వినాయకుడు  ఇలాగన్న మాట. తెలిసిందా?  చారి: ఏవిుటండీ మీరు మాట్లాడేది?? భాషేష్‌: ఇంకా విను. ఒకవేళ ఒక జాతి మరో జాతి చేతిలో ఓడిపోయిందనుకో, ఓడిపోయిన జాతి టోటెంని  గెలిచిన జాతి టోటెంకి వాహనంగా చేసేవారు.  వినాయకుడికి ఎలక, కుమారస్వామికి నెమలి ఇలా. తెలిసిందా?  ఈ అల్లిబిల్లి కతలన్నీ కలిపి కుట్టి “టోటెం పురాణం” ఒకటి రాస్తున్నా. పూర్తవగానే నీకో కాపీ పంపుతా.  చారి: ఏమిటండీ మీరు మాట్లాడేది?? రంధ్రాన్వేషణమ్మ: రాముడు,సీత అడవిలో లక్ష్మణుడి చేత వెట్టిచాకిరీ చేయించేవారు. లక్ష్మణుడు పుల్లలేరుకొస్తే సీత ఉప్మా చేసేది. రాముడు,సీత తిన్నాకే లక్ష్మణుడు తినాలంట. ఎంతన్యాయమండీ? చల్లారిపోయిన ఉప్

అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు!

  టీచరు: మీ పిల్లోడు బళ్ళో డల్‌ గా ఉంటున్నాడు, కౌన్సిలింగ్‌ ఇప్పించండి. సైకియాట్రిస్టు: మీ పిల్లోడిని అనేక ప్రశ్నలు వేసి విషయం రాబట్టా. అతగాడి ఆత్మ ప్రస్తుతం ఉన్న శరీరంలో సుఖంగా లేదని నాకు తెలిసింది. డాక్టరుతో టెస్టులు చేయించండి. డాక్టరు: ఓ మై గాడ్‌! సాధారణ మానవుడికి  గాస్ట్రోజన్ 30% ఉండాలి,  మీ వాడికి ‌ 29% మాత్రమే ఉంది! వెంటనే లింమాస్‌ చేయించకపోతే జీవితం ఇబ్బందైపోతుంది. మీవాడు దెబ్బైపోతాడు.  తండ్రి: ఆ మాట వింటుంటేనే నా హృదయం ముక్కలైపోతోంది. అలాంటి పని నా బొందిలో ప్రాణముండగా చెయ్యను. పత్రిక: శరీరంలో గాస్ట్రోజన్ తగు మోతాదులో లేకపోతే వెంటనే లింమాస్ చేయించుకోవాలి లేకపోతే కేన్సర్‌ వచ్చే అవకాశం 99%, ఎయిడ్సు వచ్చే అవకాశం 99.99%, 30 యేళ్ళకు మించి బతక్కపోయే అవకాశం 100% ఉందని శాస్త్రవేత్తలు నొక్కివక్కాణిస్తున్నారు. న్యూస్‌ ఛానల్‌: ఈరోజు ఏలూరులో 100 మంది, నర్సాపురంలో 150 మంది, ఇంకా విశాపట్నంలో 40, చీరాలలో 20 మంది పైకి పోయారు. వీరంతా గాస్ట్రోజన్‌ 30% కన్నా తగ్గినా లింమాస్‌‌కు నిరాకరించిన వారు. తండ్రి: ఓరి నాయనోయ్‌! ఏదో ఒకటి, నా పిల్లోడు బతికుంటే చాలు, వెంటనే లింమాస్‌ చేయిస్తా. పక్కింటాయన: మావోడి

భవత్‌ బీభత్స అకాడెమీ అవార్డు!

  ఈ సంవత్సరం తెలుగులో బీభత్స అకాడెమీ అవార్డు ఎవరికి ఇవ్వాలా అని వచ్చిన నామినేషన్ల జాబితా ముందేసుకుని పరిశీలిస్తున్నాడు అకాడెమీ సెక్రటరీ.  ఇంతలో ఫోన్‌ మోగింది. “ రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు” హలో సార్‌! నేను రెడ్‌ వీరయ్యని.  నా కథలతో తాడిత పీడిత బడుగు బలహీన బీద సాదల ఇంకా ఇంకా చాలా పెద్ద జాబితా మీద అయిదు శతాబ్దాలుగా, సారీ, దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నా.  ఈ పోరాటం ఆగదు! నా ఆరాటం ఆరదు!   ఇన్క్విలాబ్‌ జిందాబాద్‍!  ఇక నా “నెత్తుటి జ్వాలలు-పేగుల కేకలు” కి అకాడెమీ అవార్డు ఇవ్వకపోతే నామీదొట్టే! (ఖళ్‌‌ ఖళ్‌ మని దగ్గు).   మీ ప్రాంతానికి పోయినసారి ఇచ్చాంగా. మళ్ళీ మీ వంతు వచ్చేవరకూ ఆగాలి అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు సెక్రటరీ.  మళ్ళీ ఫోన్‌ మోగింది.   “ సన్నజాజి    పందిరి కింద   మెల్లమెల్లగా   దూరి దూరి     పోయావంటే    పాములుంటాయ్‌!” హలో! నమస్కారమండీ. నేను స్వోత్కర్ష జల్పానందాన్ని.  నేను రాసిన కోనసీమ కొబ్బరాకు కథలు చదివారా? కోనసీమ కొబ్బరచ్చు కథలు? కోనసీమ మడతకాజా కథలు? పోనీ కోనసీమ పూతరేకు కథలు? కోనసీమ సున్నుండ కథలు? మీరు చదివుండరులెండి. నా పుస్తకాలు సంతాలీ,బెంగాలీ,టెంకణీ,క

పోస్ట్‌! పోస్ట్‌!

  ఒక్కపొద్దు పత్రిక సంపాదక వర్గం- వెంకోజీ,భాషేష్‌,తాతాచారి అంతా ఎప్పటి వలెనే ఆ నెల పాఠకులనుండి వచ్చిన ఉత్తరాల కట్ట ముందు కూచుని ఒక్కో ఉత్తరం పరిశీలించడానికి  పూనుకుని సిద్ధమయ్యారు. “అయ్యా,సంపాదకులు గారు, మీ పత్రికలో శ్రీ భాషేష్‌ గారు గణపతిపై వ్రాసిన “నాకే తెలియని ఏనుగు తల దేవుడు” అన్న వ్యాసం చదివి రచయిత వింత వితండవాదాలు చూసి ఖిన్నుడనైనాను.  మచ్చుకు, “శుక్లాంబరధరం విష్ణుం” అన్నది విష్ణువు గురించని వారు లోకానికి బోధించబూనుకున్నారు.  అది గాడిదగుడ్డు వాదమని,శుంఠాయత్వానికి నిదర్శనమని నొక్కివక్కాణిస్తున్నాను.  విష్ణుం అంటే సర్వవ్యాపకుడన్న అర్థంలో అక్కడ వాడబడింది అని విజ్ఞులకు,ఆస్తికులకు కొన్ని వేలయేళ్ళుగా తెలుసును.  ఇక “సర్వ విఘ్నోప శాంతయే” అన్నది చాలు ఆ శ్లోకం గణపతి గురించని.  ఇంకా ఈ వ్యాసమంతా తప్పులతడకలు,ఉడకని పప్పులు.  వేదాల్లో గణపతి ప్రస్తావన లేదని రాసిన రచయితకు బుర్రలో పెద్ద ఖాళీ ఉండి ఉండాలి. అప్రాచ్యుడని,నాస్తికుడని తెలుస్తోంది. ఇంకా…” ఎవడో చాదస్తపు బ్రామ్మడు అవతల పారెయ్‌! అన్నాడు వెంకోజీ తల విదిలిస్తూ. భాషేష్‌ మొహం గంటు పెట్టుకుని ఉత్తరాన్ని చెత్తబుట్టలో పారేసి రెండో ఉత్తరం తీసి చదవసా