పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

పండుగంటే ఆరాధన

  పెద్దాయన: వినాయక చవితి నాడు ఏం చేయాలిరా?  ఆకలేష్‌‌: ఏముంది పెద్దాయనా!  వినాయకుడి పూజేదో చేసేసుకుని, ఉండ్రాళ్ళు, పులిహోర, పరవాన్నం, గారెలు,బూరెలు, నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్ళు, పులుసు చేసుకుని తినడమే. లొట్టేష్‌: బిర్యానీ కూడా. పెద్దాయన: వినాయక చవితి అంటే వినాయకుడిని ఇంటిలో ప్రతిష్టించుకుని ఆరాధించాల్సిన రోజు.  ఆ రోజంతా వినాయకుని ధ్యానంలోనే గడపాలి.  పిండి వంటలు అవీ చేయడం వినాయకుడికి నైవేద్యం పెట్టడానికే. తెలిసిందా ?  మరి, దీపావళి రోజు ఏమి చెయ్యాలిరా?  ఆకలేష్‌: ఏముంది, మిఠాయిలు, పిండి వంటలు, కొత్త బట్టలు,టపాసులు!  లొట్టేష్‌: బిర్యానీ కూడా. పెద్దాయన: దీపావళి అంటే లక్ష్మీ దేవిని ఆరాధించవలసిన రోజు.  అది ముఖ్యం.  ఇంతకీ మన పండుగలన్నీ ఆయా పండుగలకు సంబంధించిన దేవతల ఆరాధనలో గడుపవలసిన రోజులు.  అంతేగానీ కేవలం ఉత్సవాలు కాదు.  పండుగ అనగానే హడావిడి చేసేది ఎవర్రా?  ఆకలేష్‌: వ్యాపార సంస్థలు, పెద్దాయనా!  “దీపావళీ ధమాకా!” “దీవాలీ సేల్స్!” “ఈ దివాలీ రోజు మా బ్రాండ్‌ చాక్లెట్లతో నోరు తీపి చేసుకోండి” “ఈ హోలీ జరుపుకోండీ, మా కూల్‌డ్రింక్స్ తో!” “ఈ సంక్రాంతి మా బ్రాండ్ ప్రోడక్ట్స్ తో ఇల్లంతా నింపుకోండి”  అని

ఆత్మతో ఉపాసకుడి సంభాషణ

  1953 లో చనిపోయిన ఒక తెలుగు మనిషి ఆత్మ తెలుగు నేల మీదకు వచ్చింది.  దోవన పోతున్న ఒక దేవీ ఉపాసకుడితో సంభాషించడం మొదలెట్టింది. ఆత్మ: అయ్యా, తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టింది పొట్టి శ్రీరాములు గారు కదా. ఇప్పుడేమిటి, ఇంకెవరెవరి పేర్లో చెబుతున్నారు?  ఉపాసకుడు: నువ్వు 1953 లో పోయానంటున్నావ్. తరువాత ఎంతోమంది నాయకులు వచ్చారు. కేంద్రంలో పని చేసి తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టిన వారు, కేంద్రంతో పోట్లాడి తెలుగు వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన వారు ఇలా చాలామంది ఉన్నారు. తెలిసిందా?  ఆత్మ: ఏమిటో అంతా అయోమయంగా ఉంది. తెలుగు నేల చాలా మారిపోయింది. ప్రజలూ మారిపోయారు. మా ఊరి కరణం గారు, ఆయన కుటుంబం ఎలా ఉందో? వారు నాకు చాలా సన్నిహితులు. ఉపాసకుడు: ఇంకెక్కడి కరణాలయ్యా? కరణీకాలు ఎప్పుడో రద్దు చేసారు. ఆ కరణాల కుటుంబాలు ఏవో ఇతర ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటూ బ్రతుకుతున్నాయి. అత్మ: ఆ! అలాగా!   ఉపాసకుడు: అంతకన్నా పెద్దవి ఎన్నో జరిగాయయ్యా. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి.  అత్మ: తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారా? అయ్యో! ఎందుచేతో? ఉపాసకుడు: దానికి ఎన్నో రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నాయయ్యా. ఏం చెప్పను

ప్రేమ పచ్చళ్ళ samples- 1940 to present

  1940 ల్లో- హీరో: ప్రాణేశ్వరీ, హృదయ సఖీ!  నా డెందమును ఆక్రమించిన నవ మల్లికా!  సుకుమారీ!  హీరోయిన్‌: ఆ,ఎంత అదృష్టవంతురాలిని!  ప్రాణనాథా! నా హృదయమును మీకర్పించిని.  ఇకపై నా జీవితం మీ పాదాల చెంత.  1960ల్లో- హీరో:  రాధా, నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మనసు పారేసుకున్నాను.  మీకు ఇష్టమైతే మీ మెడలో తాళి కట్టి నాదాన్ని చేసుకుంటాను. హీరోయిన్‌: రామూ, మీరంటే నాకూ ఇష్టమే.  మన పెద్ద వాళ్ళను ఒప్పించి ఒకరికి ఒకరమై తోడూనీడగా కొత్త సంసారాన్ని ఆరంభిద్దాం.  మన సంసారం పిల్లాపాపలతో కళకళలాడాలి. 1980ల్లో-  హీరో: మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు.  రా,రాధా, ప్రేమ ప్రభంజనం సృష్టిద్దాం.  మన ప్రేమ అనంతం!  అజరామరం!  ఈ ప్రేమ హీన, రస హీన ప్రపంచం నుండి దూరంగా వెళ్ళి పోయి ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించుకుందాం పద రాధా,పద! హీరోయిన్‌: అలాగే రామూ, మన ప్రేమ వృక్షానికి అభిమానం,ఆప్యాయత అనే నీళ్ళు పోసి అది నిత్యము పచ్చపచ్చగా నవనవలాడుతూ ఉంటే చూసి ఆనందభాష్పాలు రాలుద్దాం.  అలాగే రామూ, అలాగే.  సూట్‌కేస్‌ సర్దుకుని ఇప్పుడే వస్తా. 1990 తరువాత-  హీరో: ఏంటే, తెగ తిప్పేసుకుంటున్నావ్‌. పొగరా?  నిన్ను లవ్‌ చేస్తున్నా.  ఎవడితో

కాపర్‌ స్టార్‌ కి కరెంట్‌ షాక్‌

  బంతి బాబు: సార్‌, మనం మనం తెలుగు వాళ్ళం అన్జెప్పి నిన్న ఇండియన్‌ స్టోర్‌లో ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఫోన్‌ నెంబరు తీసుకుని ఇవాళ ఇంటికి కూడా వచ్చారు.  చాలా సంతోషం సార్‌!  బిజినెస్‌ బాబు: దాన్దేముందండీ. మనం మనం తెలుగు వాళ్ళం.  మీతో ఒక అద్భుతమైన బిజినెస్‌ ఐడియా డిస్కస్‌ చేద్దామని మీ ఇంటికొచ్చా.  ఇండియన్‌ స్టోర్‌లో మిమ్మల్ని చూసినప్పుడే గమనించా.  మీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. బంతి బాబు: అంతా మీ అభిమానం సార్‌!  బిజినెస్‌ బాబు: చూడండి బంతి బాబు గారు, రాబోయే ఐదేళ్ళల్లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి. Am I correct? ఇదిగో చూడండి, ఈ పేపర్‌ మీద చూపించి వివరంగా చెప్తా, మీకు క్లియర్‌గా అర్థం అవుతుంది.  మీరు ఒక సొంత ఇల్లు కావాలనుకుంటున్నారు, అవునా?  చూడండి, ఇల్లు బొమ్మ గీస్తున్నా.  ఓకే, ఇల్లు. ఎంతౌతుంది?  $ *** K అనుకోండి.  చాలా పెద్ద అమౌంట్‌ కదా.  నెక్స్ట్ కారు.  ఐదేళ్ళల్లో మంచి లగ్జరీ కారు. కారు బొమ్మ గీస్తా.  దానికి  ఎంతౌతుంది?  $ ***K  అనుకోండి.  అది కూడా చాలా పెద్ద అమౌంట్‌.  ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ళల్లో మీరు సాధించాల్సిన స్టేటస్‌కి చాలా డబ

భక్తి ముఖ్యం కానీ?

  అమ్మా, దేవాలయానికి ఇలా కురచ దుస్తుల్లో రావొచ్చునా? బట్టలు ఏమేసుకుంటే ఏమిటండీ? భక్తి ముఖ్యం కానీ? అమ్మా, బొట్టు లేకుండా దేవాలయానికి వచ్చారేమీ?  ఎలా వస్తే ఏమిటండీ? భక్తి ముఖ్యం కానీ? అయ్యా, దేవాలయానికి టీ-షర్టు, షార్ట్స్ లో వచ్చారేమీ?  నేను చాలా భక్తుడినండీ. షార్ట్స్ వేసుకొచ్చారా, పంచె కట్టుకొచ్చారా అని చూస్తాడా దేవుడు?  భక్తి ముఖ్యం కానీ? ఏవమ్మా, అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తూ ఫోనులో అరుస్తున్నావు? నాతోపాటు వచ్చిన వాళ్ళు వేరేచోట ఉన్నారండీ. వాళ్ళతో కో-ఆర్డినేట్‌ చేసుకుంటూ ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడా. ఫోనుదేముందిలెండి. భక్తి ముఖ్యం కానీ? అమ్మలారా, అయ్యలారా! మీరంతా చెబుతుంది నిజమే. భక్తే ముఖ్యం. మీరంతా శ్రమపడి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీ ఇళ్ళలో కూచుని భక్తి చేసుకోండి.  మీరెవరండీ, రావద్దని చెప్పడానికి?  నేను ఈ దేవాలయ ధర్మకర్తని. ఈ గుడిని కట్టించింది నేనే. బయట పెద్ద బోర్డు పెట్టించాను, ఏమి రాసున్నదో చూడండి. 1. దేవాలయానికి సంప్రదాయ దుస్తుల్లోనే రావలెను. 2. హిందూ సంప్రదాయ వేషధారణలో వచ్చిన వారికే అనుమతి. 3. దేవాలయంలో బిగ్గరగా మాట్లాడరాదు.  4. దేవాలయంలో లౌకిక విషయాలు మాట్లాడరాదు. గమనిక:

బియ్యం కరువొచ్చిందోలప్పో!

  ఏందిరా ఆ పరుగులేందంటా?  అహా, అస్సల్కి కొంచమైనా సిగ్గూ షరమ్‌ ఉన్నాదిరా?  అరెరెరెరే! ఈ పోరగాల్లు దేశం ఇజ్జత్‌ దీస్తుండ్రు.  ఒగడి నెత్తి మిన్న ఒకడెక్కుడేంది?  లోడ్లు లోడ్లు బియ్యం బస్తాలు బండ్లల్లో నింపుడేందివయ్యా?  నీ ఎన్కాల ఇంకో తెలుగోడున్నడు, వాడికి పెళ్ళాంబిడ్డలున్నరు, ఆడు కూడా బియ్యం తినేటోడు అన్న ఇంగితం ఉండాలి గదవయ్యా? అయినా తెల్వకడుగుతా, ఈ బియ్యం ఆపిన్రు. గయితే ఏమౌతాదివయ్యా?  జాస్మిను రైసు, లాంగు రైసు, చైనా రైసు, జపాను రైసు ఇన్నున్నయ్‌ గదవయ్యా? అవి దింటే అయిపాయె.  ఏం దేశవాళీ బియ్యం దినకుంటే ముద్ద దిగదానే? ఓరి మీ ఏసాలో.  తూతుతూతు, షాపులల్ల పైపైకెక్కి బస్తాల్లాగుతా ఆగం ఆగం చేస్తుండ్రు.  తూతుతూతు, సిగ్గుబోయె. పక్క దేశాల్లోల్లు నవ్వరానె?  మా తాతలకాలం నుండి చూషినం మస్తు కరువులు.  కరువంటే ఈమాదిరి ఒక్క వస్తువు కరువుగాదు, కరువంటే ఒక్క తిండిగింజ కూడా దొరకని కరువు.  ఏది దొరికితే అదే తిన్నం. ఏమేమో దిన్నం ఆకులలములు.  అరెరెరెరే, ఒక్క బియ్యం దొరక్కుంటేనే ఇంత లొల్లి జేస్తుండ్రు?  గోధుమ రొట్టెలు దినుండ్రి. సజ్జ రొట్టెలు దినుండ్రి. జొన్న రొట్టెలు దినుండ్రి. రాగిముద్ద దినుండ్రి. ఎన్ని లేవయా నాకు ద

జీవన్‌ భద్రాణి పశ్యతి!

  రామయ్య ఓ సంస్థలో వాచ్‌మాన్‌ గా పని చేస్తున్నాడు.  సంస్థ గేటు వద్ద ఒక స్టూలు మీద కూచుని ఉండడమే అతని పని.  ఆ సంస్థ యజమాని బయటికి వస్తున్నా లోపలికి వెళుతున్నా లేచి నిలబడి శాల్యూట్‌ కొడుతూ ఉంటాడు.  ఓ రోజు కొంతమంది మనుషులు అతని వద్దకు వచ్చి తమనుతాము S.S.S సభ్యులుగా పరిచయం చేసుకున్నారు.  అంటే శూర శుప్లవ సంఘం.  చూడు రామయ్యా, నువ్వు నీ సంస్థ యజమానిని చూడగానే లేచి నిలబడి శాల్యూట్‌ చేస్తున్నావ్‌. అసలు యజమానిని చూడగానే నువ్వెందుకు లేవాలి?  అతనూ మనిషే. నువ్వూ మనిషివే.  నిలబడ్డమే కాదు, శాల్యూట్‌ కూడా కొడుతున్నావ్‌, బానిసలాగా.  ఇకనించీ లేచి నిలబడొద్దు,  శాల్యూట్‌ అంతకన్నా కొట్టొద్దు.  నీ ఉద్యోగం వాచ్‌మాన్‌ పని.  శల్యూట్లు కొట్టడం కాదు. తెలిసిందా?  అన్నారు వాళ్ళు. ఇదంతా కొత్తగా తోచింది రామయ్యకు.  నిజమే కదా అనీ అనిపించింది.  తనూ మనిషే, అతడూ మనిషే అన్న పాయింట్ బాగా మనసుకు హత్తుకుంది.  తనేమన్నా బానిసా? ఛత్‌!  మరుసటి రోజు యజమానిని చూసి అలవాటు కొద్దీ లేచినా, శాల్యూట్‌ కొట్టకుండా నిలబడ్డాడు.  యజమాని పెద్దగా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు.  మళ్ళీ S.S.S వాళ్ళు వచ్చి, చూసావా, యజమాని రాగానే అలవాటుగా

నీకు నాకు చెల్లంట! టాం!టాం! టాం!

  రమణికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.  ఒకటో పెళ్ళి కొడుకు వసంత కుమార్‌:   మా అమ్మకు ఆచారం ఎక్కువ. మీరు అవన్నీ పాటించాలి. రమణి: అలాగేనండీ.  మాకు బలగం ఎక్కువ. మా ఇంటికి బంధువులు, స్నేహితులు తరచూ వచ్చి పోతుంటారు.  మీరు రోజూ వచ్చిన చుట్టాలకు  వంటలు వండి వార్చి వడ్డించాలి. రమణి: అలాగేనండీ.   అన్నింటికీ అలాగే అంటున్నారు కనుక అసలు విషయం చెబుతున్నా. నేను మా ఆఫీసు మా కొలీగ్ ని ప్రేమించా. కానీ, ఆ అమ్మాయిది వేరే కులం. మా అమ్మ బలవంతం మీద ఈ పెళ్ళి చూపులు అవీ చూస్తూ టైం పాస్‌ చేస్తున్నా.  రమణి: ఓ, అలాగా. ఇందాకట్నించీ భయపెడుతుంటే ఏమిటో అనుకున్నా. పోన్లేండి, ఉన్న విషయం చెప్పారు. మరి ఆ వేరే కులం అమ్మాయి మన ఇంట్లో మళ్ళు దళ్ళు, వంటలు వార్పులు చేస్తుందంటారా?  మా ఇంటికొచ్చిన అమ్మాయి మా అమ్మ చెప్పినట్టు చెయ్యాల్సిందే.  రమణి: బావుందండి. అయితే అమ్మని ఒప్పించి ఆ అమ్మాయిని చేసుకుని, ఆ అమ్మాయిని ఒప్పించి అమ్మ చెప్పినట్టు చాకిరీ చేయించండి. All the best! ….. ఫోన్‌ కట్‌. 😁😉 రెండో పెళ్ళి కొడుకు చైత్ర కుమార్‌:  మీరు విదేశాల్లో చదువుకుని వచ్చినట్టున్నారు. నాకు చదువుకున్న అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు. ఏదో అమ్మ బలవం

తూస్కాన్‌ బాబుకి బామ్మ చీవాట్లు

  ఎవరు బాబూ నువ్వు?  బ్రాహ్మీ తేజస్సుతో  వెలిగిపోతూ చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్నావు?  నేను తూస్కాన్‌ నించి వచ్చాను బామ్మ గారు.  మేము కృష్ణ భక్తులం.  ఇదిగోండి, భగవద్గీత ప్రతి పుచ్చుకోండి.  ఆహా! కృష్ణ భక్తుడివా బాబూ.  చాలా సంతోషం నాయనా.  నేనూ కృష్ణ భక్తురాలినే.  నా శివ పూజ అయ్యాక శ్రీ రామ రక్షా స్తోత్రము,  హనుమాన్‌ చాలీసా చదువుకుని,  ఆనక తీరుబడిగా నాకు వచ్చిన కృష్ణ భజనలను పాడుకుంటూ ఉంటానయ్యా!  మీకు అర్థం కావడం లేదండీ బామ్మ గారు,  మాకు కృష్ణుడొక్కడే దేవుడు. శివుడు దేవుడే కాదు.  ఆరి బడుద్ధాయ్‌, ఇదా నీ భక్తి?  నీ బొందలా ఉంది.  కృష్ణుడు, అర్జునుడు, రాముడు, రావణాసురుడు అందరూ శివుడినే పూజించారని రామాయణ మహాభారతాల్లో చదవలేదుట్రా అబ్బాయ్‌? అవ్వన్నీ మేం చెప్పకూడదండీ బామ్మ గారు.  మా సంస్థ వారు ఎల్లా చెబితే అల్లా మాట్లాడాలి.  ఆ మాటకొస్తే మాకు రాముడికన్నా కూడా కృష్ణుడే గొప్ప.  అల్లాగని కృష్ణుడొచ్చి చెప్పాడా?  మా సంస్థ వారు చెబుతారండీ.  మాకు కృష్ణుడొక్కడే దేవుడు.  భగవద్గీత ఒక్కటే పుస్తకం.  ఏడిసినట్టే ఉంది.  మీరు కూడా ఒక దేవుడు, ఒక పుస్తకం గాళ్ళన్న మాట.  చూడు బాబు, మన ధర్మంలో వివిధ దేవతామూర్తులు వివిధ

ఓ అమెరికాంతామణి ఆవేదన

  అబ్బా, ఎంత బావుందో మీ ఇల్లు! ఆ, ఏవుందిలెండి.  మీలాగా నాకు ఉద్యోగమా ఏమన్నానా?  అదేమిటంటీ?  మీ వారు రెండు చేతులా సంపాదిస్తుంటేను.  ఆ, ఏవుందిలెండి.  మీకుమల్లే నాకో  కెరీర్‌ లేకపోయింది. ఈ కెరీర్లు అవీ ఏముందిలెండి.  మీకు బోలెడు నగలు.  ముత్యాల్లాంటి పిల్లలు.  చక్కని సంసారం.  ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి?  ఆ, ఎన్నున్నా ఏముందిలెండి.  ఉద్యోగం సద్యోగం లేకపోయింది.  మీ పిల్లలు చక్కగా స్థిరపడ్డారుగా.  అదే కదండీ కావాల్సింది. ఆ, ఏవుందిలెండి.  ఓ ఉద్యోగం చేయలేక పోయాను. పోనీ, ఇప్పుడు చెయ్యండి ఉద్యోగం. ఆ, ఇప్పుడు నాకెవడు ఇస్తాడు ఉద్యోగం?  ఇచ్చినా వెయ్యో రెండు వేలో ఇస్తారు.  అంత చిన్న జీతానికి ఎవడు పని చేస్తాడు?  నా వల్ల కాదు. పోనీ, ఏదైనా వ్యాపారం చెయ్యండి.  పిల్లలు స్థిర పడ్డారు.  ఈయన బిజీగా ఉంటారు.  ఈ వయసులో వ్యాపారమని నేనెక్కడ హైరానా పడను?  ఇప్పుడు సరిగ్గా మాట్లాడుతున్నారు.  మీది చీకూచింతా లేని జీవితం.  ఎంతోమంది ఆడవారికన్నా మీరు ఎన్నో రెట్లు అదృష్టవంతులు. హాయిగా ఉండండి.  ఆ, ఏవుందిలెండి.  ఏదో నన్ను ఓదార్చడానికి అల్లా అంటున్నారు మీరు.  మీరు ఉద్యోగస్థులుగా. ఎన్నైనా చెబుతారు.  నా బతుకే, ఒక ఉద్యోగం సద్యోగం