పోస్ట్‌లు

జనవరి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

మతిమరుపు చిలక వలకు పడిందోయ్‌!

  గాలిమేడల ఆశాజీవి Illusion City లో Software ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  కానీ ఆనందంగా లేడు. పని ఒత్తిడితో పాటు  బాస్‌ ఉన్మత్త రావు పెద్ద ఇత్తడి కావడం చేత  రోజూ తత్తిడి బిత్తిడి అవుతున్నాడు. ఉద్యోగం అతని  అందమైన వంకీల జుట్టును  ఎత్తుకు పోయింది.  బట్ట తల అతని  పెళ్ళికి గట్టి మట్టి గోడలా  అడ్డు నిలిచింది.  కనీసం పెళ్ళి చూపుల వరకైనా రప్పిద్దామని  జుట్టున్నప్పటి పాత ఫొటోలు పంపి  మోసం చేసాడు కొన్నాళ్ళు.  ఫలితం లేదు. పదేళ్ళ నాటి పాత ఫొటోలు ఫేక్‌బుక్‌ లో పెట్టి ఆడపిల్లల్ని attract చేద్దామనుకున్నాడు.  కొంత సఫలం అయ్యాడు కూడా.  కానీ ఆశాజీవి అసలు స్వరూపం అవగతం కాగానే వాళ్ళంతా అక్కడినుండి పరారయ్యారు.  తన ప్రయత్నాలన్నీ చిత్తడి చిత్తడి అవుతున్నాయని  ఎంతెంతో విచారించాడు ఆశాజీవి.  ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా దుప్పటి కప్పి,  జీతం వస్తోంది కనక హాయిగా ఎంజాయ్‌ చేద్దామని,  Illusion City లోని ఓ మెగా బార్‌కి వెళ్ళి  మందు పట్టించాడు ఆశాజీవి.  అదేం మందో, తాగేటప్పుడూ సుఖం లేదు,  తాగిన తర్వాత హాంగోవరు, చెవి రింగింగు, పొట్ట గార్గ్లింగులతో  అది వరకు ఉన్న సుఖం కూడా పోయింది గాలిమేడల ఆశాజీవికి.  పోనీ వీకెండ్స్ సినిమాలు

అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః

  ఏంటి బాబూ, మావాడ్ని పప్పు గాడని ఎగతాళి చేస్తున్నావట? నువ్వు తినవా పప్పు? 🤐🤐 నువ్వేమన్నా పులుల్ని, సింహాల్ని వేటాడుతున్నావా?  ఇంటెనకాల తిరిగే కోడిని, అది పెట్టే గుడ్డునేగా నువ్వు తినేది?  🤐🤐 పోనీ అడవికెళ్ళి జింకల్ని కొట్టుకొస్తున్నావా? షాపులో పాక్‌ చేసి పెట్టిన మటనేగా నువ్వు తెచ్చుకునేది? 🤐🤐 తినేవాడు గొప్పా? అవకాశమున్నా తినని వాడు గొప్పా?  🤐🤐 అహింస అనేది వ్రతంగా పెట్టుకున్న వాడినెవడినైనా సరే,  వాడి ఆహార నియమాన్ని గౌరవించు.  ఎందుకంటే వాడు ప్రకృతికి, ఏ ప్రాణికి ఏరకమైన హాని చెయ్యకుండా బతకాలని ప్రయత్నిస్తున్నాడు. వాడి ప్రయత్నాన్ని అభినందించు. 🤐🤐 మేమంతా హనుమాన్‌ వ్యాయామశాల వస్తాదులం.  అందరం శాకాహారులమే!  😲😲 శాకాహారాన్ని తక్కువ చెయ్యకు,  మాంసాహారాన్ని గొప్ప అనుకోకు.  సరేనా?  🫣🫡

కుంగ్‌ఫూ బామ్మ

  బామ్మ గారూ, మీ దేవుళ్ళు రాళ్ళు రప్పలు.  మా దేవుడే నిజమైన దేవుడు. అలాగని దేవుడొచ్చి నీకు చెప్పాడా బాబూ?  ఈ పుస్తకంలో రాసుందండీ.  సరే బాబూ, చదువుకో.  నా దగ్గరకొచ్చి ఎందుకు చెబుతున్నావు? అందరికీ చెప్పి మార్చాలని మాకు చెప్పారండీ.  అందర్నీ పుట్టేటప్పుడే తనని నమ్మేవాళ్ళుగా పుట్టించచ్చుగా బాబూ?  కొందర్ని నమ్మే వాళ్ళుగా చేయడమెందుకు,  కొందర్ని నమ్మని వాళ్ళుగా ఉంచడమెందుకు,  వాళ్ళని మార్చమని నీలాంటి వాళ్ళని పంపడమెందుకు బాబూ? అదంతా నాకు తెలవదండీ. మీరు మాదాంట్లోకి రావాలి.  వస్తే ఏమౌతుంది బాబూ? స్వర్గం వస్తుందండీ బామ్మ గారూ! స్వర్గం నువ్వు చూసావా బాబూ? లేదండీ, ఈ పుస్తకంలో రాసారు.  స్వర్గం గిర్గం నాకేమీ వద్దు బాబూ, వెళ్ళిరా. అలాక్కాదండీ, మిమ్మల్ని మార్చితే నాకు స్వర్గంలో డబల్‌ బెడ్రూం అపార్ట్మెంట్‌ వస్తుంది.  ఎవరు చెప్పారు బాబూ? నాకిది బోధించిన వారు చెప్పారండీ. ఇంకా ఏం చెప్పారు బాబూ?  మీ ఆదాయంలో నెలకింత అని మాకివ్వాలండీ, దేవుడి గురించి. దేవుడికి మన డబ్బెందుకు బాబూ? అదంతేనండీ. అది రూలు. ఇదంతా నాకొద్దు బాబూ, దయ చేయి. అది కాదండీ, మీ దేవుళ్ళను బయట పడేసి మా దేవుడిని నమ్మితే.. మర్యాదగా పోతావా? నా తడాఖా చ

మాకు మేమే మహారాజులం part-5

  అన్నాయ్‌‌, డగలాయిలు కూడా మన దేశాన్ని కొన్ని వందలేళ్ళు పరిపాలించారు గదా. ఆళ్ళ వంశాల చరిత్రలు చదూకుంటే తప్పేంటంట?  ఒకడు నీ ఇంటిని ఆక్రమించాడనుకో.  వందేళ్ళుగా ఆడి కుటుంబం వంశం అందులో ఉందనుకో.  నువ్వు పోరాడి పోరాడి తిరిగి నీ ఇంటిని నువ్వు తెచ్చుకున్నావనుకో.  అప్పుడు సరేలే, ఆళ్ళూ వందేళ్ళ బట్టీ ఉన్నారు గదా అని నీ ఇల్లు ఆక్రమించినోడిదీ, ఆడి కొడుకులు, మనవల ఫొటోలన్నీ పెట్టుకుని ఆళ్ళ గొప్పతనాలు పొగుడుతావా? నీ పోరాటం నీ ఇల్లు నువ్వు గెలుచుకోడం గురించి చెబుతావా?  బాగా చెప్పావన్నాయ్‌. అసలికీ చరిత్ర అంత కావాల్సిందా అన్నాయ్‌?  కిబెట్‌‌‌ దేశమోళ్ళు మన దేశంలో 70 యేళ్ళుగా ఉన్నారు. తరాలు మారినా తమ దేశం మర్చిపోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా బైనా మీద గొంతు విప్పుతూనే ఉన్నారు. చరిత్ర మర్చిపోతే దేశమే లేదు.  నిజమేనన్నాయ్‌. అదొక శాశ్వితమైన గుర్తింపంటావు. అంతేగా?  అంతేగా మరి.  నువ్వు మతం మార్చుకో,  సంస్కృతి మార్చుకో, పౌరసత్వం మార్చుకో.  అయినా నిన్ను భారతీయ మూలాలున్న వ్యక్తి అనే అంటారు! కొంతమంది దేశ జెండాని గుడ్డ ముక్క అని, ఎందుకు సాల్యూట్‌ కొట్టాలని అడుగుతున్నారన్నాయ్‌! దేశంలో కూచుని ఇలా బేవార్సు మాటలు మాట్టాడే

విద్యానవద్యా విదుషా న హేయా

  తాతయ్యా, మన ఊళ్ళో రామయ్య చదువు లేకపోయినా లిక్కర్‌ బిజినెస్‌లో కోట్లు సంపాదించాడు. తెలుసుగా.  అవునురా. తెలుసు. పెద్దగా చదువుకోని సోమయ్య ఏవో వ్యాపారాలు చేసి నల్లధనం బాగా వెనకేశాడు. తెలుసుగా. అవునురా. తెలుసు. ఇప్పుడు లోకమంతా డబ్బు వచ్చే పనులే చేస్తూ డబ్బు చుట్టూతా తిరుగుతోంది కదా తాతయ్యా!  అన్నీ తెలిసి ఇంకా ఎందుకు తాతయ్యా మనం మాత్రం ఈ వేదం,సాహిత్యం ఇవన్నీ పట్టుకు వేలాడ్డం?  డబ్బు రాని విద్యలు? శాస్త్రాలు?   పండితులు,తత్వవేత్తలు,సత్యానేషు లు ఉండేది డబ్బు కోసం కాదురా పిచ్చి వాడా! జ్ఞానం ఆధారంగా నిర్మింపబడింది కాబట్టే భారత దేశ సంస్కృతి ఇప్పటి వరకూ నిలబడి ఉంది.  ఇక్కడ రాజు సైతం పండితుడిని,కవిని,సన్యాసిని చూడగానే లేచి నిలబడి సత్కరిస్తాడు.  ఇక్కడ ధనవంతుడు, ధనహీనుడు కూడా జ్ఞానం ముందు మోకరిల్లుతాడు.  శాస్త్రానికి, సాహిత్యానికి జీవితాన్ని ధారపోయాలి, పండితుడు,కవి. బీదరికానికి జడవకుండా,కష్టనష్టాలకి కుంగిపోకుండా శాస్త్రపరిశ్రమ చెయ్యాలి.  ఆ శాస్త్రాలను,జ్ఞానాన్ని ముందు తరాలకి అందివ్వాలి.  లేకపోతే శాస్త్రం,భాష,సాహిత్యం ఏదీ నిలవదు.  నశించి పోతుంది.  అది ఆ జాతికే తీరని నష్టం.  నిరక్షరే వీక్ష్య మహాధనత్వ

తాతాయణ కథ

  తాతాజీ! తాతాజీ! వాడు బెత్తంతో నా చేతి మీద కొడుతున్నాడు తాతాజీ!  నువ్వే వాడినేదో చేసి ఉంటావ్‌!  అందుకే వాడు నిన్ను కొడుతున్నాడు. వాడు కుడి చేతి మీద కొడుతుంటే ఎడమ చేయి చూపించాలి.  కుడి పిర్ర మీద కొడుతుంటే ఎడమ పిర్ర చూపించాలి.  సరేనా? సరే, తాతాజీ. ☹️ తాతాజీ! తాతాజీ! వాడు ఎగిరెగిరి వీపు మీద తంతున్నాడు తాతాజీ! నువ్వు వాడి మనోభావాలను దెబ్బతీసి ఉంటావ్‌.  అందుకే వాడు నిన్ను కొడుతున్నాడు.  నీ వీపు వాడికి అందక ఎగరాల్సి వస్తోంది.  కనుక కింద కూచుని వంగో.  వాడు ఎంత కొట్టినా శాంతంగా భరించు.   శత్రువులో కూడా నారాయణుని చూడడమే దైవత్వం.  దైవాన్ని చేరుకోవాలంటే దెబ్బలు ఓర్చుకోవాలి. అర్థమైందా?  అర్థమైంది,తాతాజీ. ☹️ తాతాజీ! తాతాజీ! మీరు బనీను ఎందుకు వేసుకోరు తాతాజీ?  దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బనీను వేసుకునే స్తోమత వచ్చేవరకూ నేను బనీను వేసుకోరాదని తీర్మానించుకున్నా.  మనం బనీను వేసుకోడం మానేస్తే ఎదుటి వాడికి బనీను ఎలా వస్తుంది తాతాజీ? నువ్వు నన్నే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావ్‌. అంటే నా పెంపకంలోనే లోపం ఉంది. అందుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నా. ఒక రోజు భోజనం మానేసి పస్తు పడుకుంటా.  తాతాజీ!! ☹️ మీరు భోజనా

రామేశ్వరం పోయినా!

  ఆకువాడలో పేద్ద సాహితీ సభ. ప్రముఖ సాహితీవేత్త ఉర్లగడ్డ గారు బీభత్స అవార్డు పొందిన తన గ్రంథరాజాన్ని తానే ఆకాశానికి ఎత్తుకుంటూ ఎప్పటివలే తన ప్రసంగం కొనసాగించారు.  నా పుస్తకాన్ని బూతు అని, పౌరాణిక పాత్రను కించపరిచానని, ఇంకా ఏమేమో పనికిరాని విమర్శలు చేసారు, కొందరు పండితులు. అసలు పండితులు ఉండేదే ఇటువంటి పనికిమాలిన విమర్శలు చెయ్యడానికి.  నేను చానా పెద్దమనిషినని, నాకు బీభత్స అవార్జు వచ్చిందని, వారందరికీ అసూయ.  అసలు నా పుస్తకాన్ని బూతు అనేవారికి ఒకటే సమాధానం చెబుతున్నా. మనకు శృంగారము అనేది నవరసాల్లో ఒక రస్నా. ఈ రస్నా గురించి ఎంత రాసినా తనివి తీరదు. ఇంకా ఇందులో అమలినము,సరసము,విరసము,నీరసము లాంటివెన్నో రకాలున్నాయని హిందీ కవి చంపక్‌రాయ్‌ బాడురీ చెప్పాడు. నేను అదంతా ఎత్తి తీసుకొచ్చి తెలుగులో పులిమాను. ఏం తప్పా? తప్పుకాదే?  మరొక వక్త వెల్లుల్లి గడ్డ గారు పైకి లేచి ఎప్పటి వలె తన రిపీటెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు.  నాకు భారత ప్రభుత్వం నుండి మందార రత్న, గులాబీ భూషణ్‌, మల్లెశ్రీలాంటి అవార్డులన్నీ వచ్చాయి కానీ ఈ సమాజం నన్ను గుర్తించ లేదు. నేను వైస్‌ ఛాన్సలర్‌, ఛాన్సలర్‌, ప్రభుత్వ సలహాదారు, కేంద్ర కమిటీ

రక్ష!రక్ష!జనార్దనా!

  ఉద్యమాలే మా ఊపిరి.  ఉద్యమాలే మా పార్టీకి ఇడ్లీ దోస పాయసం.  మా పార్టీ మొట్టమొదటి ఉద్యమం, పురుషుల బహిర్భూమి వ్యతిరేక ఉద్యమం. మా కార్యకర్తలు తెల్లవారు ఝూమునే దారి కాచి, బహిర్భూమికి పొలాల్లోకి వెళ్ళే వాళ్ళ చెంబులు లాక్కునే వాళ్ళు. ప్రతిఘటించిన వారిని చెంబుతోను, చేతిలో ఉన్న కర్రతోను చేతి కిందకొస్తే చెయ్యి దెబ్బ, కాల్కిందకొస్తే కాల్దెబ్బ టైపులో కొట్టి వారిని పరుగో పరుగు చేసేవారు. నేను కూడా మిగిలిన కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసిన వాడినే.  ఓరోజు ఒకడి చేతిలో ఉన్న చెంబు లాక్కుంటుంటే, తన ఇంట్లో ఉంది ఒకటే చెంబని, తన చెంబు తనకివ్వమని ఒకటే కాళ్ళావేళ్ళా పడ్డాడు. కొంచెం జాలేసిందనుకో, అయినా మానవత్వం కన్నా ఉద్యమం ముఖ్యం కనుక అతనెంత బతిమిలాడినా అతని చెంబు అతనికి తిరిగివ్వలేదు.  మొత్తంగా మా ఉద్యమం సఫలమై గ్రామంలో పురుషులకొక శౌచాలయం ఏర్పడింది. మేం ఎవరి దగ్గరైతే చెంబులు లాక్కున్నామో ఆ జనాలే వేరే దారిలేక అప్పు చేసి రెండు మరుగుదొడ్లు కట్టుకున్నారు. ఊరి మొత్తానికీ రెండేనా అని మీరడగ వచ్చు. అది వాళ్ళ ఖర్మ. మనమేం చేస్తాం.    ఇదిగో, మా పార్టీ కార్యాలయంలో మీకు కనిపిస్తున్న చెంబులన్నీ అలా వచ్చినవే. అప్ప

పాట గొంతు నులుముకున్న చోట

  అనగనగా ఒక దేశం. అందులో అనగనగా ఒక గ్రామం. దున్నే వాడిదే భూమి!  దున్నే వాడిదే భూమి!  అన్నాయి అక్కడ కొత్తగా పుట్టిన ఎర్ర తలలు. అది విన్న అఱక దున్నే కౌలు రైతుకు వెర్రి ఆశ పుట్టింది. ఆరుగాలం శ్రమించేది నువ్వు!  భూస్వామికి ఎందుకివ్వాలి కౌలు?  అని రెట్టించాయి ఆ ఎర్ర వలలు. నిజమే! నిజమే!  తలలూపారు రైతులు.  ఎర్ర తలల ఎర్ర వలలు ఆ రైతులకు వెర్రి మొర్రి కలలు పుట్టించాయి.  మంటను ఎగదోసీ ఎగదోసీ రైతును తమ వైపు తిప్పుకుని,  భూస్వామిని, అతని కుటుంబాన్ని పట్టపగలే చంపాయి ఎర్ర తలలు! చూసారా, ఈ ఇల్లు, ఈ సంపద?  అంతా మీరు శ్రమ కోర్చి కూర్చిందే! తీసుకోండి! తీసుకోండి! అన్నాయా రక్తసిక్త హస్తాల ఎర్ర తలలు. అది విన్న ఆ బీద రైతుకు వెర్రి ఆశ పుట్టింది. రైతు మొదటిసారి దొంగ అయ్యాడు, ఏ అపరాధభావమూ లేకుండా.  ఆ తరువాత తన భూమి తనకే అనుకున్నాడా పిచ్చి రైతు. ఆగండాగండి, ఇది ఉమ్మడి ఆస్తి.  ఇక్కడ వ్యక్తిగత ఆస్తులకు చోటు లేదు! భూమంతా కలిపి ఒకే మొత్తం చేస్తున్నాం. అందరూ అందులో శ్రమించి పని చెయ్యాలి.  ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాలి అన్నాయవి, సిద్ధాంతాల ఎర్ర తలలు. రైతు మొదటిసారి కూలీ అయ్యాడు, ఏ దారీ లేక. వ్యవసాయం జరిగింది. ఫలసాయ