మాటల్తో కొట్టి కొట్టి చంపకే!
యాంకరమ్మ1: ఐదడుగుల అందగాడు, చింతాకు కళ్ళవాడు, మన ఊర మాస్ మారాజా, ధనాధన్ ధన్ రాజ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము! లేడీస్ అండ్ జంటిల్మెన్, పుట్ యువర్ హాండ్స్ టుగెదర్ ఫర్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో ధన్‌ధనా ధన్!! చెప్పండి సర్, ధన్ గారు, సెవెన్టీస్ లో ట్వన్టీస్ గా ఎలా మైన్‌టైన్ చేస్తున్నారు? ఈ మూవీలో హీరోయిన్‌తో మీ కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయింది? మీరు హెయిర్ వీవింగ్ కోసం ఈమధ్య ఇటలీ వెళ్ళారని ఇండస్ట్రీలో టాక్. దాని గురించి మా ఆడియన్స్ తో డీటైల్స్ షేర్ చేసుకుంటారా సర్.. యాంకరమ్మ2(కమ్ సింగరమ్మ): ఈ ఛల్లని ఈవ్‌నింగ్ మనమంతా ఇక్కడ మంఛి మంఛి కబుర్లు ఛెప్పుకోడానికి గాదెర్ అవడం నా ఛాలా ఛాలా హాప్పీగా ఉంది. మీకోసం మంఛి సంగీతం,పాట్లు అందించబోతున్నాం, హాప్పీగా ఎంజాయ్ చేసేద్దామా మరి? సంగీతం ఆపాత మధురం! మరి సాహిత్యం? హహ, మీరే ఛెప్ఫాలి. ఇప్పట్నించీ ఇంకో ఫయివ్ అవర్స్ మన్మంతా సంగీతంలో, అంఠే, సంగీతం ఒక ఓషిన్‌లాంటిదనుకోండి, మీకు తెలియని...