పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆశా భోంస్లే గురించి స్మితా పాటిల్‌

  లత పాటకన్నా ఆషా భోంస్లే పాట బావుంటుంది ఎందుకో.  https://youtu.be/QxHmaESjsUc ఆశా భోంస్లే  పాట గురించి స్మితా పాటిల్‌ చెప్పిన మాట వింటే తెలుస్తుంది ఎందుకో. https://youtu.be/bftddoWTSpE

తెలుగు కవిత్వం-వామ పక్షం

  తెలుగు కవిత్వాన్ని తన విష పరిష్వంగంలో బంధించిన వామపక్ష భావజాలాన్ని, సమయాభావం వల్ల పైపైన స్పృశిస్తూ సాగిన నా ఉపన్యాసాన్ని క్రింద ఇవ్వబడిన లింకులో వినగలరు. పూర్తి వ్యాసం వ్రాసాక మీతో పంచుకోగలను.  https://youtu.be/biWjM6nj9S4&t =133m18s విని మీ అభిప్రాయాలను తెలియజేయగలిగితే సంతోషిస్తాను.

పద్యాలాపన-ఒక పరిశీలన

  పాటని పాటగాను, శ్లోకాన్ని శ్లోకంగాను,మంత్రాన్ని మంత్రంగాను,పద్యాన్ని పద్యంగాను పాడాలండీ అన్నాడొకాయన నా పద్యాలాపన చూసి.  నేను పుట్టేటప్పటికే ఇళ్ళల్లో బళ్ళల్లో ఊళ్ళల్లో  తెలుగు పద్యం చచ్చిపోయి చాలాకాలం అయ్యిందనీ,  నాకు పద్యం పాడ్డంలో శిక్షణ ఏమీ లేదనీ, ఏదో నా స్వంత పరిజ్ఞానంతో పాడుతున్నాననీ, విన్నవించుకున్నా ఆయనకి  పద్యం మీద ఉన్న ప్రేమవల్ల నా మాటలు రుచించలేదు.  ఇంతకీ అదికాదు అసలు విషయం.  పాటనీ,శ్లోకాన్నీ,మంత్రాన్నీ,పద్యా న్నీ ఒకే గాటన కట్టడమే నాకు నవ్వు తెప్పించింది. పాటని పాటలాగే బాణీ కట్టి పాడాలి,వేద మంత్రాలైతే సుస్వరంగా చదవాలి.  కానీ,శ్లోకాన్ని,పద్యాన్ని స్పష్టంగా అర్ధం చెడకుండా చదివితే చాలు.  రాగం తీసి పాడగలిగితే అది మిఠాయికి రంగులద్దినట్టు. లేకపోతే జీడిపప్పు అద్దినట్టు. అంతే.  ఇందులోను ఒక తిరకాసు ఉంది. పద్యంలో కవి హృదయం వీరికి ఎలా అర్థం అయిందో అలా విరుపులు విరుస్తూ పాడ్డం వల్ల కవి గారి ఆత్మ బదులు ఈ పద్యం పాడేవారి హృదయం పద్యంలో తిష్ఠ వేసుక్కూచుంటుంది. అదీ అసలు ప్రమాదం! అసలు ఎలుగెత్తి పద్యం పాడ్డం అనేది మైకులు లేని రోజుల్లో నాటకాల్లో నటులనించి మొదలై ఉంటుందని నా పరిశీలన. నటుడు నటనలో భ

వీర వణక్కం

  మొన్న బిపిన్‌ రావత్ గారు, మరికొందరు సైనికాధికారులు తమిళనాడులో మరణించినపుడు అక్కడ స్థానిక ప్రజలు “వీర వణక్కం” అంటూ నినాదాలు చేసారు.  మరి అదే మన తెలుగునాట జరిగి ఉంటే ప్రజలు ఏమని నినదించి ఉండేవారు? “జైహింద్‍” లేదా “అమర్‌ రహే” అని హిందీలో నినాదాలు ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే అందుకు సమానార్థకమైన తెలుగు పదం మనకు వాడుకలో లేదు!  “వీర వందనం” అనవచ్చును. కానీ అది పామరులలో ప్రచారంలో లేదు. విద్యావంతుల్లో వాడుకలో లేదు.  ఇదీ మన దుస్థితి.

సినిమా పాటల సంగతులు

  పాటకు సమాంతరంగా సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను నడిపించడం ఓ పద్ధతి.  ఉదాహరణకు వాగ్దానం సినిమాలో రేలంగి గారి హరికథకు సమాంతరంగా సినిమాలో ముఖ్య సన్నివేశాలు జరుగుతాయి.  https://youtu.be/j9WcVnIRiiY అలాంటిదే స్వాతిముత్యం సినిమాలో హరికథ పాట-పాటకు సమాంతరంగా ముఖ్య సన్నివేశాల అల్లిక. https://youtu.be/Ts-Y5qr307E ఇక మన సినిమాల్లో నేరగాళ్ళకి ఐటమ్‌ సాంగ్సుకి అవినాభావ సంబంధం. సాధారణంగా వారంతా కలుసుకొనేది బార్లలోనే. ఐటం సాంగ్‌ జరుతుండగానే అక్కడ విలన్లు,హీరోల మధ్య సన్నివేశాలు జరగడం పాత సినిమాలనించీ మనకు ఆచారంగా వస్తోంది. ఇటీవల వచ్చిన కిక్‌  సినిమాలోనూ  దిల్‌ ఖలాసే అనే ఐటం సాంగుకి సమాంతరంగా సినిమాలోని ముఖ్య సన్నివేశాలను తెలివిగా నడపడం కనిపిస్తుంది. https://youtu.be/lk0Qibc2ZIE పాటలోనే సన్నివేశాన్ని నడపడం మరో పద్ధతి. ఉదాహరణకు మల్లెపువ్వులో ఈ పాట: https://youtu.be/o-ruc1olRSc  సిరివెన్నెలలో ఈ పాట: https://youtu.be/WVZSBF7q9UA రుద్రవీణలో ఈ పాట: https://youtu.be/LlbRxxnmzII సాధారణంగా ఆ ప్రత్యేక భావం యొక్క తీవ్రతను పెంచడానికి పాట ఉపయోగపడుతుంది.  ఒక పాటకి సమాంతరంగా సన్నివేశాల కల్పన,పాటలోనే సన్నివేశాలు జర