పోస్ట్‌లు

సెప్టెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని!

  సుబ్బారావు బండి మీద బీసెంట్‌ రోడ్‌లో వెళుతూ రోడ్డు మధ్యలో జనాలు గుంపులు గుంపులుగా ఆగిపోయి ఉండడం చూసి  తనూ ఆగి చూసాడు. అక్కడో రోడ్డు ప్రమాదం! ప్రమాదంలో గాయపడ్డ బాధితులు రక్షించమని మూలుగుతున్నారు. కొందరు మంచినీరు ఇవ్వమని అడుగుతున్నారు. సుబ్బారావు వెంటనే సెల్‌ ఫోన్‌ బయటకు తీసాడు. అదంతా చక్కగా వీడియో తీసాడు.  తర్వాత వేరే రూట్లో మెల్లిగా ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తను రికార్డు చేసింది నీట్‌గా ఎడిట్‌ చేసి,  బాగ్రౌండ్‌లో “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” అన్న పాట పెట్టి సోషల్‌ మీడియాలో పెట్టాడు.  ఆ వీడియోకి ఎన్నో వేల లైక్స్, కామెంట్స్.  అన్నయ్య గారు, మీదెంత గొప్ప మనసండీ.  ఆ ప్రమాదం జరిగినప్పుడు మేమూ అక్కడే ఉన్నాం.  మనకెందుకొచ్చిన గొడవా అని మావారు నన్నూ పిల్లల్ని  పక్కవీథిలోంచి తీసుకొచ్చారు అంటూ ఓ చెల్లాయి ఫోన్‌ చేసింది. మీరో హీరో! అంది మరో అమ్మాయి ఆరాధనగా. అలా ఎన్నో ప్రశంసలు వచ్చాయి సుబ్బారావుకి. మరోమాటు ఎవరో అత్యాచార బాధితురాలు.  రోడ్డు మీద నిస్సహాయంగా అందరి సహాయము అర్థిస్తోంది. సుబ్బారావు వెంటనే ఫోన్‌ బయటకు తీసి అంతా వీడియో తీసి,  ఆనక ఇంటికెళ్ళాక, “ఈ దుర్యోధన దుశ్శాసన” పాటని బాగ్రౌండ

అద్యచ్చా!అద్యచ్చా!-2

  ఇంతలో అక్కడ కలకలం రేగింది.  స్త్రీలను ఉద్దేశించి భయంకరమైన తిట్లు వినిపించసాగినవి.   ఎవరయ్యా మహిళలను ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు? వారంతా మా నాయకులు, వారి వందిమాగధులేనయ్యా. అదేమిటీ? అంత దిగజారి మాట్లాడుతున్నారేమి? ఈవిడ ఇదివరకు వీళ్ళ పార్టీకే పని చేసింది.  తరువాత ఎదుటి పార్టీలోకి వెళ్ళింది.  అందుకని బూతులు తిడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారయ్యా. ఆవిడేమో వీళ్ళ నాయకుడి మీద విమర్శలు చేసింది. అందుకని బండ తిట్లతో శీల హననం చేస్తున్నారయ్యా. అదిగదిగో, ఆవిడేమో వీళ్ళ నాయకుడి మీద ఆరోపణలు చేసింది. అందుకని నోటికి వచ్చినట్టు ఆవిడ శీలాన్ని కించపరుస్తున్నారయ్యా. ఛీ!ఛీ!  మహిళలను దుర్భాషలాడే వీళ్ళా తెలుగు ప్రజలకు నాయకులు? అంటూ చెవులు మూసుకున్నారు కృష్ణదేవ రాయలు, రాజ రాజ నరేంద్రుడు.  మరి, ఈ నాయకుల ఆడవారు రారా రాజకీయం చేయడానికి?  అని అడిగారు ఇద్దరూ ముక్త కంఠంతో. అవసరమైతే వస్తారయ్యా. వాళ్ళంతా సాధ్వీమణులని,భద్ర మహిళలని, పవిత్ర మూర్తులని, కర్తవ్యదీక్షా దక్షులని, కులస్త్రీలని,ఉత్తమ ఇల్లాళ్ళని, మాతృమూర్తులని, అమ్మల గన్న అమ్మలని, ముగురమ్మల మూలపుటమ్మలని, పూజనీయులని, మా నాయకుల వందిమాగధులు,  వారి చేతి కింది ప

అద్యచ్చా! అద్యచ్చా! - 1

  ఒకనాడు తాము పాలించిన తెలుగు రాజ్యం ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని శ్రీకృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు తెలుగు నేల మీదకు దిగి వచ్చారు.   అలా కిందికి దిగారో లేదో సుశ్రావ్యమైన దూషణలు విన్పించగా ఇద్దరు ఒక్కసారి అద్దిరిపడ్డారు. లుంగీ వూడదీసి తంతా! చొక్కా విప్పించి తంతా! నోర్ముయ్‌! బాంచత్‌! తొడగొట్టి సవాల్‌! నీ అంతు చూస్తా! తిప్పించి తిప్పించి తంతా! రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తా! బస్తీ మే సవాల్‌! డౌన్‌! డౌన్‌! షేమ్‌! షేమ్‌! ఏమిటయ్యా ఇదంతా?  ఎవరు వీరంతా?  చేపలమ్ము విపణి వీధా? తిరునాళ్ళలో ఆకతాయిల సవాళ్ళా?  అని విస్తుపోతూ అడిగారు ఓ దారిన పోయే దానయ్యని. వాళ్ళంతా తెలుగు ప్రజల నాయకులయ్యా.  అదేమిటి, అలాంటి భాష వాడుతున్నారు?  అలా మాట్లాడితేగానీ సమావేశం వాడిగా వేడిగా జరిగినట్టు కాదయ్యా. ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళు వినకుండా అరిచి అరిచి అరిచి ఇంటికి పోవడమే మా నాయకుల సమావేశాలంటే.  అది విని  కృష్ణదేవరాయలు,రాజరాజ నరేంద్రుడు పళ్ళు పటపటలాడిస్తూ, తమ ఒరల్లోని ఖడ్గాలను పట్టి, ఏమీ చెయ్యలేక కుతకుతలాడారు.

మాకు మేమే మహారాజులం-4

  అన్నాయ్‌, ఈమధ్య అన్నింటికీ వివక్ష అని విపరీతంగా ఊదరగొడతాంటే అయోమయంగా ఉంది.  అసలేందన్నాయ్‌‌ ఇదంతా?  ఎంపిక చేసుకునే స్వేచ్ఛని, వివక్ష ని గడబిడగా కలిపేసి  అన్నింటినీ వివక్ష అనుకుంటున్నారు తమ్మీ.  ఒకమ్మాయి ఆరడుగులున్న అబ్బాయిని  పెళ్ళి చేసుకుంటానని ప్రకటించిందనుకో.  అది ఆమె choice లేక ఎంపిక చేసుకునే స్వేచ్ఛ. అప్పుడు తక్కువ ఎత్తున్న మగవాళ్ళంతా వచ్చి నువ్వు మాపట్ల వివక్ష చూపిస్తున్నావు అంటే?   భలే చెప్పావన్నాయ్‌!  అన్నాయ్‌, ఆయనెవరో మెగా మేతావంట,  పెట్టుబడిదారు లాభాలన్నీ అందరికీ సమానంగా పంచి తను కూడా నెల జీతం తీసుకోవాలంటున్నాడు.  ఏందన్నాయ్‌ ఇది?  పెట్టుబడిదారుడు ఎంతో పెట్టుబడి పెట్టి,  ఎంతో రిస్కు తీసుకుని పరిశ్రమ ఎందుకు స్థాపిస్తాడు?  అంత కష్టపడి ఎందుకు నడిపిస్తాడు?  లాభాలు సంపాదించి ఆ డబ్బుతో గొప్ప స్థాయిలో బతకాలనేగా? మరి ఆ ఆశ, drive లేకపోతే వాడెందుకు పరిశ్రమ స్థాపిస్తాడు? దాన్నెందుకు తన సమస్త శక్తులు ఒడ్డి నడిపిస్తాడు? అందరికీ పందేరం చేసి తాను నలుగురితో పాటు బతికేదానికి ఇంత శ్రమ అతనెందుకు పడాలి? అభివృద్ధి కావాలంటే ఆ మండే కోరిక, ఆ కోరిక వెనక తనకు రాబోయే లాభాలు ఉంటేనే ఇదంతా సాధ్యం.  భలే చె

చూపుడు గుర్రం-1

  మనాడు ఆలిండియా అందగాడు. మనాడు  గుర్రం శ్వారీ బెమ్మాండంగా సేత్తాడు. మనాడు  ఫైటింగ్లయ్యి బెమ్మాండంగా సేత్తాడు. మనాడు  ఈత బెమ్మాండంగా కొడ్తాడు. నటన ఆడి రత్తంలోనే ఉందెహే!  ఆడి నాన్న హీరో, ఆడి తాత హీరో!  ముత్తాత ఏం జేసేవాడు సార్‌? నోర్మూస్కో.  చనువిచ్చానని ఎక్కువ మాట్లాడమాక!  ఏడుండాలో ఆడుండు.  ఎగస్ట్రాలు చెయ్యమాక! సరే సార్‌! ఆ తమిళ సినిమా అనుకున్నాం కదా సార్‌,   బాబుకి పదిసార్లు చూపించినా కళ్ళల్లో expressions లేవు సార్‌? Expressions ఎవుడికి కావాలయ్యా? Expressions కావాలంటే Long shots లో తియ్యండి.  లేకపోతే ఎనకమాల్నుంచి తియ్యండి, సరి పోద్ది. సార్‌, బాబు చేత  ఫైటింగ్స్ చేయిద్దామా సార్‌? దానికి బాబెందుకయ్యా? డూపుని పెట్టు. సార్‌, హీరోయిన్‌ తో డైలాగ్సు కాపీ సార్‌.  బాబు రేపు షూటింగ్‌కి బాగా చదువుకుని వస్తే.. చూసానయ్యా, ఏందయ్యా హీరోయిన్ని మీరు మీరు అంటా ఈ డైలాగులు? అంటే హీరో మర్యాదస్థుడు సార్‌, హీరోయిన్‌ పెద్ద ఆఫీసరు. మర్యాదా లేదు, బొంగు లేదు.  మీరు మీరు తీసేయించి  అసేయ్‌,ఒసేయ్‌,ఏంటే‌ అని మార్చి రాయించు.  సరే సార్‌!  సినిమా పూర్తయింది.  ఏందయ్యా ఇదా?  తమిళ్‌లో సూపర్‌ హిట్‌! మనకాడేందయ్యా బాబుని పె

ఈ లోకాన వింతలిన్నన్ని కావయా!

  ఒకానొక వ్యక్తి తనను తాను కుక్కతో identify చేసుకుని ఆధునిత సాంకేతికతను వాడి కుక్కగా మారాడు. అది విన్న లోకం ఎప్పటివలే మొదట కళవళపడి  ఆనక ఎప్పటివలే సర్దుకుపోయింది.  అతన్ని చూసి ఇదేదో బావుందనుకుని  ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్ఫూర్తి పొంది  కొన్ని వేలమంది కుక్కలుగా మారారు.  అది చూసి స్ఫూర్తి పొంది మరి కొందరు  తమను తాము పిల్లులతోను, కోతులతోను, జిరాఫీలతోను, పులులతోను, సింహాలతోను  identify చేసుకుని,  ఆధునిత సాంకేతికతను వాడి  ఆయా జంతువులుగా మారిపోయారు.  అలా మారిపోయాక, కుక్కులుగా మారిన మనుషులు పిల్లులుగా మారిన మనుషులతో పోట్లాడ్డం,  కోతులుగా మారిన మనుషులు కుక్కలుగా మారిన మనుషులను చూసి కాట్లాడ్డం, ఇత్యాది జరుగుతుంటే,  ఇలా జంతువులుగా మారిన మనుషుల కోసం  ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయబడ్డది. కుక్కగా మారిన మనిషి ఒకడు మామూలు మనిషిని కరిస్తే,  కరవడం కుక్కల సహజ లక్షణం కనుక,  కుక్కగా మారిన మనిషి ప్రస్తుతం కుక్క మానసిక స్థితిలో ఉన్నాడు కనుక, కుక్కగా మారిన మనిషిది ఏమీ తప్పు కాదని  కుక్కగా మారిన మనిషికి అనుకూలంగా తీర్పు ఇవ్వబడింది. సింహంగా మారిన మనిషి మామూలు మనిషి మీద దాడి చేస్తే,  ఆ మనిషి ఆ సింహాన్ని చంపితే,  సి

కోడి బాయె లచ్చమ్మాది!

  ఏమిటండీ, మిట్ట మధ్యాహ్నం పూజ చేస్తున్నారేమి? నన్నందరు TCube అక్కయ్యా అని పిలుస్తుంటారమ్మా.   నా TCube channel కి 3 లక్షలమంది subscribers ఉన్నారమ్మా.  పూజలు, వ్రతాలు చూపిస్తుంటా.  ఉదయం ఇంటి పనితో కుదరదమ్మా,  అందుకని అందరూ వెళ్ళిపోయాక ఇలా వీడియో కోసం ఉదయం పూజ మధ్యాహ్నం చేసి record చేసి upload చేస్తా. ఏ పూజకి ఏ రంగు చీర కట్టాలి,  ఏ రంగు పూలు పెట్టాలి, ఏ రంగు జాకెట్‌ వెయ్యాలి, పూజ గదిని ఎలా ఎలా ఎలా డెకొరేట్‌ చెయ్యాలి, ఇవన్నీ చెబుతా! 👀 👀 అదేమిటండీ, మీ చుట్టూ రంగు రంగుల పెన్నులు,  పూసలు, శంఖాలు పోసుకుని కూచున్నారు?  నన్నందరు TCube అత్తయ్యా అని పిలుస్తుంటారమ్మా. మన TCube channel కి నాలుగు లక్షలమంది subscribers ఉన్నారమ్మా. నేను సమస్యలకి రెమెడీస్‌ చెబుతుంటా కదమ్మా.  ఎర్ర రంగు పెన్నుతో మన సమస్యని బిర్యానీ ఆకు మీద రాసి,  దాన్ని నిప్పుల్లో కాల్చి,  ఆ నుసంతా పక్కింట్లో వేస్తే మన సమస్య తీరిపోతుంది.  పచ్చ ఇంకుతో శంఖానికి పచ్చ రంగు వేసి,  దానిలో రెండు పూసలుంచి,  అర్ధరాత్రి అమావాస్య బీసెంట్‌ రోడ్‌ నేలమాళిగలో ఉన్న  భైరవ స్వామీజీకి మొక్కు తీర్చుకుంటే మనం అనుకున్నది ఇట్టే అయిపోతుంది. ఇలాగా బోల్డు రెమె

The Big Mess show!

  మన టీవీ ఛానెల్‌ రేటింగు,  పాపులారిటీ అమాంతం పెరిగిపోవాలంటే  ఏం జెయ్యాలో సెప్పు సెగట్రీ? దానికి నా దగ్గిరో మంచి ఐడియా ఉంది సార్‌!  25-35 మధ్య వయసున్న ఒక ఇరవై మందిని, సినిమా వాళ్ళనుండి,  సినిమా పాటలు పాడే వాళ్ళనుండి, యాంకర్ల నుండి, వాళ్ళతోబాటు ఒకరిద్దరు సామాన్యులనీ తీస్కొచ్చి  అందర్నీ ఒక ఇంట్లో పడేసి ఒక్క బాత్రూంలో తప్ప  ఇల్లంతా కెమెరాలు పెడ్తాం.  ఆర్టిస్టులు ఎందుకు?  వాళ్ళకి లాజిక్‌ కన్నా ఎమోషన్స్ ఎక్కువుంటాయ్‌ సార్‌!  వాళ్ళైతే మన షో లో బాగా డ్రామా క్రియేట్‌ చేయగల్రు.  మామూలు వాళ్ళెందుకు మధ్యలో? వాళ్ళను చూసి మాకూ ఎప్పుడో అవకాశం వస్తుంది అని చూసేవాళ్ళు అనుకుంటారు సార్‌! ఆ తర్వాత?  ఆ తర్వాతేముంది సార్‌?  వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా  ఆ కొంపలో రెండు నెలలు ఉండాలి.  ఇంక చేసేది లేక,  కొట్టుకుంటారు,  తిట్టుకుంటారు,  నవ్వుకుంటారు,  ఏడ్చుకుంటారు. కాలు తగిలిందని,  చెయ్యి తగిలిందని  తగాదాలు పడతారు.  గ్రూపులుగా విడిపోయి సిగపట్లు పడతారు సార్‌! అదంతా మన కెమెరాలు 24 గంటలు capture చేసి ప్రసారం చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎవడు చూస్తాడయ్యా? మీకు తెలీదు సార్‌!  ప్రపంచంలో అందరికీ పక్కోడి జీవితంలో ఏం జ