పోస్ట్‌లు

డిసెంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః

  హలో,హలో,డాక్టర్‌!  ఈమధ్య నాలో వయెలెన్స్ ఎక్కువైపోయి కసాక్‌ కసాక్‌మని ఏసెయ్యాలనిపిస్తోంది.  అర్జెంటుగా ట్రీట్మెంట్‌ ఇవ్వండి డాక్టర్‌! ఆగండాగండి. నింపాదిగా ఈ కుర్చీలో కూచోండి ముందు. ఉదయం నుండీ మీ దినచర్య ఏమిటో చెప్పండి? పొద్దున్నే న్యూస్‌ పేపర్లో కసాక్‌ కసాక్‌ నేర వార్తలు బ్రౌజ్‌ చేయడం నా హాబీ డాక్టర్‌!  పొద్దున్నే నేర వార్తలేంటండీ? అవి చదువుతుంటే కిక్కొస్తుంది డాక్టర్‌!  చదివాక మాత్రం బీపీ వస్తోంది.  సరే,తర్వాతేంజేస్తారు?  తర్వాత టిఫిన్‌ చేస్తూ కసాక్‌ కసాక్‌ నేరాలు,ఘోరాలు టీవీలో చూస్తా డాక్టర్‌!  టిఫీన్‌ చేస్తూ కూడానా? సరే, తర్వాత? భోం చేసి నిద్ర పోతా. పొద్దున చదివినవి, చూసినవి కసాక్‌ కసాక్‌లన్నీ కలల్లోకి వస్తాయి డాక్టర్‌! రావూ మరి? అప్పుడేంజేస్తారు? లేచి బీపీ టాబ్లెట్ వేస్కుంటా డాక్టర్‌! హుమ్‌.. బావుంది మీ వరస. మరి సాయంత్రాలేంజేస్తూ ఉంటారు? సాయంకాలం సిన్మాకెళ్తా డాక్టర్‌! ఓహో, ఎలాంటి సిన్మాలు చూస్తుంటారు? గండ్రగొడ్డలితో అడ్డంగా నరుకుతా, తాట తీసిన మొనగాడు, తుపాకీతో వంద హత్యలు ఇలాంటి కసాక్‌ కసాక్‌ సిన్మాలు చూస్తా డాక్టర్‌!  అవెందుకండీ మీకు? అవి చూస్తుంటే కిక్కొస్తుంది డాక్టర్‌!  చూసాక

నడమంత్రపు సిరిమంతుడు

  నోటితో మాట్లాడుతున్నాడు, నొసటితో నవ్వుతున్నాడు.  ఎవరండీ ఇతను?  😀😀 ఒకసారి “మీరు” అని మర్యాదగా మాట్లాడుతున్నాడు,  ఒకసారి “నువ్వు” అని అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎవరండీ ఇతను?  😀😀 ఒకసారి హుందాగా పెద్ద మనిషిలా ప్రవర్తిస్తున్నాడు. ఒకసారి చిల్లరగా చీప్‌గా ప్రవర్తిస్తున్నాడు. ఎవరండీ ఇతను?  😀😀 ఒకసారి గౌరవం ఇస్తున్నాడు. ఒకసారి ఛీత్కారంగా చూస్తున్నాడు. ఎవరండీ ఇతను?  😀😀 మాటి మాటికి తన ఉంగరాలు,  ఉంగరాల జుట్టు సవరించుకుంటూ ఎదుటి వారిని స్కాన్‌ చేస్తున్నాడు.  ఎవరండీ ఇతను?  అన్నింటికీ నవ్వేనా? అతన్ని గురించి ఇన్ని ప్రశ్నలడిగా.  మీరు ఈ ఊరి వారేగా? వివరం చెప్పండి?  అతనా? అతను ఈమధ్య కొత్తగా ధనవంతుడైయ్యాడులెండి. 😀 ఓ! అలా చెప్పండి. 

సభాపక్షులు

  1. అందరికీ నమస్కారం. మీవంటి పెద్దల ముందు మాట్లాడేంత గొప్ప వాడిని కాదు. నేను చాలా చిన్న వాడిని. నేనొక శుంఠని. మీవంటి మహామహుల ముందు నిలబడే అర్హత నాకు లేదు.  2.  ఈ వేదికను అలంకరించిన అధ్యక్షుడు పాపారావు గారికి, సెక్రెటరీ సుబ్బారావు గారికి,ఉపాధ్యక్షుడు ఎంకట్రావు గారికి, కమీటీ సభ్యులు విజయ లక్ష్మీ గారికి,పాపాయమ్మ గారికి, శివ వెంకట లక్ష్మీ నాగేశ్వరరావు గారికి… 3. ఇంతకు ముందు మాట్లాడిన కాజా రావు గారు నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు. కాబట్టి ఇంక నేను చెప్పడానికి ఏమీ మిగల్లేదు. 4. ఇంతకు ముందు మాట్లాడిన చీమా రావు గారు తెలుగు వద్దు అని మంచి పాయింట్‌ చెప్పారు. నేను తెలుగు కావాలి అని చెబుతూ వారి మాటలతో ఏకీభవిస్తున్నాను.  5. ఇంతకు ముందు మాట్లాడిన గురివింద రావు గారి మాటలు విని నా శరీరం రోమాంచితమైంది, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి,గొంతు గద్గదమైంది. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నోట మాట రావడం లేదు.  6. “ద్రాక్ష తోటలోకి చెప్పవె రూటు” అన్న అద్భతమైన పాట మొదటిసారి వినగానే పరవశించా. అటువంటి వాక్యాలు రాయాలంటే పెట్టి పుట్టాలి. జయమాలినీ కటాక్షం ఉండాలి. ఇంకా వీరు  “అత్తమ్మ కూతురికి అర ఎకరా రాసిస్తా“, “అబ్బా నీ జబ్బ

అహో!శ్రీ విష్ణు వేద రాయా!

  కులం A :  శ్రీ విష్ణు వేద రాయలి పిన్నమ్మది మా కులమే అని “మండపేట రహస్యం“ అన్న పుస్తకం మొదటి version‌ లో ఉండుద్ది.  కానీ ఆ version పోగొట్టుకు పోయింది.  ఇప్పుడు దొరికే version లో దొంగ నాయాళ్ళు కొంతమంది ఆళ్ళ కులమని మార్చి రాసుకున్నారు. ఆళ్ళ సంగతి తేలుత్తాం. మండపేట రహస్యం మొదటి versionలో  వేద రాయలి ఒంట్లో ఎర్ర రక్త కణాలు - లెఫ్‌,రై,లెఫ్‌,రై,ఎబౌట్‌ టా..ర్న్!  తెల్ల రక్త కణాలు - రై,లెఫ్‌,రై,లెఫ్‌,ఎబౌట్‌ టా..ర్న్!  అని మార్చింగ్‌ చేస్తయ్యని  తొంబైయ్యారో పేజీలో ఉండుద్దంట!  మాకూ అంతే! సేమ్‌ టు సేమ్‌! కనక శ్రీ విష్ణు వేద రాయలు మావోడే! మావోడే! మావోడే! కులం B : శ్రీ విష్ణు వేద రాయలి నాలుగో భార్య మా కులమేనని  అనకాపల్లి ఎనకాల చెనిక్కాయల పల్లిలో శిలాశాసనం ఉండేదంట.  అది రోడ్‌ వైడనింగ్‌లో పోయిపోచ్‌!  దాని కోసరం ఎతకతాన్నాం.  తవ్వతాన్నాం.  అంచేత వేద రాయల్ది మా కులమే! కులం C :  శ్రీ విష్ణు వేద రాయలు మా ఖులం వాఢేనని ఛెప్ఫడానికి  హెన్నో హెన్నెన్నో ఆధారాలుయ్యని ఛెప్ఫడానికి  హెంథో సంతోషిస్తున్నాని,  ఆనందిస్తున్నానని, పులకరిస్తూ ఫలవరిస్తున్నాని  ఢంఖా భజాయింఛి థెలియజేసుకుంఠున్నాను! అహో, వారి విద్యానగరంలో ఒఖ గో

మా తెల్గు థల్లి!

  క్రౌంచ ద్వీపంలోని ఓ నగరంలో తెలుగు మహా సభ జరుగుతోంది.  మహామహులంతా విచ్చేసారు. మొదటి మహామహుడు లేచి, నాకు తెల్గు అంటే ప్రాణం. ఛిన్నప్డు పజ్జాలు రాషేవాడ్ని. ఆఫ్‌కోర్స్, ఇప్డు రాయ్‌డం లేదన్కోండీ. నేనిప్డు వేరే సైన్సెస్‌ స్టడీ ఛేస్తున్నా. ఇప్డు ఇక్డా మన కిడ్స్కి తెల్గు అదీ అంతా వేష్ట్.  There is no use,you know? అంద్కని తెల్గు వడ్డు అని అంద్రికీ request ఛేస్తున్నా. Thank you. అని కూచున్నాడు. చప్పట్లు మారుమోగాయి.  ఎవరండీ ఈయన, రూథర్‌ ‌ఫార్డ్ తెలుగు మాట్లాడుతున్నాడు? అడిగాడు బ్రహ్మీ పక్కనున్న తెలుగు వాడిని. ఈయన ఇక్కడ తెలుగు సాహిత్యానికి కుడి భుజం. సాహితీ రావని, చాలా పేరున్నాయన అన్నాడు తెలుగు వాడు.  రెండో వక్త పైకి లేచి, మన్ది తెలుగు అచ్ఛీ భాషా హై. కానీ ఈ దేషంలో మన పిల్లల్కి తెల్గు వచ్చేకి లేదు హై. అంద్కని వేరే వేరే భాష్లు మనం నేర్వాలి హై. అవి తెల్గు కన్నా ఈజీ హై. కానీ పిల్లల్కి ఆ ఆ భాషాఓం మే tuition కి జరూరత్‌ హై. నమస్కార్‌. అందర్కీ షెలవ్‌. అని కూచున్నాడు. చప్పట్లు మారుమోగాయి.  ఎవరండీ ఈ హై హై నాయకా? అడిగాడు బ్రహ్మీ పక్కనున్న తెలుగు వాడిని.  ఈయన ఇక్కడ తెలుగు బాద్‍షా అండీ, చానా పేరున్నాయన అన్నా

రామో విగ్రహవాన్‌ ధర్మః సాధుః సత్య పరాక్రమః 🚩

  సాహితీ సభకు తన స్నేహితుడు రాముని వెంటబెట్టుకుని వచ్చాడు గోపాల్‌.  ఒక వక్త లేచి, అసలు రామాయణం అంతా వ్యవసాయం గురించిన కతే  అన్నాడు. ఆ మాట విని రాము అదిరి పడ్డాడు.  ఆయన ఏమంటున్నాడు గోపాల్‌? అన్నాడు అయోమయంగా. ప్రజలకు ఆరాధనీయమైన ఇతిహాసాల మీద ఇలా ఎప్పటికప్పుడు వెర్రైటీ చూపులు కనిపెట్టడం వీళ్ళకు మామూలే అన్నాడు గోపాల్‌ నవ్వుతూ.  రామాయణంలో జనకుడు వ్యవసాయం చేసాడు. అప్పుడు సీత దొరికింది. అంటే పంట చేతికొచ్చింది.  అదేమిటి? జనకుడు మిథిలకు రాజు కదా. సంతానం కోసం యాగం చేస్తూ అందులో భాగంగా భూమిని దున్నబోతే సీత దొరికింది అన్నాడు రాము అయోమయంగా.  రాజైనా సరే వ్యవసాయమే చేసి బతికేవాడని ఈయన సిద్ధాంతం అన్నాడు గోపాల్‌ నవ్వుతూ. రాముడు వ్యవసాయ యోగ్యమైన భూమిని కనిపెట్టడానికి సీతను తీసుకుని అడవికి బయల్దేరాడు.  ఏంటి గోపాల్‌ ఇతను చెప్పేది?  పట్టాభిషేకం మానుకుని రాజ కుమారుడు భార్యను తీసుకుని నార బట్టలు కట్టుకుని, పరివారాన్ని వదిలి నడుచుకుంటూ వ్యవసాయ యోగ్యమైన భూమిని కనుక్కోవడానికి బయల్దేరాడా? హాస్యాస్పదంగా లేదూ?   ఈ వినే పెద్ద మనుషులంతా ఎలా వింటున్నారో?  అన్నాడు రాము అసహనంగా.  వాళ్ళంతా ఈ బాపతే. రంధ్రాన్వేషణమ్మ శిష్యుల

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః

  అదేవిటే, బొట్టు లేకుండా ఉన్నావు? నేను బొట్టు పెట్టుకోవడం మానేసానక్కా! మానెయ్యడమేమిటే?  ఇంద ఈ పూలు పెట్టుకో. నేను పూలు కూడా పెట్టుకోవడం లేదక్కా! అయ్యో,అదేవిటీ?  ఇంత ఈ ప్రసాదం తీసుకో. నేను ప్రసాదాలు తినడం మానేసానక్కా! అదేవిటే?  పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌?  పిచ్చి కాదక్కా.  ఓ నెల క్రితం మతం మారా. అందుకే. ఓ! అలా చెప్పు.  ఎప్పటినించీ పట్టుకుందిదంతా?  ఆ మధ్య నాకు జబ్బు చేసింది కదక్కా.  అప్పుడెన్నో మొక్కులు మొక్కా.  ఆ సమయంలో ఆ మతం వాళ్ళు వచ్చి నాకోసం వాళ్ళ దేవుడిని అడిగితే.. తగ్గిపోయిందా?  అవునక్కా.  అందుకే మతం మారా. కొంచెం ఆగితే మన దేవుళ్ళే పలికేవారేమో?  ఆ tension లో అంత ఆలోచించలా అక్కా.  మన దేవుళ్ళు హాండ్‌ ఇచ్చారని అటు జంపైయ్యావన్న మాట! మరి పునర్జన్మని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావుగా? నీ గత జన్మల పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో కష్టనష్టాలు కలుగుతాయని మన నమ్మకం. మర్చిపోయావా?  నిజమేనక్కా. అలాగని ఊరుకోలేంగా.  నిజమే. దేవతలను సహాయం కోసం అడగవలసిందే.  అప్పుడైనా నీ గత జన్మ సంచితమైన కర్మల వల్ల  కలిగిన కష్టాలను తగ్గిస్తారే గానీ పూర్తిగా తీసెయ్యరని తెలియదా?  ఒకవేళ తీసివేసినా, దాన్ని మరో జన్మలో 

మీసాభాస

చిత్రం
  మీసాల గురించి విడాకుల దాకా వచ్చిందా?  అదేమిట్రా విడ్డూరం? అవున్రా.  మా ఆవిడ నిమ్మ కాయలు నిలబెట్టేంత పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాడినే చేస్కుంటా అని షరతు పెట్టింది.  “మీసాల సొగసులు” అన్నది తన అభిమాన పుస్తకమట! ఓస్‌! మీసాలే కదా అని పెళ్ళి నాటికి పెంచవచ్చులే అని సరేనన్నా.  తర్వాత? మీసం పెంచావా మరి? పెంచాలని ఎన్నో ప్రయత్నాలు చేసానురా.  “మీస వర్థినీ తైలం”,  “మీసకేశ సువర్థినీ తైలం”,  “పంచరత్న మీసతైలం”  లాంటివి ఎన్నెన్నో పేరొందిన మీస తైలాలు పట్టించా.  పని చేసాయా మరి?  ఉన్న మీసం ఊడింది! అయ్యయ్యో, అప్పుడేం చేసావ్‌? పెళ్ళి రోజు రానే వచ్చింది.  చేసేది లేక పెట్టుడు మీసంతో పెళ్ళి తంతు కానిచ్చా.  నా గుబురు మీసాలు చూసి మా ఆవిడ ఎంతో సంతోషించింది.  కానీ ఆవిడ సంతోషం ఒక్క రోజు కూడా నిలవలేదు.  పెళ్ళైన మరుసటి రోజు, అబ్బ! ఎంత బాగున్నాయో మీ గుబురు మీసాలు, దర్జాగా! అంటూ లాగబోయింది.  అప్పుడు? తప్పించుకుందామని శతవిధాలా ప్రయత్నించా.  కానీ మా ఆవిడ వదిలితేనా?  అలా లాగిందో లేదో ఇలా చేతిలోకి ఊడొచ్చాయి!  తర్వాత? తర్వాతేముందీ, నే మోసపోయాను దేవుడో అంటూ సోకన్నాలు మొదలు పెట్టింది. ఇదిగో, ఈ మీస రహిత భర్త నాకు వద్దు, నాకు మీ

IBCH

  సీతమ్మ మాయమ్మ నా favorite song తెల్సా? కానీ, రామాయణాన్ని వక్రీకరిస్తూ కథలు రాస్తారే, వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకునే వాళ్ళంటే నాకు మంట. వాళ్ళంతా అతివాదులు.  🤔 నాకు తెలుగంటే ప్రాణం. కానీ, స్పానిష్‌,జపనీస్‌ నేర్చుకోమని నా పిల్లలకు చెబుతా.  🤔 నేను దేవుడిని నమ్మను. కానీ వేదాల్లోని శ్లోకాలకు తెలుగు కవితలు రాస్తా.  🤔 మన పురాణాలన్నీ పుక్కిట పురాణాలేగా. నేను పురాణాలేవీ చదవలేదనుకోండీ.  🤔 నేను తెలుగు వాడిని కాబట్టి తెలుగు గొప్పది అనుకుంటా.  అలాగే ఎవడి భాష వాడికి గొప్ప. అందులో విశేషం ఏముందీ?  🤔 వాళ్ళు మన దేవుళ్ళని తిడతారనుకోండీ, అయితే ఏమిటి?  నేను మాత్రం మన దేవుళ్ళతో బాటు అందరు దేవుళ్ళనీ పూజగదిలో పెడతా. 🤔 ఎవరండీ, వీళ్ళంతా? పొంతన లేకుండా మాట్లాడుతున్నారు? 🤔 వీళ్ళా, వీళ్ళని Indian Born Confused Hindus అంటారులెండి! 😀  

The Alpha Animal!

  నీకు “ఆల్ఫా మేల్‌” అంటే ఏంటో చెప్తా విను.  పూర్వం ఆటవిక సమాజంలో గొప్ప బలవంతులు,ధైర్యశాలురు వేటకు వెళ్ళి జంతువుల్ని కొట్టుకొస్తే,  మిగతా బలం లేని జనాలంతా గుహల్లో కూచుని వీళ్ళకేసం ఎదురు చూస్తూ ఉండేవారు. అలా వేటకు వెళ్ళే వీరులే “ఆల్ఫా మేల్స్“.  నచ్చిన ఆడవారినందరినీ వీళ్ళే ఉంచేసుకునే వారు.  ఆడవారు కూడా ఆల్ఫా లనే కావాలనుకునే వారు.  కానీ మరి మిగతా బీటా,గామా,కప్పా గాళ్ళకి కూడా పెళ్ళాలు కావాలి కనుక తరువాత రోజుల్లో పెళ్ళి concept,ఒక భార్య,ఒక భర్త concepts వచ్చాయి. అర్థమైందా?  Interesting! ఇంకా చెప్తా విను. ఆల్ఫా మేల్‌ తనకు నచ్చిన ఫిమేల్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు.  అడ్డొచ్చిన వాళ్ళ వాళ్ళందర్నీ ఏసేసైనా తనకు నచ్చిన పిల్లను ఎత్తుకు పోతాడు.  అదేంటి? ముందు ప్రేమ,స్నేహంలాంటివి ఏమీ ఉండవా? అదంతా హంబక్‌!  అవన్నీ చేతగాని బీటా,గామా,కప్పా గాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు.  ఆల్ఫా మేల్‌ direct action లోకి దిగుతాడు! మరి సంప్రదాయం,కులం,ఆచారం? అదంతా ట్రాష్‌! సొసైటీ నడవడం కోసం పెట్టుకున్నారు.  అసలు ఆల్ఫా మేల్‌ ని చూడగానే అమ్మాయిలు అవన్నీ వదిలేసి వచ్చేస్తారు.   ఓ! అవునా? అది సరే, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావ్‌?  న