పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

దీపావళి రోజు గాల్లోకి ఎగిరిన వామాసురుడు!

  వామాసురుడు: దీపావళి రోజు టపాసుల వల్ల ఎంత కాలుష్యం! టపాసు రహిత పండుగ చేస్కోండి. హిందూ బంధువు: మంచి మాట చెప్పారు. మరి, మనది కాని ఆంగ్ల సంవత్సరాది రోజు, ఎన్నికలప్పుడు సంబరాల్లోను,ఇంకా పెద్ద పెద్దల పెళ్ళిళ్ళలోను, సంబరాల్లోను టపాసులు విపరీతంగా మోగిస్తారుగా. వాటి గురించి మాట్లాడరేమి?  వామాసురుడు: అదంతా అప్రస్తుతం. వేటి గురించి మాట్లాడమని మా సెంట్రల్‌ కమిటీ చెబుతుందో అవే మాట్లాడతాం. పండగ పేరుతో కాలుష్యం వ్యాప్తి చేస్తున్నందుకు సిగ్గు పడండయ్యా! హిందూ బంధువు: మిగతా చాలా విషయాల్లోలాగే హిందువుల్లో అపరాధ భావం అదే guilt feeling తెప్పించడానికి ప్రచారం చేస్తున్నారన్న మాట. అయినా మాకున్న పండుగల్లో టపాసులు కాల్చుకునే ఏకైక పండుగ దీపావళి. సంవత్సరానికి ఒక్క రోజేగా. వామాసురుడు: అసలు దీపావళి రోజు టపాసులు పేల్చే ఆచారం ముందునించీ లేదని తరువాత ప్రచారంలోకి వచ్చిందని మా వామపక్ష చరిత్రకారులతో చరిత్రను మరగేసి రాయిస్తున్నాం. దాంతో అందరూ గందరగోళంలో పడతారు. అదే మా పాత వ్యూహం. ఇక్కడ వాడుతున్నాం. హీహీ.. హిందూ బంధువు: ఓ! అసలెందుకు హిందూ పండుగల మీద మాత్రమే ఇలా దాడి చేస్తున్నారు?  వామాసురుడు: హిందువులని అపరాధ భావానికి, ఆ

తెలంగీ - బేడంగీ

  నేను తిరగా భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని తెలుగులోకి, ఇంగ్లీషులోకి తెస్తా. అమ్మా, ముందు నువ్వు తెలుగు బాగా నేర్చుకో తల్లీ! ఆ తిరగా భాష నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. నీకెందుకమ్మా? తిరగా భాష నేర్చుకుని, ఆ విప్లవం అంతా తెలుగులో పోస్తా. అమ్మా, ఈ నేల మీద ఒకప్పుడు తెలుగు మాట్లాడితే నేరం. తెలుగు గొంతు నులిమారమ్మా. తెలుగు వాడు తెలుగు మరచి రాజ్య భాష నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యంలో తరాలు గడిచాయమ్మా. నేను తిరగా భాషే నేర్చుకుంటా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలని ఎర్రక్క,ఎర్ర వదినెలు నన్ను ప్రోత్సహిస్తున్నారు. అమ్మా, ఈ రాజ్యంలో తెలుగు దిక్కు లేనిది అన్నారమ్మా. ముక్కు మొహం లేని భాష అని ఎగతాళి చేసారమ్మా.  తెలుగు తల్లిని చావు అంచుకు తీసుకెళ్ళిన పిశాచి రాజ్యంలో బతికామమ్మా మేమంతా.  అమ్మా, అమ్మా, తెలుగు నేర్చుకో. ఆ భాష మనకెందుకమ్మా?  కార్యాలయాల్లోను, దుకాణాల్లోను,బడిలోను, దవాఖానలోను తెలుగులు వంగి వంగి సలాములు కొడుతూ రుద్దబడిన భాషలో బతుకులు సాగించారమ్మా ఆనాడు.  అమ్మా, అమ్మా, తెలుగు నేర్చుకోమ్మా. ఆ అన్య భాష నీకెందుకమ్మా. ఇదంతా నాకు పట్టదు. నేను తిరగా భాషలో అనువాదాల గురించి ఎర్ర చీర కట్టుకుని progressive రచ

ఇదేమిటబ్బా? ఇది అదేను అబ్బా! -1

  మేము స్త్రీల కోసం పోరాటం చేసే వాళ్ళం. ఓహో, అలాగా. చాలా సంతోషమండీ.  పాపం, ఆడవారి కష్టాలు తీర్చడం కోసం పని చేసేవారన్న మాట.  అంటే, వారి కాపురంలో కలతలు అవీ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి రాజీ కుదురుస్తారాండీ?  అవన్నీ చేయడానికి మేమేమన్నా వాళ్ళ ఇంటి పెద్దలమా లేక కుల పెద్దలమా?  మేం స్త్రీలను చైతన్యపరుస్తాం!  ఓహో, అంటే వాళ్ళని చదువుకోమని, ఉద్యోగాలు చేయమని ప్రోత్సహిస్తారా?  అవును, చైతన్యం పొందిన స్త్రీ చదువుకుంటుంది, తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. చాలా మంచి పని చేస్తున్నారు. చదువున్న గృహిణి కుటుంబాన్ని దిద్దుకుంటుంది. ఉద్యోగం చేస్తే కుటుంబానికి ఆలంబనగా ఉంటుంది. మేం స్త్రీలను చైతన్యపరిచేది మళ్ళీ ఆ కాపురమే దిద్దుకుని, జీతమంతా భర్తకి, కుటుంబానికి ఖర్చు పెడుతూ బానిసలా పడి ఉండమని కాదు.  మరి? చైతన్యం పొందిన స్త్రీ బానిసలా పడి ఉండదు.  తన విలువ తెలుసుకుంటుంది.  తాను పిల్లల్ని కనే యంత్రం కాదని తెల్సుకుంటుంది.  పిల్లల్ని ఆడవారే కనాలేమో కదండీ?  అవును, ప్రకృతి స్త్రీకి అన్యాయం చేసింది.  ఆ పిల్లలను పెంచే భారం సమాజం తల్లుల నెత్తినే పడేసింది.  తన పిల్లలను తనే పెంచుకోవాలని ప్రతి తల్లీ అనుకుంటుంది కదండీ?  ఏమిటో న

మతిలేని గమ్మత్తయ్యకు సంగీత వాత

  గమ్మత్తయ్య కొత్తగా అధికారంలోకి వచ్చాడు.  గమ్మత్తయ్యకో  మతం ఉంది. అది రెట మతం. గమ్మత్తయ్యకో వాదం ఉంది. అది పెడ వాదం.   ఓ రోజు గమ్మత్తయ్య పళ్ళు తోముకుంటుంటే కిచ్‌ కిచ్‌ మని శబ్దం రావడం గమనించాడు.  కిచ్‌ కిచ్‌ కిచ్‌కిచ్‌ కిచ్‌! కిచ్‌ కిచ్‌ కిచ్‌కిచ్‌ కిచ్‌! అందులో ఒక కొంగొత్తైన లయ ఉందని తోచి గమ్మత్తుగా ఎగిరి గంతేశాడు గమ్మత్తయ్య. పళ్ళు తోముకుని కిటికీలోంచి బయటకు చూస్తే గుర్రాల సకిలింపు వినబడింది.  అందులోనూ ఒక గమ్మత్తైన లయ ఉందని తోచింది గమ్మత్తయ్యకు. తరువాత రథం మీద అలా వ్యాహ్యాళికి బయలుదేరాడు గమ్ము. గుర్రాలను ఛెళ్‌ ఛెళ్‌ మని కొడుతున్న శబ్దంలోను,  గుర్రాల గిట్టల డుగ్‌ డుగ్‌ చప్పుడులోను,  రథ చక్రాల జుక్‌జూ జుక్‌జూ తిరుగుడులోను  లయ ఉందని,  సంగీతం దాక్కుని ఉందని  గమ్మత్తయ్యకు గబుక్కున తోచి పోయింది. ఇంతలో దోవలో పల్లె పడుచుల హుం హుం అని దంపుళ్ళ చప్పుళ్ళు,  దంచవే దంచు! దం దం దంచు! గమ్మత్తుగా దంచు!  అన్న వారి పాటలు,  ఒహోం ఒహోం బీం! ఒహోం ఒహోం బీం!  హైసా! హైసా! అన్న పల్లకీ బోయీల పలుకుల్లో లయను గమనించి పులకలెత్తి పోయాడు గమ్మత్తయ్య. అన్నిటా అంతటా సంగీతమే నిండి ఉన్నట్టు మత్తుగా గమ్మత్తుగా అనుభూతి  చెం

హవ్వ! లిపి ఎరుగని మూఢులమట! - 1

  మహామహులతో సభ జరుగుతోంది.  సభికుల్లో చాలామంది మెకాలే మానస పుత్రులుగాను,  బ్రిటీషు వాడి బాబాయి కొడుకులుగాను ఉన్నారు.  వెనుక వరుసలో ఒక వేద పండితుడు, ఆయన పక్కన తెలివైన తెలుగువాడు కూర్చుని ఉన్నారు.  మహామహుల్లో ఒక మహామహుడు తన ప్రసంగం మొదలెట్టేడు.  “మనకి వ్రాత తెలియదు. దర్షియా వాళ్ళు వాళ్ళు గాడిదల మీద వచ్చి మనకు నేర్పించారు” అలా అంటాడేమిటండీ,  వేదాలలో అక్షర,కాండ,పటల, గ్రంథ అన్న పదాలున్నవి కదా? ఐతరేయ బ్రాహ్మణంలోను, శ్రౌత సూత్రాలలోను “పటలం” అని గ్రంథ భాగాన్ని తెలిపే పదం (Chapter) అనేకమార్లు వస్తుంది.  అన్నాడు వేద పండితుడు పక్కనున్న తెలివైన తెలుగువాడితో. ఆ ఆధారాలేవీ పనికి రావని పెడవాదం చేస్తున్నాడండీ అన్నాడు తెలివైన తెలుగు వాడు. “మనకు మొదట లిపి లేదు. తర్వాతెప్పుడో వచ్చింది. మనదంతా మౌఖికమే”  ఉతత్వః పశ్యన్ నదదర్శ వాచం ఉతత్వః శృణ్వన్ నశృణేత్యేవామ్  ( 10-071-04) కొందరు వేద వాక్కును చూచీ చూడరు, కొందరు వినీ వినరు అని ఋగ్వేదంలో లిపి ప్రశంస ఉంది కదయ్యా! చూచీ చూడరు అంటే, వ్రాసి ఉంది చూసీ చూడరు అనే కదా అర్థం అన్నాడు వేద పండితుడు. ఆ ఆధారాలేవీ పనికి రావని పిడివాదం చేస్తున్నాడండీ అన్నాడు తెలివైన తెలుగు వాడ

జననీ శతపత్ర స్వర్ణ సీమా!

  అది శతపత్రానదీ తీరం.  కొన్ని వేల ఏళ్ళుగా నాగరికత వర్థిల్లుతూ వస్తున్న తీరం. అందుకని అక్కడి ప్రజలు మాది శతపత్రి అని చెబుతారు. మేం శతపత్రోళ్ళం అంటారు అక్కడి పల్లె ప్రజలు. శతపత్రానది అంటే పూజనీయం ప్రజలకు. ఆ నదీతీరంలో శతపత్రమ్మ తల్లి గుడి కూడా ఉంది,  శతపత్రోళ్ళను తమ చల్లని చూపులతో కాపాడుతూ. అక్కడ బంగారం పండుతుంది. అందుకని అక్కడి ప్రజలు మాది స్వర్ణ సీమ అని చెబుతారు. మేం సొర్నసీమోళ్ళం అని అంటారు అక్కడి పల్లె ప్రజలు. అక్కడ విలసిల్లుతోంది అలా ఆ శతపత్ర స్వర్ణసీమ. ********* అయితే అప్పటి అక్కడి ప్రభువులకు ఒక ఆలోచన వచ్చింది. ఆ రాజ్యానికి తమ నాయకుడు పిచ్చయ్య పేరు పెట్టాలని.  ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి సీమ” గా నామకరణం చేయబడ్డది. జనం ఇదేమీ పట్టించుకోలేదు. శతపత్రి అని, సొర్న సీమ అని ఎప్పట్లాగే చెప్పుకున్నారు. కొందరు మాత్రం పిచ్చయ్యకు పిచ్చి అభిమానులుగా మారారు. ********* తరువాత కొన్నేళ్ళకు కొత్త ప్రభువులు రాజ్యాన్ని ఏలడానికి వచ్చారు. ఆ ప్రభువులకు ఆ రాజ్యానికి తన నాయకుడు పుల్లయ్య పేరు పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ మరుసటి రోజే ఆ సీమ, “పిచ్చి పుల్లయ్య సీమ” గా నామకరణం చేయబడ్డది. జనం ఇదేమీ పట్టించుకోలేదు.

పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాః

  జీవితమంటే పోరాటం. ఊ…ఇంటా బయటా ఎంతోమంది శత్రువులుంటారు. వారిని ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు ఎదురౌతాయి.   ధైర్యంగా నిలబడాలి.తెలిసిందా? అలాగే ఎదుర్కుంటా సార్‌!  కానీ జీవితమంటే పోరాటాలు,కష్టాలేనా సార్‌!?  హేపీగా జాలీగా ఎంజాయ్‌ చెయ్‌డం ఏమీ ఉండదా సార్‌? ఉంటుంది.  కానీ, అలా ఎంజాయ్‌ చేస్తున్నంత సేపూ ఇది శాశ్వతం కాదు, ఇది క్షణికం, ఇది క్షణికం అనుకుంటూ ఉండాలి. తెలిసిందా? సరే సార్‌!  ఎంజాయ్‌ చేస్తున్నంతసేపూ ఇది క్షణికం,ఇది క్షణికం అనుకుంటూ ఉంటా.  Very good. దాన్నే ఎఱుక అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏడవరాదు.  సుఖాల్లో ఉన్నప్పుడు నవ్వరాదు.  సరే సార్‌!  కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వుతా.  సుఖాల్లో ఉన్నప్పుడు ఏడుస్తా.  Wonderful ! నీకు వేదాంతం బాగా వంటబడుతోంది.  కానీ చుట్టూ జనం నన్ను చూసి పిచ్చివాడనుకుంటారేమో సార్‌!  ఒక పని చేస్తా సార్‌, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా  మొహంలో ఏ భావము ప్రకటించకుండా నీలుక్కుని కూచుంటా. Super! అలా చెయ్యి.  దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు.  కోపమొచ్చినా,  ఏడుపొచ్చినా, నవ్వు వచ్చినా  అంతా మొత్తం లోపలికి మింగి వేయడమే యోగి లక్షణం.  తెలిసిందా?  తెలిసింది సార్‌!  ఇప్పుడే అన్నీ మింగేశా సార్‌!