పోస్ట్‌లు

మార్చి, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 4

చిత్రం
  మొద్దు కిష్నా,మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతం ప్రత్యేకత ఏమి? ఏమీ లేదు! అన్ని గీతాలు,సంగీతాలు అంతా ఒకటే! ఒక్కో కృతి వింటే ఆయా దేవతే ప్రత్యక్షమైనట్టు తన్మయం చెందుతారే ప్రేక్షకులు. నీకెప్పుడైనా అలా అనిపించిందా?  అదంతా హంబక్‌! నాకెప్పుడూ అలా అనిపించలా! మానసిక మ్లేచ్ఛులకి అటువంటి అనుభూతులు కలిగే అవకాశం లేదులే, మొద్దు కిష్నా! అవును, కర్ణాటక సంగీతం విని ఆనందించాలన్నా రసికత కావాలి కదా, మొద్దు కిష్నా?  అందుకే అందులో మసాలా కలిపి అందరికీ వడ్డిస్తున్నా! అలాగైతే దాని విశిష్టత కోల్పోతుంది కదయ్యా, మొద్దు కిష్నా?  విశిష్టతలు వంకాయలు ఇక్కడేమీ లేవు!  బాగు,బాగు.  నీకు సంగీతం నేర్పిన గురువులు ఎంత కుమిలి పోతున్నారోనయ్యా, మొద్దు కిష్నా!  అవునూ, బ్రామ్మిన్‌ గురువులు విదేశీయులకి కూడా సంగీతం నేర్పారుగా. దానికేమంటావ్‌?  జాన్‌ హిగ్గిన్స్ భాగవతార్‌ పేరు విన్నావా? అమెరికన్‌ కర్ణాటక సంగీత గాయకుడు! కచేరీ చేసేటప్పుడు “రామ” అని వచ్చినా “దేవా” అని వచ్చినా ఆ పదాలు వచ్చిన చోటల్లా నమస్కారాలు చేసేవాడట! నేర్పితే నేర్పి ఉండవచ్చు.  కానీ బ్రామ్మిన్‌ డామినేటింగ్‌ అంటున్నా! మరి హిందుస్తానీ సంగీతం ఎవరి డామినేటింగో చెప్పు?  హిందుస

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 3

  మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, నువ్వెందుకింత రెబెల్‌ అయ్యావ్‌? ఈ కర్ణాటక సంగీతం అంతా బ్రామ్మిన్సే! దాని మీదే నా తిరుగుబాటు! నాన్‌ బ్రామ్మిన్స్ చానామంది ఉన్నారుగా మొద్దు కిష్నా?  పురంధర దాసు, ఏసుదాసు, బెంగుళూరు నాగరత్నమ్మ ఇలా ఎంతోమంది? ఈ బ్రామ్మిన్‌ గురువులది స్వకులాభిమానం! పైన చెప్పిన వాళ్ళందరి గురువులూ బ్రామ్మిన్సేగా మొద్దు కిష్నా?  అదంతా కాదు, కర్ణాటక సంగీతం అట్టడుగు ప్రజల్లోకి వెళ్ళకుండా కుట్ర జరిగింది!  దాని మీదే నా పోరాటం!  అదే నా ఆరాటం! ఏ దేశంలోనైనా శాస్త్రీయ సంగీతానికి  ప్రేక్షకులు తక్కువ,  పాప్‌ సంగీతానికి ప్రేక్షకులు చాలా చాలా ఎక్కువ కదా, మొద్దు కిష్నా?  అందుకే శాస్త్రీయ సంగీతాన్ని వేరే వేరే సంగీతాలతో కలిపి కిచిడి చేసి ప్రజల్లోకి తీస్కెళ్తున్నా!  ఆవకాయలో చికెన్‌ బిర్యానీ కలుపుతున్నా!  ఓహో, ఇదీ కురుడియారే చెప్పాడా?  కురిడియార్‌ భక్తుడ్ని అయ్యాకే రాముడిని వదిలేసి కలి పురుషుడి ఫాలోయర్‌ అయ్యా!  ఓహో, అప్పట్నించీ నీ నెత్తిన దెయ్యం ఆడ్డం మొదలైనట్టుంది! దెయ్యం ఏమిటి? దెయ్యం?  ఆ తర్వాతే నాకు రోమన్‌ తోసేసెయ్‌ అవార్డు వచ్చింది‌, తెలుసా?  వామ్మో, ఈ అవార్డు తీస్కున్న వాళ్ళంతా ఆ తర్వాత మటా

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 2

  మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతమంటే ఏమిటి?  రాగాలు, ఆలాపనలు,technicalities,talent అంతే! మరి భావం, భక్తి,సాహిత్యం? భక్తి గిక్తీ ఏమీ లేదు! మరి త్యాగరాజు,పురంధర దాసు వీళ్ళంతా?  అంతా ట్రాష్‌! అసలు కర్ణాటక సంగీతానికి మతానికీ సంబంధం లేదు! సంగీత జ్ఞానము భక్తివినా సన్మార్గము గలదే  అన్నాడే త్యాగయ్య? నువ్వు భక్తిని పక్కన పెట్టి కేవలం technicalities, చమక్కులు ప్రదర్శిస్తే ఆ కీర్తనల పవిత్రత పోదూ?  పవిత్రత గాడిద గుడ్డు ఏమీ లేదు! కర్ణాటక సంగీతం, సాహిత్యం సనాతన సంస్కృతికి చెందినవి. నాదోపాసనతో భగవంతుని చేరుకోవచ్చుననే విశ్వాసంతో భక్తితో నేర్చుకుని ఆలపించేవి, అన్నీ హిందూ దేవీ దేవతల మీద వ్రాసిన కీర్తనలే కదయ్యా, మొద్దు కిష్నా? మతానికి కర్ణాటక సంగీతానికి సంబంధం లేదు.  నేనింకనించీ రోజుకి రెండు కీర్తనలు వేరే మతాల దేవుళ్ళ మీద రాసి త్యాగరాయ కృతుల బాణీలో పాడతా! ఇదే నా ఛాలెంజ్‌!  బస్తీ మే సవాల్‌!   బాగుందయ్యా,మొద్దు కిష్నా!  ఓ పని చెయ్యి, వేరే మతంలోకి మారి అప్పుడు రాముడి మీద, కృష్ణుడి మీద,శివుడి మీద కృతులు రాసి పాడి చూడు. సరేనా?  నేను ఏ మతాన్ని ఫాలో అవను కానీ హిందూ మతాన్ని వ్యతిరేకిస్తా! నాదంతా కుర

తెలుగు పాట-ప్లేటు పూరీ - 3

  పాదం మీద పుట్టు మచ్చైతే  తోడబుట్టిన రుణం ఎట్టా తీరుద్ది తమ్మీ? కవి గారి అందమైన ఊహ అనుకోరాదా అన్నాయ్‌? అది గాదు తమ్మీ. చెల్లికి ఆపదొచ్చిందనుకో, పాదం మీద పుట్టు మచ్చ ఏమన్నా కాపాడతాదా పెడతాదా? నిజమేనన్నాయ్‌! జన్మలు, పునర్జన్మలు ఈ కమ్మీనిష్టులు నమ్మరు గదా.  మరి పాదం పుట్టు మచ్చ అవ్వాలంటే ఇంకో జన్మ ఎత్తొద్దూ? బాగా చెప్పావన్నాయ్‌!  పాదం మీద మచ్చ అవడమంటే అన్న చెల్లి కాళ్ళు పట్టుకున్నట్టు అవదూ?  అయినట్టే ఉందన్నాయ్‌! అది గాదు తమ్మీ, మచ్చలు, మరకలు వల్ల చెల్లికి ఏం ఉపయోగమంటున్నా? వదిలెయ్‌, అన్నాయ్‌! చెల్లి మీద ప్రేమతో ఏదో అన్నాడు. ఏదో అనేదేంది తమ్మీ? అర్థం సరింగా ఉండాల గదా?  సరేగానీ, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అంత వరకూ బానే ఉంది.  ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులా?  పోయినోళ్ళకి తీపి గురుతులుంటయ్యా?  నిజిమే తమ్మీ. ఎప్పుడూ ఆలోచించలా! “ఉన్నోళ్ళకి పోయినోళ్ళు తీపి గురుతులు” అని గదా ఉండాలి?  ఏదో రాసాడు సెంటిమెంటల్‌గా. వదిలెయ్‌, అన్నాయ్‌! 

సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 1

  మొద్దు కిష్నా, మొద్దు కిష్నా, తిరు చూర్ణం తుడిపేసుకున్నావే? అదంతా బ్రామ్మినికల్‌. నేనిప్పుట్నించీ free spirited man!  సరే,అదేంటి,టోపీ పెట్టుకుని లుంగీ కట్టుకుని ఎక్కడికి బయల్దేరావ్‌? సంగీత కచేరీ ఇవ్వడానికి! ఈ వేషంతోనా? ఇంతకీ ఎక్కడా కచేరీ? రైల్వే స్టేషన్‌ మెట్ల మీద! అదేంటీ? సంగీత సభలో కాదా? కాదు. సంగీత సభలంటే నాకు అసయ్యం.  బాయ్‌కాట్‌ చేసా! ఇప్పుడు చేపల మార్కెట్‌లో,  కూరగాయల బజారులో,  బస్‌ స్టాండ్‌,  రైల్వే స్టేషన్‌,  చెత్త కుండీల పక్కన కచేరీలు చేస్తున్నా!  ఎందుకూ అక్కడికెళ్ళి పాడ్డం?  అక్కడ బీదా బిక్కీ, కూలీ నాలీ నా పాట విని liberate అవ్వాలి! అదే నా ఆశయం! ఓహో, రుద్రవీణలో చిరంజీవి టైపా?  మరి వాళ్ళకి నీ కర్ణాటక సంగీతం ఎక్కుతుందంటావా?  నీ ఆలాపన అయ్యేటప్పటికి అంతా నిద్ర పోతారేమో?  అందుకే బిళహరి రాగంలో లుంగీ డాన్స్ పాటని  త్యాగరాజు కృతి స్టైల్లో పాడతా!  అదేంటి, అసలైన త్యాగరాజ కృతులు కదా నువ్వు నేర్చుకుంది? అవంటే నాకు అసయ్యం.  అవన్నీ బ్రామ్మినికల్‌, కాస్టిస్ట్, మేల్‌ డామినేటింగ్‌ ఇంకా బ్లా బ్లా బ్లా!  అందుకే వదిలేసా! అయితే అవింక అస్సలు పాడవా?  పాడ్తా.  వాటిల్లో మంచివి కొన్ని ఏరి, వాటిని సుబ

చాలదా హరినామ సౌఖ్యామృతము!

  భక్తి అంటే గుళ్ళ చుట్టూ పొర్లు దండాలు పెట్టడం కాదమ్మా.  అది మూర్ఖత్వం.  గుళ్ళ చుట్టూ తిరిగితే ఆయాసం వస్తుంది. అంతకు మించి ఏమీ ఉండదు.  అదంతా తీసి అవతల పారెయ్‌! అదేమిటండీ, గుళ్ళకి వెళ్ళొద్దంటున్నాడీయన? 🤔 భక్తి అంటే ఓ భజనలు చేయడం కాదమ్మా.  అది మూర్ఖత్వం.  భజన్లు చేసి చేసి  గొంతు అరిగిపోతుంది. అంతకు మించి ఏమీ ఉండదు.  అదంతా తీసి అవతల పారెయ్‌! అదేమిటండీ, భజనలు చేయొద్దంటున్నాడీయన? 🤔 భక్తి అంటే పొద్దస్తమాను పూజలు చేయడం కాదమ్మా.  అది మూర్ఖత్వం.  పూజలు చేసి చేసి అలసట వస్తుంది. అంతకు మించి ఏమీ ఉండదు.  అదంతా తీసి అవతల పారెయ్‌! అదేమిటండీ, పూజలు చేయొద్దంటున్నాడీయన? 🤔 ఈయన పూర్వాశ్రమంలో కమ్యూనిష్టు లెండి. ఇప్పుడు గాలి మళ్ళి ప్రవచనాలు చెబుతున్నాడు. అందుకనే వీరి ఆధ్యాత్మికతలో కూడా విప్లవం విలసిల్లుతూ ఉంటుంది. 😀 ఓ,అదా సంగతి! అయితే మాత్రం అలా మాట్లాడ్డమేమిటండీ?  ఇంతకీ ఈయన ఆస్తికుడేనా?  ఆస్తికుడే. కానీ, భక్తి అంటే గుళ్ళూ గోపురాలూ తిరగడం కాదు, ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నించాలి అని చెప్పాలని వీరి ప్రయత్నం! 😀 ఇవన్నీ చెయ్యకుండా ఎకాఎకీ ఆత్మజ్ఞానం ఎవరికి కలుగుతుందండీ, నాకు తెలియక అడుగుతాను? ముందు ఒకటో తరగతి

నా పేరొకపరి తలవండీ!

  మా సాహితీ వేదికకు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి బెరాల్గన్‌‌ పేరు పెడుతున్నాం.  బాబూ, నేను తెలుగులో రామాయణం వ్రాసిన మొల్లను.  నా పేరు తలవలేదే?  మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు.  బాబూ, నేను సుభద్రా కల్యాణం వ్రాసిన తాళ్ళపాక తిమ్మక్కను.  నా పేరు తలవలేదే? మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు.  బాబూ, నేను సంగీతంతోబాటు సాహిత్య రంగానికీ సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మను.  నా పేరు తలవలేదేమి? మాకు బెరాల్గన్‌ ఒక్కరే తెలుసు.  బాబూ, ఆ బెరాల్గన్‌ గారు ఏ విధంగా గొప్ప రచయిత్రి నాయనా? ఆవిడ రచనలు నువ్వు చదివావా? చదవలేదు.  ఆవిడ గొప్ప రచయిత్రి అని నాకు తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళు చెప్పారు.  అంతే కాదు, ఆవిడ బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత. ఓహో, అలాగా.  నన్నయ, తిక్కన,శ్రీనాథుడు వీళ్ళందరికీ ఏ అవార్డులు వచ్చాయి నాయనా? అదంతా నాకు తెలవదు. బెరాల్గన్‌ కే నా ఓటు. 

రచయిత-మనిషి

  న్యాయం, ధర్మం అని కతలు రాసే నేటి ఆధునిక రచయితలంతా  నిజ జీవితంలోను న్యాయంగా, ధర్మంగా జీవిస్తారంటారా? 😁😁 ఆడ వారి కష్టాల మీద కన్నీటి కతలు రాసే రచైతలు వాళ్ళ ఇళ్ళళ్ళో ఆడవాళ్ళని బాగా చూసుకుంటారంటారా?  😁😁 తెలియక పోతే తెలీదని చెప్పండి. నవ్వుతారే? రచయిత రచనలను మాత్రమే చూడాలి, రచయితను కాదు అన్న ఆధునిక సిద్ధాంతం మీకు తెలియనట్టుంది! 😁 ఓహో, అలాగా. అయితే రచయితను పట్టించుకోవక్కర లేదన్న మాట.  రచనలను చదివి ఊరుకుంటే సరిపోతుంది. అంతేగా?  అంతే గానీ, మరి చదివే సాహితీ అభిమానులంతా  నిజ జీవితంలో గొప్ప ప్రవర్తన కలిగిన వారా? 😁 నిజమేలెండి. అయితే ఏమంటారు?  రచయిత కనిపిస్తే నమస్కారం పెట్టాలా వద్దా?  అయ్యా, మీరు నిజ జీవితంలో అచ్ఛానో, లుచ్ఛానో నాకు తెలియదుగానీ,    మీలోని రచయితకు మాత్రం నమస్కారం చేస్తున్నాను అని చెప్పండి, సరి పోతుంది! 😁😁 అమ్మయ్యోయ్‌, అప్పుడుగానీ ఆ రచయితలోంచి అసలు మనిషి బయటికి రాడు! 😇

దిలీప ఇతి రాజేందుః - దిలీప The Hero!

  వాడు మనిషి మాంచి దిట్టంగా ఉంటాడు గానీ  పాపం చదువు అంటలేదు.  విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి కోవ అన్న మాట! వాడు బాగా చదువుకున్నాడు గానీ  మనిషి ఈసురోమంటూ ఉంటాడు. ఆరోగ్యమనే మహాభాగ్యం లేని అభాగ్యుడన్న మాట!  వాడు పెద్ద చదువులే చదివాడు గానీ  చదువుకు తగ్గ ఉద్యోగం లేదు.  అన్నీ ఉన్నాయి గానీ అయిదోతనం లేదని అదో సామెత.  ఏం చేస్తాం!  వాడు పెద్ద పెద్ద పనులు మొదలు పెడతాడుగానీ  ఏదీ కలిసి రాదు.  అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నమాట!  సరే గానీ, ఇంతమంది నమూనాలను గురించి చెప్పావు కదా,  అసలు అసలైన మనిషంటే ఎవరో దిలీప మహారాజు లక్షణాలను  చూసి నేర్చుకోవాలయ్యా! చెబుతా విను-  ఆకారసదృశ ప్రజ్ఞః ప్రజ్ఞాయా సదృశాగమః ఆగమైః సదృశారంభః  ఆరంభ సదృశోదయః అద్భుతమైన దేహబలముతో కూడిన ఆకారము కలవాడు,  ఆ ఆకారానికి తగిన ప్రజ్ఞ కలవాడు,  ఆ ప్రజ్ఞకు తగిన శాస్త్రపరిశ్రమ కలిగిన వాడు,  ఆ శాస్త్రపరిశ్రమకు తగిన గొప్ప పనులు కలవాడు,  ఆ పనులకు తగిన ఫలసిద్ధి గలవాడు అని దాని అర్థం.  తెలిసిందా?  బాగు!బాగు! మా నమూనాలకు ఈ శ్లోకం వివరిస్తాను! 

అవార్డుల ప్రహసనం!

  లేజీ కవి భావుకశ్రీ పేరిట పెట్టిన అవార్డును ఈసారి అవధాని గారికి ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం. భావుకశ్రీ గారి భావ కవిత్వానికీ అవధానాలకీ సంబంధం ఏమిటండీ? 😁😁 మహాకవి అరుణశ్రీ పేరిట పెట్టిన అవార్డును ఈసారి ప్రవచనకర్త గారికి ఇస్తున్నామని ప్రకటిస్తున్నాం. ఆ కమ్మీనిష్టు కవికి ప్రవచన కర్తకు సంబంధం ఏమిటండీ?  😁😁 అది కాదండీ,  సైద్ధాంతిక పరమైన ఏకత్వం ఉండాలి కదండీ?  పోనీ కనీసం శైలి, లేకపోతే వారి వారి సాహితీ ప్రక్రియలైనా కలవాలి కదండీ?  😁😁 నవ్వుతారేమండీ? నేనన్నది నిజమా కాదా? ఈ అవార్డులు ఇచ్చే వారికి బుద్ధి లేదు! పుచ్చుకునే వారికి సిగ్గు లేదు! అక్కడ చప్పట్లు కొట్టేవారికి బుర్ర లేదు! ఇంతకన్నా ఏం చెప్పమంటారు? 😀 అంతేలెండి. అవునూ, తెలియక అడుగుతా, దేశానికి, సంస్కృతికి శత్రువులుగా  రచనలు చేసేవారికి బీభత్స అకాడెమీ అవార్డులు ఎందుకిస్తారండీ?  ఆ అవార్డుల కోసం కవుల్ని రచైతల్ని ఎంపిక చేసే వారు కూడా ఆ బాపతు వారే కనుక! 😀 ఓహో, మళ్ళీ వీళ్ళే అప్పుడప్పుడూ ఆ అవార్డులు వాపస్‌ ఇస్తాం అని బెదిరిస్తుంటారేంటో అర్థం కాదు. అవార్డు పుచ్చుకోడమెందుకో,  కోపాలొచ్చినప్పుడు తిరగ్గొట్టడమెందుకో? ఆ అవార్డు ఇచ్చేటప్పుడే ఓ క్లాజ్‌

క్వ సూర్యప్రభవో వంశః

  మనిషి జీవితాన్ని సంగ్రహంగా చెప్పగలవా బాబూ? ఏముందండీ?  ఏదో చదువుతాం.  ఆ పరీక్షలు అవీ పాసవుతాం, మధ్య మధ్యలో సినిమాలు,షికార్లు కొడుతూ.  పరీక్షల్లో కాపీలు కూడా కొడతాం అనుకోండి.  అంటే టీచర్లు సుత్తి కొడతారు, మేం కాపీలు కొడతాం. 😁 శైశవే ధ్వస్త విద్యాయ అన్న మాట!  సరే,బాబు, ఆ తరువాత? తరువాతేముందండీ,  ఉద్యోగ వేట,  పెళ్ళి,  సంసారము,  మధ్యే మధ్యే మందు, చిందు. 😁 యౌవనే విషయేషిణామ్ అన్న మాట‌!  సరే, బాబు, తరువాత? తరువాతేముందండీ,  మిగిలిన జీవితాన్ని ఎన్‌జాయ్‌ చెయ్యడం.  పిల్లలు సెటిల్‌ అయిపోగానే, దేశాలు తిరుగుతూ, పార్టీలకు హాజరీలో ఉంటూ వినోద కాలక్షేపాలు చెయ్యడం.  వయసు కనబడకుండా తలకి రంగు, పూల చొక్కాలు వేసుకుని కుర్ర వేషాలు వేస్తూ కాలక్షేపం చెయ్యడం. 😁 వార్థకే అముని వృత్తీనాం అన్న మాట!  సరే బాబు, జీవిత చరమాంకంలో? చరమాంకంలో ఏముందండీ,  రోగాలు చుట్టుముడతాయి,  దాంతో, మందుల డబ్బా వెంటబెట్టుకుని తిరగడం,  మధ్యే మధ్యే వైద్యుల్ని దర్శించడం.  ఏదో ఒక రోజు పైకి పోవడం! 😁 రోగేనాంతే తనుత్యజాం అన్న మాట!  సరేనండీ గురువు గారు, మీరేం చెబుతారు మనిషి జీవితం గురించి?  నేను కాదయ్యా, కాళిదాసు చెప్పాడు, ఉత్తములైన రఘువంశజులు

అచ్చొచ్చిన చోటు!

  ఏంట్రా, ఏంటి సంగతులు?  ఏదైనా business చేద్దామని ఆలోచిస్తున్నా.  ఓ, very good. Real estate try చెయ్యి. అబ్బే, market లో already చాలామంది players ఉన్నారు.  పోనీ, restaurant, catering లాంటి food business try చెయ్యి. అబ్బే, అడుగుకో restaurant, వీథికో catering.  మనకి పనికి రాదు. పోనీ, groceries shop? ఈ ఊరికి ఉన్నవి సరిపోతాయ్‌.  మొన్ననే మా ఇంటి పక్క తెనాలి & తెనాలి groceries & restaurant పెట్టేశాడెవడో తెలుగు వాడే!  సరే మరి, ఇప్పుడైతే ఏం business చేద్దామని నీ ఉద్దేశం? ఈ రోజు నుండి రెండ్రోజులు garage clean చేద్దామనుకుంటున్నారా. Business గురించి మాట్లాడుతుంటే  గరాజు, క్లీనింగు అంటావేంటి రా? నీకేం తెలుసురా,  పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ గరాజ్‌ లోనే start అయ్యాయ్‌! అయితే? అందుకే ముందు garage clean చేస్తా.  చేసాక? Business idea దానంతట అదే వస్తుంది! 

భరతమాతకు శిరోభారాలు! - 1

  జంబూ ద్వీపం నుండి  కవి గార్లు, కవయిత్రి గార్లు కొందరు క్రౌంచ ద్వీపంలో జరుగుతున్న సాహితీ సభకు నిర్వాహకుల ఆహ్వానం మీద వచ్చారు. వారంతా వేదికను అలంకరించారు.  వారిలో ఓ కవి లేచి,   భరత మాతకు పురిటి నెప్పులా?  అయితే భర్త మాతకు భర్త ఎవరు?  అని నా కవితతో ప్రశ్నించా.  అంతే, ఈ మతోన్మాదులు నన్ను అన్యాయంగా trolling చేసారు.  అయ్యో!అయ్యో! భరత మాతను ఇలా అవమానిస్తున్నారేమిటండీ?  అన్నాడు ప్రేక్షకుల్లో కూర్చున్న ఓ  తెలుగు వాడు పక్కనున్న గడుసు వాడితో.  చిన్నగా మాట్లాడండి, ఇతను బీభత్స అకాడెమీ యువ పురస్కార గ్రహీత  అన్నాడా గడుసు వాడు.  ఇంకో కవి లేచి,  భారత దేశాన్ని మాత అనాల్సిందే అన్నాడో బత్తాయి! భరత మాతకు భర్తలెందరని  నేనడిగితే బుస్సుమన్నాడు! అని నా కవితతో ప్రశ్నిస్తే మతోన్మాదులు నన్ను trolling చేసారు అని “వా”పోయాడు.  అయ్యో! అయ్యో! ఏమిటంటీ భరత మాతను ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? బత్తాయిలేమిటండీ?  ఇతను బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత అండీ!  బత్తాయిలంటే దేశ భక్తులని పిండితార్ధం! అన్నాడు గడుసు వాడు.  ఇంకో కవయిత్రి లేచి,  భారత్‌ మాతకీ జై! అనమన్నాడో బత్తాయి! అననంటే దేశద్రోహినంటున్నాడు! ఇదెక్కడి అన్యాయం? ఇదెక్కడ