పోస్ట్‌లు

ఏప్రిల్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

దొరికింది!

చిత్రం
సీతాకోక   చిలుక   రెక్క   దొరికిందీ   దొరికింది   రంగు   రంగు   పక్షి   ఈక   దొరికిందీ   దొరికింది ఏనుగులాగు   రాయి   ఏదో దొరికిందీ   దొరికింది   గాజు   కన్ను   గోళీకాయ   దొరికిందీ   దొరికింది !  దొరికిందీ   దొరికింది !

ఆమె

  ఆమె   ఉల్లాసాన్ని ఉడుపులుగా   ధరించి   వచ్చింది వారు   ఆమెను   బాధించలేక   పోయారు ఆమె   వైరాగ్యాన్ని చేత   పట్టుకు   వచ్చింది వారు   ఆమెను బంధించలేక   పోయారు . ఆమె   వినయాన్ని వెంట   పెట్టుకు   వచ్చింది వారు   ఆమెను వేధించలేక   పోయారు . ఆమె   జీవితాన్ని తపస్సుగా   మార్చుకుంది వారు   మూతులు   తిప్పుతూ తొలగిపోయారు .

తెలివిడి సిడిముడి

  వదలని   వరుసల తలపులు   కదపక మునుగక   తికమక అటుఇటు   పరుగిడు వలపుల   ముడిపడు గిడగిడలాడెడు మెదడుల   ఆటలు వలదని   వలదని తైతక   తైతక మమతల   మూతలు బిగిసిన   గడియలు బిడియపు   ఉడుపులు వదలని   అప్పులు ఒప్పని   తప్పులు తప్పని   ముప్పులు తైతక   తైతక విరుపుల   మాటలు తడితడి   మూటలు అసూయ   కణుపులు ఆరని   కణికలు టింకర   వంకర గర   గర   పొలుసులు తైతక   తైతక ఇడుముల   తడబడు తెలివిడి   సిడిముడి వడి   వడి   విడివడి జారెడు   పాయల ఆడెడు   నటనల ఉడకని   పలుకులు విడు   విడు   విడు   విడు విడు   విడు   విడు   విడు తైతక   తైతక తైతక   తైతక

అర నిమిషం-కొర నిమిషం

అర   నిమిషం కొర   నిమిషం అర   కొర అర   కొర కొర   నిమిషం ఎలకలు   ఉన్నాయా   ఇంట్లో ? అవును ! అవును !  అవును !  ఎప్పుడు   వచ్చిందోనోయమ్మా ! ఎప్పుడు   పోయిందోనోయమ్మా ! ఏమి   కొరికికెనో   ఏమోయమ్మా ! అర   నిమిషం కొర   నిమిషం అర   కొర అర   కొర కొర   నిమిషం ఢమఢమ   చప్పుళ్ళేమోనమ్మా కిరుకిరు   శబ్దాలేమోనమ్మా కలుగులో   కిలకిలలేమోనమ్మా ! అర   నిమిషం కొర   నిమిషం అర   కొర అర   కొర కొర   నిమిషం ఉడతలు   ఉన్నాయా   దొడ్లో ? అవును ! అవును ! అవును ! కొమ్మ   కొమ్మకి   దూకిందమ్మా జామ   చెట్టు   పై   చేరిందమ్మా పండు   పండునూ   కొరికిందమ్మా ఎలుక   చేతిలో   జున్నును   చూసి పకపకపక   నవ్విందమ్మా ! అర   నిమిషం కొర   నిమిషం అర   కొర అర   కొర కొర   నిమిషం !