పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

హలో,కార్సికా!

  ఈమాటు ప్రపంచ తెలుగు మహాసభలు కార్సికా ద్వీపంలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది క్రౌంచద్వీపంలోని ఓ మెగా తెలుగు సంస్థ.  ఇక నిర్వాహకుడు పెద్దిరాజు గారికి ఫోన్లు రావడం ప్రారంభమైంది. హలో!హలో! నేను అవధానరాజ,అవధాన గండభేరుండ,అవధాన వ్యాఘ్రాన్ని మాట్లాడుతున్నా. ఇన్ని చెప్పి నాపేరు చెప్పడం మరచా. నేను కీర్తివ్యామోహ రావుని మాట్లాడుతున్నా. హలో!హలో! అచ్చ ఇంగ్లీషులో అవధానం నా ప్రత్యేకత. దానికి రూపశిల్పిని నేనే. ఇంగ్లీషు ప్రపంచ భాష. ఏదేశం వెళ్ళినా అంతా ఇంగ్లీషే. అందుకే ఈ బ్రహ్మాండమైన ఆలోచన నాకు కలిగి అచ్చ ఇంగ్లీషు అవధానాన్ని రూపొందించా. పృచ్ఛకులంతా ఆంగ్లంలో ప్రశ్నలడుగుతుంటే నేను తెలుగు ఛందస్సులో ఆంగ్లభాషలోనే పద్యం చెబుతా. ఇది అన్నిచోట్లా బాగా క్లిక్కయ్యింది.  నేను మొట్టమొదటగా దీన్ని ఆఫ్రికన్‌ ఏనుగుల సఫారీలో చేసా. నా టింగ్లీష్‌ పద్యాలు విని ఏనుగుల గుంపు ఒకటి నాకు సన్మానం చేయడానికి ఘీంకరిస్తూ వచ్చింది. ఆ విషయం అర్థం కాని పృచ్ఛకులంతా కకావికలురై పరుగులు తీసారు గానీ నేను చాలా తెలివైన వాడిని కనుక టింగ్లీషులో ఏనుగుల మీద సీస పజ్జాలు చెప్పి, వాటితో ఫొటో దిగి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ఫాన్సుకి WhatsApp లో వె

అడవి బాపిరాజు గారి “దీపం సెమ్మా” (1952)

చిత్రం
  కామాక్షీ దీపం గురించి వివరాల కోసం వెదుకుతుంటే అడవి బాపిరాజు గారు 1952 లో రచించిన “దీపం సెమ్మా” అనే కథ దొరికింది. ఇందులో వర్ణించిన దీపం సెమ్మా నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు కావాలంటే ప్రత్యేకంగా చేయించుకోవాల్సిందే.  “ ఆ సెమ్మా శిల్పం పని అతి అందంగాను, నాజూకుగాను, అద్భుతంగాను వుంది. కిందమట్టు కమలం, అందులోంచి కాంతి తీగలా కలశాలు, చక్రాలు, కమలాలు, తీగెలు, తామరకాయలా పై కెదిగి అష్టదళ పద్మములా సెమ్మా ప్రమిద తెలిసింది. ఆ ప్రమిద మధ్య నుంచి ఒక తీగ పైకి పోయింది. ఆ తీగె చివర ఒక హంస చాలా ఒయ్యారంగా నిలిచి వుంది. ఆ హంస మీద సంపూర్ణ ప్రపుల్ల కమలం, దాని మీద పద్మాసనాసీన ఐన లక్ష్మీ-సరస్వతీ, చతుర్విధ ​పురుషార్ధాలు, విజ్ఞానవీణ, తాళాలు, అష్టహస్తాలతో పట్టుకొని హాసవిలాసంగా వున్న వదనంతో వెలిసి వుంది. ”

ఆలాగున

   ఆ మధ్య మా ఊరికి ఓ కవి కమ్‌ రచైత కమ్‌ సమీక్షకుడు విచ్చేస్తే మిగిల్న సాహితీ భాయీ బెహన్స్‌తో నేనూ వెళ్ళా వారి దర్శనానికి. మేము ఓ ముగ్గురం లేడీస్‌ వెళ్ళేటప్పటికి కవిగారు షార్ట్ అనబడు ఒకానొక విదేశీ వస్త్ర విశేషం ధరించి ఉండిరి.  అయ్యో పాపం చాలా ముందుగా ముందుగా వచ్చేసినట్టున్నాం, కవిగారు ఇంకా రెడీ కాక ముందే అనుకున్నా. ఇంతలో వెనకాల ఇంకా ఓ అరడజను మంది బిలబిలా లోనికి వచ్చారు.  ఇప్పుడిక కవీజీ సభామర్యాదకు తగ్గట్టుగా వేషం మార్చుకుని వస్తారేమో అనుకున్నాగానీ వారికి ఏ కోశానా ఆ ఉద్దేశం ఉన్నట్టులేదు.  ఇక్కడింత మంది ఆడవాళ్ళు ఉంటే ఈయన ఆలాగున ఏలాగు? అని తలపోస్తుంటే మిమ్మల్నెవర్నీ ఆడోరుగా భావించట్లేదేమో కవిగారు అంది అంతరాత్మ ఎగతాళిగా. ఇంతలో నాలోని కవిగాడు నిద్రలేచి,  “ నేను   షాటేశా చూడు  షాటేశా చూడు నా షాటొంక చూడకుంటే తీసేస్తా చూడు జంబలకడి  జారు మిటాయా”    అని పాడుకోడం మొదలెట్టాడు.  రేయ్‌ రేయ్‌ రేయ్‌! సంస్కారహీనుడా! ఏంట్రా ఆ పాటలు? అని కవిగాడిని గదిమింది అంతరాత్మ.  ట్రెండీగా ఉంటాదని లేటెస్టు పాటతో పేరడీ కట్టేను బయ్యా అన్నాడు కవిగాడు అపోలజెటిక్‌గా. ఈమాటు పాట మార్చి, “ నా షాటు చూడు నాటు  నాటు నాటు నాటు నా