పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

2-అన్నమయ్య పలుకుబళ్ళు ఆరు

  1. ఆస గలిగిన చోట ఆడినదే సరసము     ****************************** ***********    ఆస గలిగిన చోట నాడినదే సరసము    వేసటలయ్యన చోట విచారములే 2. ఇంటిలోని పోరు **********************  పన్నిన పగల వెలుపటి వారికంటెను  ఎన్నరాని పగ గదా ఇంటిలోని పోరు 3. ఈపీగ వ్రణాలు కోరు     ***********************  తెగని కర్మములు దేహములు గోరు  వగల ఈపీగ వ్రణాలు గోరు 4. ఈల గద్ద మూకలో కోడిపిల్లకు తలారికమా?      ***************************** ****************   ఈల గద్ద మూకలోన ఇంచుక కోడిపిల్లకు    మూలమూలల తలారికములు జెల్లునా? 5. ఎంత వెలుగునకు అంతే చీకటి ****************************** *********   ఎంత వెలుగునకు అంతే చీకటి   ఎంత సంపదకు అంతే ఆపద 6. ఏనుగు చేతి చెఱకు గైకొను     ******************************  చెలగి ఏనుగు చేతి చెఱకు గైకొనగ  నలవియే ఎవ్వరికైన నాకరణి

అన్నమయ్య పలుకుబళ్ళు ఆరు

 1. అగ్గి పొంతనున్న వెన్న   ***************************** చింతల వేదనల జిక్కువడచునగ్ని పొంతనున్న వెన్నయైపోయెగాలము 2. అడవిగాసే వెన్నెల  ************************ జాడలు మెచ్చాలేరు చాలునన్న వారు లేరు వేడుక నడవిగాసే వెన్నెలాయ బ్రదుకు. 3. ఆటలో బ్రాహ్మణుడు ************************* అన్ని కర్మములు జేసి  ఆటలో బ్రాహ్మణుడనైతి నన్ని వేదముల నేటి యంగడి వీధి. 4. ఆకాశమడ్డమా అవ్వలయునడ్డమా    *************************************** ఆకాశమడ్డమా అవ్వలయునడ్డమా శ్రీకాంతు భజియించు సేవకులకు. 5. ఆకాశము పొడవు ఆకాశమే యెరుగు     ***************************************** ఆకాశము పొడవు ఆకాశమే యెరుగు ఆకడ జలధి లోతు ఆ జలధే యెరుగు. 6. అమరావతడ్డమా      ******************** అమరావతడ్డమా హరిదాసులకు మహా తిమిరంబులడ్డమా దివ్యులకును.

ఇంద్ర-గౌతమ-అహల్యల కథ

చిత్రం
  ఇంద్ర-గౌతమ-అహల్య కథ మన సినిమాల్లో,సాహిత్యంలో అత్యంత అవహేళనకు,అపార్థానికి గురి అయిన కథ.  ఇలాంటి కథలు మన పురాణాల్లో ఎందుకు చెప్పబడ్డాయా,వీటి వెనుకాల ఏమైనా నీతి లేక శాస్త్రీయత ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే ఈ కథకు అద్భుతమైన వివరణ అనుకోకుండా దొరికింది. అది శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య వారి సంభాషణల్లో.  ఇంద్రుడు=సూర్యుడు గౌతముడు=చంద్రుడు అహల్య=రాత్రి అన్న అర్థాలను మనసులో ఉంచుకుని వినండి.

రాయి కవిత

1.  గుహ                                         ***** చల్లని చీకట్లలో కాంతి మునకలు వేస్తుంది చిత్రమైన మలుపులలో గాలి మెలికలు తిరుగుతుంది   పైన్నించి నీటిచుక్క దీక్షగా కిందికి దూకుతుంది నా ఇల్లు నా ఇల్లిదని గబ్బిలాయి చక్కర్లు కొడుతుంది   మెత్తని మన్ను కింద పురుగొకటి నింపాదిగా పాకుతుంది కళ్ళు లేని చేప నీళ్ళల్లో తీరుబడిగా తోక ఊపుతుంది   మహాకాయ బండరాయి పాకుడు కప్పుకు నిద్రపోతుంది నోరంతా తెరిచిన ముసలి గుహ ఓయంటే ఓహోయని కేక వేస్తుంది.​ 2.  బండ   ********** పూలు రాలి పడ్డప్పుడు పులకరించి పోకుండా చినుకు జారి పడ్డప్పుడు కరిగి నీరై పోకుండా దుమ్ము మీద పడినప్పుడు చీకాకు పడిపోకుండా కనులు మూసి ఋషిలాగా కదలకుండ మెదలకుండ కాలానికి లొంగకుండ…  

Hello my dear wrong number!

  తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పూవుపై వాలి మకరందం తాగే ప్రయత్నంచేసినా దానికి రసం ఎలా లభించదో,తగని వారితో చేసే స్నేహం అంతే లాభిస్తుంది.             —- వాల్మీకి రామాయణం.  గత చాలాకాలంగా కొత్తగా ప్రబలిన ఒక ఆచారాన్ని గమనిస్తున్నా. అదేమిటంటే “I can only respond” అనే ఆచారం. ఈ ఆచారాన్ని పాటించేవాళ్ళని పింగ్‌పాంగీయులు అనొచ్చు. మనం ఎంత లావు మెస్సేజు ఇచ్చినా వీరినుంచి ఠకీమని సమాధానాలు వస్తాయి -  yes,no,interesting,wonderful,T hank you ల్లాంటివి.  20యేళ్ళు,ఆలోపు పిల్లలైతే మరీ కురచవి -  Tq,Ttl,kk,ok,wc,Tx,SRK,WDK etc.,  SRK,WDK అంటే ఏమిటని నన్నడక్కండి. నాకూ తెలీదు. 😄 ఇలా పొడి పొడిగా respond అవడాన్ని మాట్లాడ్డం అంటున్నారు! ఈ పింగ్‌పాంగ్‌ సమాధానాలు కూడా ఇవ్వకపోవడాన్ని మాట్లాడ్డం మానెయ్యడమంటున్నారు!! ఎవడికి కావాలయ్యా నీ ఎండిపోయిన వడియాల్లాంటి పొడి పొడి పింగ్‌పాంగ్‌ సమాధానాలు? అని అనాలనిపిస్తుంది. కానీ,అనలేం. అంటే పిన్నలకీ పెద్దలకీ అదేదో దెబ్బ తినిపోయి కోపాలొచ్చేస్తాయి! పెద్దవాళ్ళు అహంకారం వల్ల, చిన్నవాళ్ళు అజ్ఞానం వల్ల ఇలా ప్రవర్తిస్తారని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి రావొచ్చు.  వారి సంగీత సాహిత్యాలు చూ

ప్రాక్‌ జ్యోతి ఛాయలు

ఆలోచనలు చీకటి చెఱువులో గుర్రపు డెక్కవలే దుంప వేసి వ్యాపించి ఉన్నవి చూరు పట్టుకు గబ్బిలాల్లా తల్లకిందులుగా వేళ్ళాడుతున్నవి వదంతులు లోకులతో స్నేహాలు బులబులాగ్గా బురదలాగా కాళ్ళను కిందకి లాగుతున్నవి తుమ్ము ముళ్ళల్లా చెప్పుల్లోనూ ఇరుక్కుని ఇంటి దాకా వస్తున్నవి లౌకికాలు అనేకానేక జ్ఞాపకాల  ఖండికలు సూర్యుడు రాని చంద్రుడు పోని ఆకాశాలు  బాధాప్లావితాలవి రాగరంజిత స్వప్న శకలాల వెనుక ప్రాక్‌ జ్యోతి ఛాయలు.

మాటల మహిమ చెప్ప తరమా?

  1.  యారానా    ఎన్ని   సార్లు   మాట్లాడినా   ప్రతి   సారీ   మాటలు   కొత్తగా   తడబడతాయి కిటికీ   పక్కన    పువ్వులు   కళ్ళు   నులుముకుని   ఆవలిస్తాయి     వెన్నెల   మొగ్గల   మంచు        కురుస్తూనే   ఉంటుంది ఇంటి   బయట   నిద్ర   పోగొడుతున్నందుకు   క్షమాపణలు   కోరుతూనే    నేనతన్ని   రాత్రంతా    నిద్ర   పోనివ్వను .  2.  పుప్పొడి మాటలెప్పుడో   ఆగిపోయాయి నక్షత్రాలు   తళతళలాడాయి ఒక్కసారి   తాకగానే  – వెయ్యి   పువ్వులు   విచ్చుకున్నాయి ఎన్ని   ధవళరాత్రులు   వచ్చివెళ్లి నా నా   చేతివేళ్ళకింకా   అదే   పుప్పొడి . 3. ఆ   మాట దారంతో   పువ్వు   కుడుతోంటే చిక్కు   ముడి   పడ్డట్టు ఎగురుకుంటూ   వెళుతోంటే కళ్ళల్లో   నలుసు   పడ్డట్టు షికారుగా   పోతోంటే జోడు   ఒకటి   తెగినట్టు అప్పుడు   గబుక్కున నువ్వన్న   ఆ   మాట నీ   గొంతులో   విసురు మైసూరు   పాకులాంటి నా   మనసు   ను   కసుక్కున   కోస్తుంది .

కవి - ప్రచురణ

చిత్రం