పోస్ట్‌లు

జులై, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

త్వం శుంఠ! త్వం శుంఠ!

  ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడేనండీ!‌ అవును,బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికీ ఒక అభిప్రాయం ఉంటుంది.  అవకాశం వచ్చినప్పుడు చెప్పెయ్యాలని తహతహలాడుతుంటాడు! అసలు ఈ అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయంటారు?  వాళ్ళు పెరిగిన వాతారణం,  వాళ్ళు చదివిన పుస్తకాలు, కలిసిన మనుషులు, చూచిన ఫిల్ములు  ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిసి అభిప్రాయాలను ఏర్పరుస్తాయి. ఈ అభిప్రాయాలు మారుతాయంటారా? ఓ!మనుషులు మారిపోయినట్టే  అభిప్రాయాలూ తరచూ మారిపోతాయి!  సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడే! అవును, ప్రపంచ సమాచారపు వెల్లువలో నేను సైతం నా అభిప్రాయాన్ని వ్యక్తపరచాను! అన్నదే ఇప్పటి నినాదం! అభిప్రాయాలకు విలువ ఉంటుందంటారా? వ్యష్టి అభిప్రాయపు విలువ సమాజంలో ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది.  సమష్టి అభిప్రాయపు విలువ సమూహం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఎంత అసభ్యకరమైన అభిప్రాయాలు వ్రాస్తున్నారో చూసారా?    తన పేరు బయటికి రాదంటే మనిషిలోని అసలు మనిషి బయటికి వస్తాడు! అభిప్రాయాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారా? మనిషి ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టే వ్యక్తిత్వం ఏర్పడుతుంది. గొప్ప అభిప్రాయాలను వెలిబుచ్చే వార

రెండు హరికేన్‌ బెరిల్‌ దినములు

  అది 2024 వత్సరము నాటి జులై మాసము. ఆనాడు,హయగ్రీవ‌ నగరమందు కోటీ పురమునున్న మా స్వగృహమునందు నాటి తుఫాను ప్రచండ కాళరాత్రి గాఢాంధకారములో,  పెనుగాలులకు తాండవమాడుతున్న చెట్లను  గవాక్షముగుండా చూచుచూ, ఇంట విద్యుచ్ఛక్తి లేకున్ననూ అప్పుడప్పుడూ లక్ష దీపాల కాంతులతో వచ్చిపోవు మెరుపులను కాంచుచు భయము విస్మయముల మిశ్రమ భావనకు లోనైతిని. అహో,ఏమి ఈ ప్రకృతి విలయ తాండవము!  అంతలో ఇంటి పైకప్పు మీద రాక్షసులు నడచిపోవుచున్నారా అన్నటుల భయోత్పాతము గలిగించు భయంకర శబ్దములు వినవచ్చెను. చెట్ల కొమ్మలు విరిగిన శబ్దములు,ప్రళయ  ఝంఝూమారుతముల వికటాట్టహాసములు కర్ణకఠోరమాయెను.  ఆ కాళరాత్రి ఇంటి పైకప్పు తప్పక ఎగిరిపోవుననియే తోచెను. కుటుంబమంతయూ ఇంటిలోని ఒక సురక్షిత ప్రదేశమునకు చేరితిమి. తాగు నీరును,ఇతర అవసరములకు వాడుకొను నీరును ముందు జాగ్రత్త చర్యగా భద్రపరచితిమి. ఆ రాత్రి ఎట్లో గడిచెను. మరునాడు అంతర్జాల సదుపాయము లేనందున విధి నిర్వహణ సేయలేనని మా ముఖ్య కార్యనిర్వహణాధికారికి చెప్పివేసితిని. విద్యుచ్ఛక్తితో బనిచేయు ఆధునిక గృహోపరణములే కాక చరవాణి సైతము మూగవోయినందున ఆ రోజు జీవనమంతా క్రొత్తగా తోచెను.   బయట భోరున వర్షము కుండపోతగా కురియు

పిట్టల దొర రామాయణం

  నా పేరండీ,వెవ్వెవ్వే వెంకోజీ అండీ,  ఐయామ్‌ ఏ పిట్టల్దొరండీ. మరండీ,నేను తుపాకీతో కొడితేనండీ,  ఓ పిట్ట పాకిస్తాన్‌ పారిపోయిందండీ,  ఒకటేమో చైనాలో దూరిపోయిందండీ.  మరండీ, నేన్రామాయణం చదూదామని చూసానాండీ,  అందులో మొగదల్లోనే క్రౌంచ పిట్టలని గురించి రాసున్నాదండీ.  ఆ క్రౌంచ పిట్టలంటే, మనం అప్పుడెప్పుడో పిటాపురంలో కొట్టిన వరిగి పిట్టలా?  పెద్దాపురంలో కొట్టిన పిరంగి పిట్టలా?  బీమారంలో కాల్చుకు తిన్న జంగిలి పిట్టలా?  ఏలూరులో నంజుకు తిన్న మింగిలి పిట్టలా?  అని తెగాలోంచించి ఆలోచించి అమిరికా ప్రైమ్మినిష్టర్‌ కి ఫోన్‌ చేసి వివరం చెప్మన్నానండీ.  ఆయ్‌, దాని మీద ఆయనేమో మొత్తం ప్రపంచకంలోని అందరి ప్రెసిరెంట్లని పిల్చి రామాయణంలో క్రౌంచ పిట్లంటే ఏం పిట్టలనేది నాకిప్పుడే తేల్చాలన్నారండీ. తేల్చి వెంకోజీ పిట్టల్దొరకు అర్జెంటుగా  చెప్పాలన్నారండీ,ఆయ్‌!  అయినా క్రౌంచ పిట్ట పడితే నాలాగా కమ్మగా కాల్చుకు తినాలిగానీ పజ్జాలు రాయడమేంటండీ వాల్మీకీ?  ఈ క్రౌంచ పిట్టల గురించి రష్యాకెళ్ళి కూడా అడిగానండీ,ఆళ్ళు నాలుగు గిన్ని కోళ్ళు, అయిదు సివంగి పిట్టలు ఇచ్చారండీ, అవి అక్కడికక్కడే కాల్చుకు తిన్నానండీ, మరి నాకెందుకు తేలేదని చై

ట నెత్తిన మొట్టిన ఠ కథ

  మూడవ ప్రశ్న: అరవై యేళ్ళు నిండిన సందర్భంగా చేసుకునే ఉత్సవం పేరు వ్రాయుము. ఓస్‌,ఇంతే కదా అనుకున్నా గానీ కాయితం మీద కలం పెట్టగానే గట్టి అనుమానం ఒకటి పొడసూపింది.  ఇంతకీ అది షష్టి పూర్తా? షష్ఠి పూర్తా అని!  వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూద్దును కదా,  “ఆరవైయ్యవ పుట్టిన్రోజు” అని రాసి ధైర్యంగా కూచున్నాడు.  ఖర్మరా బాబు అనుకుని, ఇటు వైపు వామువాదిని పేపర్లోకి తొంగి చూడగా,  అరవైయ్యవ పుట్టిన రోజా? అసలేం సాధించారని పుట్టిన రోజులు చేస్కోడం?   పుట్టిన రోజులు, చచ్చిన రోజులు జరుపుకోవడం బూర్జువా క్రియేటేట్‌ ద్రోహం. ఈ పండుగలు పబ్బాలు అన్నీ మనువాదుల కుట్ర. మనకోసం అక్కడ అన్నాయ్‌లు అక్కాయ్‌లు పోరాడుతుంటే మనం పుట్టిన రోజులు చేస్కోడం ఏమిటి? .. అయ్య బాబోయ్‌! ఏమిటో ఈ గోల? అయినా ఈవిడ తన పుట్టిన రోజుకి దెయ్యం పిల్లలా మొహం అంతా కేక్‌  పూయించుకున్న ఫొటో ఒకటి ఫేస్‌బుక్‌ లో చూసానే అప్పుడెప్పుడో? అనుకుంటూ అయినా నాకెందుకొచ్చిన గొడవా అని విస్కీ స్వామి పేపర్లోకి చూద్దును కదా, అది షష్టి పూర్తి/షష్ఠి పూర్తి కావొచ్చు. రెంటిలో ఏదో ఒకటి రైటు. ఏది రైటైతే దానికి మార్కులు వేయగలరు. నాకూ ఆమధ్య అరవై నిండాయి. కానీ నా లేడీ ఫాన్

కవన సృష్టి

  ఒంటరిగా  వదిలెయ్యి కాసేపే, కాసేపు! ఉత్ప్రేక్షకు ఊతమిచ్చి జిఘృక్షకు దాహమిచ్చి నిటలాక్షుని నీడలన్ని చిత్రికతో సానపట్టి వచ్చేస్తా‌ నొచ్చేస్తా, అన్వీక్షకు అర్ఘ్యమిచ్చి ఆపేక్షను అభిఘరించి అలికాక్షుని కళలన్నీ పూనికతో పుటం పెట్టి  వచ్చేస్తా‌ నొచ్చేస్తా, వాగ్దేవికి మొక్కులిచ్చి మేధకు హవిస్సులిచ్చి భావాలకు వాసె కట్టి  తలపోతల మోడి కట్టి కవన క్రతువు హోతనై కవిత్వాన్ని కావ్యాలను గల్పికలు నాటకాలు కల్పనంత అచ్చు పోసి విరూపాక్షు ప్రభలలో కలిపేసీ యజ్ఞఫలం, వచ్చేస్తానొ చ్చేస్తా నొచ్చేస్తా ను ఒంటరిగా వదిలెయ్యి కాసేపే, కాసేపు!