పోస్ట్‌లు

మే, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆ కిక్కే వేరప్పా!

  ఈసారి మన క్రౌంచద్వీప డాషింగ్‌ రచైతల సంఘం సంవత్సరీకాలు అంటార్కిటికాలో!  సంవత్సరీకాలేమిటండీ అశుభం మాటలు? అదేనయ్యా, ప్రతి సంవత్సరం మనం జరిపే రచైతల సమావేశాలు! అంటార్కిటికా లోనా??  అంత దూరం ఎవరొస్తారండీ?  వస్తారు. అంతా వస్తారు.  వీళ్ళందరికీ ప్రయాణ ఖర్చులు మనకి తడిసి మోపెడు అవుతాయండీ బాబూ! దారి ఖర్చులు వాళ్ళే పెట్టుకుని వస్తారు. వారికక్కడ బస? ఎవరి బస వాళ్ళే చూసుకుంటారు. మరి వీళ్ళందరికీ అక్కడ భోజనాల ఏర్పాట్లు?  ఎవరి భోజనం సంగతి వాళ్ళే చూసుకుంటారు. బాగోదేమోనండీ?  సరే, మరి వీళ్ళందరికీ శాలువాలూ అవీ? ఎవరి శాలువా వాళ్ళే తెచ్చుకుంటారు. అలాగా? ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. మీ అయోమయాలు గూట్లో పెట్టి ఆహ్వాన పత్రికలు పంపండి.  డేరింగ్‌ కథలు/క్రేజీ కవితలు వ్రాసిన  ప్రముఖ రచయిత/కవి అయిన మిమ్మల్ని వచ్చే నెల 15 న అంటార్కిటికాలో జరగబోతోన్న మా రచైతల సమావేశానికి క్రౌంచద్వీప డాషింగ్‌ రచైతల సంఘం సగౌరవంగా ఆహ్వానిస్తోంది.  ఈ ఆహ్వానితుల్లో కొంతమంది  ఇంత వరకూ ఒకటే కథ, ఒకటే కవిత రాసిన వాళ్ళున్నారు కదండీ? వ్రాసిన ఒక్క కథ/కవిత తోనే ప్రఖ్యాతి గాంచిన - అని మార్చి పంపండి వాళ్ళకి. కొంతమంది కేవలం సాహితీ అభిమానులు. వీళ్ళకేం

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 4

  నీకో దణ్ణం! అవార్డుల కోసం నువ్వు చెప్పే ముగింపులు నేనివ్వను గాక ఇవ్వను!  నీ ఇష్టం రా, నీ మేలు కోరి మంచి ఐడియాలు ఇచ్చా. కాదంటే నీ ఇష్టం. అన్నీ పూజారి మీద, రాముడి మీద కథలేనా ఇంకేమన్నా రాసావా? స్త్రీల అభ్యుదయం కోరి మంచి మంచి కథలు రాసాను రా.  అవీ వెయ్యలేదు ఈ పత్రికలు.  ఎందుకో తెలీదు. లేడీస్‌ మీద అయితే తప్పకుండా తీసుకోవాలే?  ఏదీ, ఓ కథ చెప్పు? ఒక నిరక్షరాస్య నేపథ్యం నుండి వచ్చిన అమ్మాయి ఎన్నో కష్టాల కోర్చి బాగా చదువుకుని జీవితంలో పైకొస్తుంది.  ఇదీ ఒక కథ సారాంశం.  ఇది బ్రాందీ జ్యోతి తిరస్కరించిన కథ. ఎలా ఉంది? చందమామకి,బాల మిత్రకి పంపు.  అదేంటి? అలా అనేసావ్‌? అదంతే. ఇంకో కథ చెప్పు?  ఒకడు ఒకమ్మాయిని ప్రేమించానని తన ప్రేమను తెలియజేస్తాడు. తనకు కనీ పెంచిన తల్లిదండ్రులే ముఖ్యమని, వాళ్ళని బాధ పెట్టనని, వాళ్ళు చూసిన వరుడినే చేసుకుంటానని అతని ప్రేమని ఆమె తిరస్కరిస్తుంది. ఇదీ కథ. విస్కీ ప్రభకు పంపితే తిరగ్గొట్టింది.  ఎలా ఉంది?  ఇది blog లో రాసుకో. నువ్వు తప్ప ఎవడూ చదవడు. Next?  ఒకామెకు చిన్న వయసులోనే భర్త పోతాడు. ఇద్దరు పిల్లలుంటారు.  ఒక వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి పిల్లలను వృద్ధిలోకి తీసుకొ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 3

  ఆపరా నీ దిక్కుమాలిన ఐడియాలు!  వింటుంటేనే ఒళ్ళంతా కంపరమెత్తుతోంది!  ఛీ!ఛీ! ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అసలు?  చూడరా,నువ్వు ఒక్కసారి అభ్యుదయ వాదవయ్యావనుకో,  నీ మైండ్‌ ఫ్రీ అయిపోతుంది. అప్పుడింతకన్నా గొప్ప గొప్ప ఐడియాలు తామరతంపరగా వస్తాయి నీ బుర్రలోకి!  అంటే మైండ్‌ దొబ్బుతుంటావ్‌, అంతేగా?  హిహి, ప్రచురింపబడే కథలు రాయడం రాదు గానీ జోకులు మాత్రం బానే వేస్తున్నావ్‌రా!  నా జోకులకేంలే గానీ, ఇదే కథని మళ్ళీ మార్చి, ఎంతో ప్రాణం పెట్టి రాసారా. వరుణోదయం పత్రికకు పంపా. వాళ్ళైతే నా కథను తిరిగి పంపుతూ నన్ను నానా తిట్లు తిడుతూ ఒక ఉత్తరం కూడా జత చేసి పంపారు. అంత గొప్ప కథ గురించి అలా ఎందుకు రాసారో, ఎందుకు తిరగ్గొట్టారో ఇప్పటికీ నాకు మిస్టరీయేరా!  ఈసారి ఏం మార్చి పంపావో? మన పూజారి, తల్లి నగలతో భద్రాచలం రామయ్య దర్శనానికి వెళుతుంటాడా, ఆ పెట్టె నిండా రామ భక్తులే ఉంటారు. అందరు కోలాహలంగా రామ భజన చేస్తూ సాగుతుంటారు.  మన పూజారి తన తల్లి నగలను రామయ్యకు, సీతమ్మకు సమర్పించడానికి వెళుతున్నాడని తెలుసుకొని వారంతా అభినందిస్తారు. ఆ పెట్టెలో ఒక మాలదాసరి కుటుంబం కూడా ఉంటుంది. వారికేదో ఇబ్బంది వస్తుంది. సాటి రామభక్తుడికి క

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 2

  పోనీ ఆ రైల్లో ఆ కిర్మిటియానో గిర్మిటియానో, దాని బదులు ఒక నార్త్ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కుటుంబం భద్రాచలం వెళుతున్నట్టు రాసి ఆ అమ్మాయికి, మన పూజారికి పెళ్ళి జరిపిస్తే? ఉత్తరాన్ని-దక్షిణాన్ని కలపడం అభ్యుదయమేగా?  ఎంతసేపూ ఈ పూజారికి ఏ బ్రాహ్మల పిల్లతో పెళ్ళి సంబంధం కుదురుద్దామా అన్న ఆదుర్దాయే తప్ప ప్రచురింపబడే కథ రాద్దామన్న తెలివిడి లేదు కదా నీకు?  అభ్యుదయవాదులు చెప్పిందే అభ్యుదయం గానీ నువ్వూ నేనూ అనుకున్నవన్నీ అభ్యుదయాలు కావు. తెలిసిందా? నువ్వు చెప్పిన కథ నీ blog లో పెట్టుకో. లేకపోతే నీ ఫేస్‌బుక్‌ గోడ మీద కొట్టుకో. నాలుగు లైకులొస్తాయి. ఆ నాలుగు లైకులూ కూడా పెళ్ళి కాని అర్చక స్వాములవై ఉంటాయి. ఇలా అయితే నువ్వు ప్రముఖ రచైతవి అయినట్టే! అయితే బ్రాహ్మిన్‌, నాన్‌-బ్రాహ్మిన్‌ పెళ్ళి చెయ్యాలంటావా?? సరిగ్గా పట్టుకున్నావ్‌! నాన్‌-బ్రాహ్మిన్‌ ఒక్కటే కాదు, నాన్‌ అగ్రవర్ణం అయి ఉండాలి. అప్పుడే అభ్యుదయం అవుతుంది! తెలిసిందా?  సమాజపు అట్టడుగు స్థాయిలో ఉండి, అందులోనూ డబ్బు లేని, అందం లేని, చదువు లేని, సంస్కారం లేని ఇలా ఎన్నెన్నో లేని పిల్ల అయి ఉండాలి.  అప్పుడది ప్రగతిశీలం!  అర్థం అయిందా?  ప్రముఖ రచైతని కాకపో

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

  నేను ఏ కథ రాసినా అన్నీ తిరగ్గొడుతున్నార్రా సంపాదకులు! అన్నీ మంచి కథలే కానీ ఈ పత్రికల వాళ్ళకే నచ్చట్లేదు.  ఏం చెయ్యాలో తెలియడం లేదు. అలాగా. ఏదీ నువ్వు పత్రికలకి పంపిన కథల్లో ఒక కథ చెప్పు? ఆమధ్య ఒక కథ రాసి బ్రాందీ జ్యోతికి పంపా. టూకీగా చెప్తా విను. అనగనగా ఓ గుడి పూజారి. అర్చకత్వం చేసేవారికి ఈమధ్య పిల్ల దొరకడం కష్టంగా ఉంది కనుక అతనికి ఎన్నాళ్ళైనా పెళ్ళి కాలేదు.  అతని తల్లి చనిపోతూ, చనిపోతూ ఎప్పటికైనా నీకు పెళ్ళైతే  నా కోడలికి ఈ నగలు పెట్టు అని చెప్పి కన్ను మూసింది.  ఆ తరువాత కాలం గడిచి అతను నలభై దాటినా అవివాహితుడుగానే ఉండిపోయాడు. చివరకు ఇక తనకు పెళ్ళి కాదని నిర్ణయించుకొని ఆ నగలను భద్రాచలం రామయ్యకు, సీతమ్మకు సమర్పిద్దామని రైల్లో బయల్దేరాడు.  దారిలో తాను చూసిన సాటి ప్రయాణీకుల మాటలు అవీ అతన్ని ప్రభావితం చేస్తాయి. తనను పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకి మళ్ళించడానికే ఆ భగవంతుడు తనకు వివాహం అనే ఉచ్చు తగిలించి సంసార సాగరంలోకి తోసివేయకుండా కాపాడాడన్న నిశ్చయానికి వచ్చి, భద్రాచలం చేరుకుని తన తల్లి ఇచ్చిన నగలను రామయ్యకు,సీతమ్మకు సమర్పించి, అటునించి అటే సన్యాస దీక్ష తీసుకోవడానికి వెళ్ళిపోతాడు.  ఇదీ కథ సం

అందానికి నేనే అప్ప !

  మా అక్క శ్రీదేవీలాగుండుద్ది.  నేను మా అక్కలాగుంటా! అట్నా!  మా అక్క జడ నాగుపాంలాగుండుద్ది.  నాదీ అంతే. ఒత్తూ బారూ! అట్నా! మా అక్క కాలి పొడుగు మనిషి. నేనూ అంతే, సన్నం,నిటారు! అట్నా! మా అక్కది గుండ్రం మొకం నాది కోల మొకం! అట్నా? సరేగానీ, ఎట్టొచ్చిందో అంతందం? నా అక్క పసుపు, చెనిగి పిండి, పెరుగు పెట్టుద్ది మొహానికి. నేను కలబంద, ముల్తానీ మట్టి పెడతా! మాయక్క తలకి అవదం పెట్టుద్ది. నేనైతే కొబ్బిరి నూనె మంచిగా పెడతా. రాత్రికి మాయక్క ఫెయిర్‌ అండ్‌ లౌలీ రాసిద్ది. నేను పాల మీగడ రాత్తా. అయితే నీకన్నా మీ అక్కే అందంగా ఉండుద్దా? చీ! నేనే అందంగుంటా! అట్నా, మరి శ్రీదేవి? శ్రీదేవి కన్నా మా అక్కే బాగుండుద్ది! మరి నువ్వు? అళ్ళిద్దరికన్నా నేనే బాగుంటా! అట్నా! 😁

నవ్వుతూ నవ్వుతూ చావాలి రా!

  అన్నయ్యా, ఈయన అన్నింటికీ టెన్షన్‌ పడిపోతూ, పాతవన్నీ తలుచుకుంటూ, తవ్వుకుంటూ తనలోతాను కుమిలిపోతున్నారు, మీరొచ్చి సహాయం చెయ్యాలని చెల్లెమ్మ ఫోన్‌ చేస్తే ఇటొచ్చా.  నువ్వలా మొహం ముడుచుకుని కూచోడం,  ప్రతిదానికి చిటపటలాడడం,  అన్నింటికీ ధుమధమలాడడం  నీ గుండెకి,  కాలేయానికి,  ఊపిరితిత్తులకి, మూత్రపిండాలకి  మంచిది కాదు. తెలిసిందా? చూడ్రా,  నవ్వడం ఒక మెగా భోగం! నవ్వకపోవడం ఒక జెయింటు రోగం! నేను కనిపెట్టిన నవ్వో థెరపీ తో నీ జబ్బులన్నీ మాయమైపోతాయి. ఓకే? ముందుగా నువ్వు మా కితకితల క్లబ్బులో చేరాలి.  రోజూ ఉదయాన్నే అక్కడ మా అసిస్టెంట్లు నీకు వద్దన్నా కితకితలు పెట్టి నవ్విస్తారు.  తర్వాత నీకు మావాళ్ళు తెలుగులో వచ్చిన హాస్య రచనలు, జోకుల పుస్తకాలు, హాస్య పత్రికలు ఇస్తారు.  నువ్వు చెయ్యాల్సిందల్లా హాయిగా అవన్నీ చదువుకోవడం, చదువుకుని చదువుకుని నవ్వుకోవడం! సరేనా?  ఇలా రోజంతా చేసి రాత్రి పడుకోబోయే ముందు, ఒకసారి గాఠ్ఠిగా నవ్వేసి పడుకోవాలి! ఓకే! ఆర్నెల్ల తర్వాత-  అన్నయ్యా! ఘోరం జరిగిపోయిందన్నయ్యా!  నవ్వుతూ నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారన్నయ్యా!   మీ నవ్వో థెరపీ పని చేసి ఆయన నవ్వడం మొదలు పెట్టారన్నయ్యా! అస్తమానం నవ్వడమ