పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

క్లిక్‌.. క్లిక్‌

చిత్రం
మా ఆవిడతో సిన్మాకొచ్చా. ఫొటో తియ్యి బాబు. ఫేస్‌బుక్‌లో పెట్టి అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి. క్లిక్‌.. క్లిక్‌ నాకు ఎన్నో మానసిక సమస్యలున్నాయి. డాక్టర్‌ గారి మందు చీటీతో దుప్పటి కప్పుకుని ఉన్న నా ఫొటో తీసి ఫేస్‌బుక్‌ లో పెడితే లైకులతో, కామెంట్లతో నా మనసుకి కాస్త ఊరట వస్తుంది. క్లిక్‌.. క్లిక్‌ రోజుకో చీర కట్టి ఫేస్‌బుక్‌లో పెట్టడం నా అలవాటు. ఈ వంకాయ మొక్కల దగ్గర వంగపండు చీర కట్టుకున్న నన్ను ఫొటో తియ్యి బాబు. ఫేస్‌బుక్‌లో పెట్టుకుని అందరి అభినందనలు పొందాలి. క్లిక్‌.. క్లిక్‌ ఇవాళ పోయినాయిన కర్మ చేస్తున్నాం. ఫొటోలు తియ్యి బాబు. ఫేస్‌బుక్‌ లో పెట్టి వచ్చిన కామెంట్లను పోయినాయిన చెవిలో చదివితే ఆయనకు ఆత్మశాంతి. క్లిక్‌.. క్లిక్‌ వీడెవడో ఫొటో తీయమని చెవి కోసిన మేకలా అరుస్తున్నాడు. వాడికో ఫొటో తియ్యి బాబు.

కట్టర్‌ సాంబార్‌

చిత్రం
  వంట చేద్దామని బ్రహ్మీ సిద్ధమౌతుండగా, తలుపు ఎవరో కొడుతున్నట్టు చప్పుడు వినబడింది. తలుపు తీసాడు. Mr. మిరియమ్‌: మా దేముడు real దేముడన్మాట. మీ present దేముళ్ళు, మా past దేముళ్ళు దేముళ్ళు కాదన్మాట. నేను పైక్ వెళ్ళ్ మొత్తం  చూసొచ్చానన్మాట. నేను direct గా దేముడితో daily phone contact లో ఉంటానన్మాట. మీరు మా మతంలోకి వచ్ఛి మా దేముడ్ని నమ్‌కుని నాకు మీ శాలరీలో ఎవ్రీ మంత్‌ 10% ఇవ్వాలన్మాట. అంతా ఈ బుక్‌ లో ఉన్నాది. చద్వుకోండి.  ఈ బంపర్‌ ఆఫర్‌కి తల్లకిందులై పోయిన బ్రహ్మీ, ఏమిటో అంతా కన్ఫూజన్‌గా ఉంది సార్‌! లోపలికెళ్ళి మంచినీళ్ళు తాగొస్తా అని తలుపేసుకున్నాడు, కాసేపు చూసి చూసి వాడే పోతాడులే అనుకుంటూ. ఇంతలో మళ్ళీ తలుపు కొడుతున్నట్టు టకటకా చప్పుడైంది. బ్రహ్మీకి తలుపు తీయక తప్పలేదు. Mr. రెడ్‌ కారెట్‌:  మీరు అగ్రవర్ణం అయితే మీరు default bad. మీరు ఫలానా ఇలాకా వారైతే మీరు default bad. మీది ఫలానా జిల్లా అయితే మీరు default bad.మీరు మగవారైతే మీరు default bad. మీరు ఆకలి కేకల మీద కాక పువ్వుల మీద, నవ్వుల మీద కవిత్వం రాస్తే మీరు default bad. మీరు ధనికులైతే మీరు default bad. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఈ బుక్‌లో. ఇద

సాగర సంగమమను ఒకానొక మహాకావ్యమందు

  కృష్ణ శాస్త్రి:  జయప్రదా, నా ఊర్వశీ! నా గాఢ వేదనాగ్నిని, బడబాగ్నిని,నాలో నేనే దహించుకొను కుసుమ కోమల భావనాగ్నిని ఏలాగు నే భరించెద? అహో! జయప్రదా, ఈ జగత్తున నీవు పరపత్ని వన్న ఊహ నన్ను కాల్చి, నీ మనసులో మనసునై, కవితలో కవితనై, పాటలో పాట కావలెనన్న నా ఆకాంక్షను నులిమి వేయుచున్ననూ నిన్నే నా ఊర్వశిగ హృదయమున నిల్పెద.నిల్పెద. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?  నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ? శ్రీశ్రీ: నా హృదయంలో నిదురించే చెలీ,జయప్రదా! నీకోసం నాకోసం వస్తున్నాయవిగో జగన్నాధ రథచక్రాల్‌! రాలేవూ మన కోసం?   ఏవీ చెలీ! నిరుడు కురిసిన చిరునవ్వుల తరగలు? నును సిగ్గు దొంతరలు? పరాధీనవూ నువ్వు? బానిసకొక బానిసవు?  కనులరమోడ్చి మెదలకుండా నగరం హృదయంలో వృషభంలా అయిపోయెగా నా మనసు! చెలీ! చెలీ! సరి, మరి,ఇక నా హృదయంలోనే నిదురించు! చలం: అలా మెత్తని నీ పెదవులని చేరిన చిరునవ్వుని చూస్తో, అలలలుగా వస్తోన్న గాలికి అటూ ఇటూ నాట్యం చేస్తోన్న నీ ముంగురులను గమనిస్తో, నెమ్మిలిలాగు పురి విప్పిన నీ కురులను తాకుతో,  రోజులు,యుగాలు గడిపేద్దామని ఆశ పడ్డాను. మరైతే నీవు రాలేవూ? అవునులే నీవు ముగ్ధ మనోహర జయప్రదవు. నా మైదానం రాజీవి కాదుగా. సరే

Very good,very good

  బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత మిరియాలమ్మ కవిత: సీత  మోకాళ్ళ ప్రార్దన చేస్తాంటే రాముడు  బయట వెయిటింగు సీత ఉపవాస ప్రార్దన చేస్తాంటే రాముడు బయట వెయిటింగు మరి రాముడు మారేదెప్పుడో? సెక్యులర్‌ హిందూ: very good. Very good. పండిత భాషేష్‌: రామాయణం మీద వేరే వేరే కథనాలకి ఆస్కారం లేదా? రామాయణాన్ని విమర్శించే పుస్తకాన్ని నిషేధించడం నిరంకుశత్వం. విమర్శించే వారికి పెద్ద పీట వెయ్యాలి.  సెక్యులర్‌ హిందూ: very good. Very good. రంధ్రాన్వేషణమ్మ: రామాయణంలో నేను కనిపెట్టిన బొక్కలు ఇంకెవరూ కనిపెట్టలేదు. నేనంటే నేనే! నేనే గ్రేట్‌!  సెక్యులర్‌ హిందూ: very good. Very good. బక్వాస్‌ భాయి: ఇది హిందూ symbol. ఎలా display చేస్తారు? ఇది తీసెయ్యాలి అని నేను రాసిన వ్యాసం పెద్ద హిట్‌. సెక్యులర్‌ హిందూ: very good. Very good. అటుగా వెళుతున్న సనాతని, సెక్యులర్‌ హిందూ సమాధానాలు విని,  ఏంటి బాబు, ఏం జరుగుతోందో నీకు అర్థం అవుతోందా అసలు? సెక్యులర్‌ హిందూ ( విసుగ్గా) : నువ్వుండవయ్యా, నేను very good అనాలి.

తెలుంగు తలైవర్‌ కి జై!

చిత్రం
  పదేళ్ళ తరువాత జైలునించి విడుడలైన ఖైదీ రుద్రయ్య తన కూతుర్ని కలవడానికి లారీలో వెళుతూ, డాలస్‌కి, హ్యూస్టన్‌ కి మధ్యలో ఓ మామిడి తోటలో “తెలుగు కవిత్వ సభ” అన్న బానర్‌ చూసి, ఆహా, తెలుంగు విని ఎంత కాలమై పుడుస్తాందని, కాసేపు కవిత్వం విని పోదామని, లారీ ఆపుకుని వినడం ప్రారంభించాడు.  ముందుగా సభకి అధ్యక్షుడైన జెఫ్ఫా భాయి లేచి, నేను నలభై యేళ్ళుగా కవిత్వం రాస్తున్న ముదిరి పోయిన‌ కవిని. తెలుగు దేశంలో ఉన్న అవార్డులన్నీ ఇప్పించుకున్నా. ఆవార్డు పొందిన నా కవిత “సెంటర్లో శవం” వినిపిస్తా. సెంటర్లో శవం ఒకటి ఉంది కళ్ళు ఉబ్బి రక్తం గడ్డకట్టి చర్మం మొద్దుబారిన ఆ శవం వెనకాల మరో శవం ఉంది. కళ్ళు ఉబ్బి రక్తం గడ్డకట్టి చర్మం మొద్దుబారిన ఆ శవం వెనకాల మరో శవం ఉంది మరో శవం ఉంది అని కూర్చున్నాడు. చప్పట్లు ఉదారంగా మోగాయి. తాతాచారి తన శిష్యుడిని చూసుకుని మురిసిపోయాడు. తరువాత వృద్ధ కవి PVG లేచాడు. తన “పేలని తుపాకీ” ని చదవసాగాడు. రాముడొక రాజు మాత్రమే నేనొక మతిమాలిన మనిషిని మాత్రమే రాముడు అడవికి వెళ్ళాడు నేనూ అడవి వెళ్ళాను రాముడు బాణం వేసాడు నేను తుపాకీ పేల్చాను నా తుపాకీ పేలలేదు ఇంటికి వచ్చాను అదెందుకు పేలలేదా అని ఇప్పటి

అగ్గిపుల్ల-సబ్బు బిళ్ళ-సుబ్బ లక్ష్మి

  సుబ్బ లక్ష్మి అందర్లాంటి గృహిణే కానీ ఆవిడలో ఓ కవి గాడు ఉండి ఆవిడని నానాక ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. చూసి చూసి ఓరోజు సుబ్బ లక్ష్మిలోని అంతరాత్మ కవిగాడిని కూర్చోబెట్టి క్లాస్‌ పీకడం ప్రారంభించింది. రేయ్, ఎప్పుడు చూసినా ఓ కవిత రాయి, కథ రాయి, పుస్తకం చదువు అని సుబ్బ లక్ష్మి ని వేపుకు తింటూ ఉంటావ్‌. ఆవిడ పాపం నీ గురించి సవాలక్ష పనులు పక్కన పెట్టి, ఓ కవితో,కథో రాస్తుంది. నువ్వు అంతటితో ఊరుకోవు. ఇంకా బాగా రాలేదు,ఇంకా మెరుగులు దిద్దు అని సణుగుతూ ఉంటావ్‌. చందమామను చూస్తే ఆగిపోతావ్‌. పూలను చూస్తే ఆగిపోతావ్‌. పక్షులను చూసి నిలబడిపోతావ్‌. ఎట్టరా నీతో? సుబ్బ లక్ష్మి ఇంటో పని చేసుకోవద్దా? పాపం ఇంట్లో ఆవిడ పనేదో ఆవిడ చేసుకుంటూ ఉంటే సాహితీ సభకి వెళ్దామని నస పెడతావ్‌. వెళ్ళిన వాడికి ఊరికే ఉండకుండా ఏదో ఒక తింగరి పని చేస్తావ్‌.  మొన్నోసారి వక్త గారు విసిరిన చెణుకుకి అన్‌ పార్లమెంటరీగా విరగబడి నవ్వడమే కాక పక్కనున్న సాహితీజీవి వైపుకి ఆ నవ్వుని పాస్‌ చేసావ్‌. ఆయన గారు పక్కన భార్య ఉండడంతో సుబ్బ లక్ష్మి నవ్వు చూసీ నవ్వాలా వద్దా అన్నట్టు మొహం ఇబ్బందిగా పెడితే పక్కనున్న ఆయన ఇల్లాలు నేనిక్కడే ఉన్నాను సుమీ అన్నట

బొంగులో చికెన్‌

  కామన్‌ ఫ్రెండు బర్త్ డే అనుకో. అందరూ విషెస్‌ చెప్పిందాక ఓ రోజు ఆగి, అప్పుడు బిలేటెడ్‌ విషెస్‌ చెప్పాలి.  మీకు నచ్చిన పాట ఏంటి మేష్టారు అని ఎవరైనా అడిగితే ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చే ఏడుపుగొట్టు పాట నాకు చాలా ఇష్టం అని చెప్పాలి. ఉదయం గుళ్ళో కచేరీ చేసి, సాయంత్రం సభలో ఎర్ర కండువా కప్పుకుని కూచోవాలి. ఓటు మాత్రం పసుపు జెండాకి వెయ్యాలి.  ఇంకా, రాముడి కన్నా రావణాసురుడు మంచోడని ప్రకటించాలి. అందానికి, ఆచారానికి, గుణానికి ఏ విలువా లేదని, అనాచారాలు,దుర్గుణాలు గొప్పవని వ్యాసాలు రాయాలి. గుళ్ళో కనిపిస్తే మాయావిడ బలవంతం మీద వచ్చానని చెప్పాలి. దేవుడు లేడు కానీ దెయ్యం ఉందని చెప్పాలి. మధ్య మధ్యలో సర్దాకి కా.కు కన్నా హలం గొప్పోడని, హలం కన్నా హెలెన్‌ గొప్పదని ఫేస్బుక్‌ లో పోస్టులు అలా అలా పూర్తిగా అటూఇటూ కాకుండా రాయాలి. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి గురూ గారు? అందర్లాగే ఉంటే మన స్పెషాల్టీ ఏముంటాదిరా బొంగులోది!

తాడి చెట్టెక్కలేవు!

  Facebook Uncle: పుస్తకాలు చదివి ఎవ్వరూ మారరు.  The Logical Indian: ఫలానా పుస్తకం తమ జీవితం మీద ఎంతో ప్రభావం చూపిందని, తమ ఆలోచనావిధానాన్ని మార్చిందని చెప్పిన వారు ఎంతోమంది ఉన్నారు. గొప్ప పుస్తకంలో ఏ విషయం ఎంత వరకూ,ఎలా నిన్ను ఆకర్షిస్తుందో అది నీ మానసికస్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. గుడికి వెళ్ళి దివ్య మంగళ మూర్తిని చూస్తావో, అక్కడ కూడా గుడికొచ్చిన ఆడవారిని చూస్తావో, నీ స్థాయిని బట్టి ఉంటుంది. పుస్తకంలో జ్ఞానం అందుకున్న వారికి అందుకున్నంత మహదేవ. అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు అన్నట్టు. Facebook Uncle: 🤐🤐🤐 Facebook Aunty: ఆడా మగా సమానమే. The Logical Indian: శారీరకంగాను, మానసికంగాను అనేక భేదాలున్న జీవులు వారిరువురు. ఒకరికొకరు complement కాగలరు గానీ ఒకరినొకరు replace చెయ్యలేరు. సమానం అన్నది రుద్దుడు ప్రచారం. అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ్గొట్టుకుందన్నట్టు. Facebook Aunty: 🤐🤐🤐 Facebook Uncle: సాహిత్యం వేరు. మనిషి వేరు. సాహిత్యంలోని గొప్పదనాన్ని చూడాలి గానీ ఆ సాహిత్యం సృష్టించిన మనిషిలోని బలహీనతలను చూడరాదు.  The Logical Indian: రాసే రాతలకి చేసే చేష్టలకి సంబంధం ఉండదు అనడం

ఆడ్నెవరికైనా సూపించండ్రా!

చిత్రం
  భాషేష్‌: నేను నా వ్యాసాల్లో వేదాల్లోంచి Quote చేస్తా. కానీ వేదాలంటే నాకేమీ remote గా కూడా గౌరవం లేదు. నేను పురాణాలను, ఇతర హిందూ మత గ్రంథాలను పరామార్శిస్తా, తరువాత వాటిని నా వ్యాసాల్లో విమర్శిస్తా.  అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా.  రబ్బర్‌‌: నేను తెలుగు పత్రికల్లో బొమ్మలేస్తా కానీ వాటిల్లో తెనుగుదనం జయమాలిని డాన్సులాగా కనిపించీ కనిపించకుండా ఉండేటట్టు మానేజ్‌ చేస్తా. హిందూ దేవుళ్ళను కామెడీగా గీస్తా. నా మతాన్ని మాత్రం జాగ్రత్తగా మోస్తా. అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా.  జెఫ్పా: నేను, నా పత్రిక, హిందువుల మీద, హిందువుల వల్ల నడుస్తున్నా, నా పత్రికను హిందూ దేశాన్ని, హైందవాన్ని తిట్టిపోయడానికి వాడతా. బయట మాత్రం చక్కెర పూసిన మాటలు మాట్టాడతా. అరుగు మీది పెద్దాయన: రేయ్‌, ఆడ్నెవరికైనా సూపించండ్రా! అలా వదిలెయ్‌కండ్రా బాబు ఆడ్నలాగ. కూసోబెట్టి సెప్పండ్రా.  మిస్‌గైడెడ్‌ మిస్సయ్య: నేను మొన్నటిదాకా “అ” వాదిని. ఇప్పుడు అందులోను అన్యాయం ఉందని గ్రహించా

మీరేంటో? మీ విదానాలేంటో?

చిత్రం
  ఏమీ తోచక ఫేస్బుక్‌ తెరిచాడు సామాన్య రావు. అక్కడి పోస్టులు చదవడం మొదలు పెట్టాడు కాలక్షేపానికి.  ఫేస్బుక్‌ మేధావి1: మీరు చెప్పేదీ కరక్టే. ఆయన చెప్పేదీ కరక్టే. మీరు చెప్పేదాంట్లో పాయింటుంది, ఆయన చెప్పేదాంట్లో పాయింటుది. 👍 ఫేస్బుక్‌ మేధావి2: మీరు నిన్న పెట్టిన పోస్టు గురించి పనులు మానుకుని రాత్రంతా ఆలోచించా. మీరు చెప్పిన దాంట్లో సామాజిక కోణాన్ని అంగీకరిస్తున్నా. ఆర్థిక కోణాన్ని 60 శాతం మాత్రమే ఆమోదిస్తున్నా. రాజకీయ కోణాన్ని మీరు విస్మరించారని విమర్శించడానికి నాకు మన ఆత్మీయ కోణం అడ్డు వస్తోంది. 🙏 ఫేస్బుక్‌ మేధావి3: సాహిత్యంలో రచయిత్రుల అందానికి ప్రాముఖ్యత ఉంటుందన్న మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేనైతే అందానికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వను. పక్కన్నించి అందమైన అమ్మాయి వెళుతుంటే నేను చచ్చినా చూడను. ఎందుకైనా మంచిదని అందంగా లేని అమ్మాయిలతోనే friendship చేస్తా. పుస్తకం వెనక్కి తిప్పితే అక్కడున్న రచయిత్రి ఫొటో చూడాల్సి వస్తుందని, ముందు పుస్తకానికి అట్ట వేసేసి తరువాత పుస్తకం తెరుస్తా. 😌  ఫేస్బుక్‌ మేధావి4: మీ పోస్టులో కిందనించి రెండో వాక్యము, పైన్నించి మూడో వాక్యము బాగున్నాయి. 👏 ఫేస్బుక్‌ మేధ

Don’t trouble the trouble!

చిత్రం
  “అక్కు పక్షి” పత్రికా కార్యాలయంలోకి హడావిడిగా ప్రవేశించాడు అమర సింహారెడ్డి.  నేరుగా పత్రికకి కార్టూనిస్టు, చిత్రకారుడు అయిన రబ్బర్‌ వద్దకు వెళ్ళాడు.  ఏయ్‌! రబ్బర్‌! నీ ఆఫీసుకొచ్చా! నీ డెస్కు దగ్గరికొచ్చా! ఏమిటి నీ బొమ్మల కత?  అది విని పెన్సిల్‌ తో దీక్షగా బొమ్మ వేస్తున్న రబ్బర్‌ తల పైకెత్తి చూసాడు. అ.సిం.రె: మొన్న మీ పత్రికలో “దీపావళి శుభాకాంక్షలు” అంటూ వేసిన బొమ్మలో కృష్ణుడిని- నడ్డితో అడ్డదిడ్డంగా వంకర్లు తిరిగిపోతున్న చిన్న పిల్లాడు, బోసి మెడతో తింగరిబుచ్చిలా ఉన్న ఓ ఆడ మనిషి బాణం వదలుతుంటే తప్పట్లు కొడుతున్నట్టు అసహ్యంగా వేసి శుభాకాంక్షలన్నావు. అసలు సత్యభామ బాణం వదులుతుంటే కృష్ణుడు చూసే కొంటె చూపు, ఆ మనోహర రూపం, నీ బొమ్మలో ఎక్కడివిరా వెధవా? రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ. అ.సిం.రె: బోసి మెడతో ఏ అలంకారాలు లేకుండా చేతిలో ఓ అరేబియన్‌ వాయిద్యం పెట్టి సరస్వతి అని బొమ్మ వేస్తావా? సరస్వతి ఎలా ఉంటుందో తెలియదురా నీకు? రబ్బర్‌: నేనో అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడిని. అది క్రియేటివ్‌ లిబర్టీ. అ.సిం.రె: నీ బొమ్మల్లో బొమ్మలకి కట్టు,బొట్టు, కాటుక, గజ్జెలు,

తాతాచారి కల

తాతాచారి తెలుగు నేలకు భారంగా అనేక సంవత్సరాలు బ్రతికి ఓ రోజు అందర్లాగే పైకి పోయాడు. ఈ “హఠాత్‌” ఘటనకు భాషేష్‌, వెవ్వెవ్వే వెంకోజీ, చండ్ర హింసారావు తదితర మిత్రులంతా వలవలవలా ఏడుస్తూ ఎలిజీలు వ్రాయడం మొదలు పెట్టారు.  ఈ ఏడుపంతా పైన్నించి విని తాతాచారి చిరాకు పడ్డాడు.  రేయ్‌! సన్నాసుల్లారా! నేను పైన అప్సరసలతో కాలక్షేపం చేయవచ్చునని ఆనందిస్తుంటే మీ దిక్కుమాలిన ఏడుపులేంట్రా? అని ఓ అరుపు అరిచేటప్పటికి మన జీరోలంతా మనకెందుకొచ్చిన గోల అని ఫేక్‌బుక్కులు మూసుకుని ఎవరిళ్ళకు వాళ్ళు పోయారు.  తాతాచారి రాకను గమనించి, తన ఆస్థాన రంభా ఊర్వశి మేనక తదితర దేవతాస్త్రీలను తాను కాపాడుకోవాలి కనుక ఇంద్రుడు వెంటనే తాతాచారిని అడ్డగించమని ద్వారపాలకులను ఆజ్ఞాపించాడు.  తాతాచారి హిహ్హిహ్హిహ్హీ అని చిన్న పిల్లాడిలా నవ్వు మొహం పెట్టి భూలోకంలో మనుషులను బుట్టలో వేసినట్టే స్వర్గలోక ద్వారపాలకులను బుట్టలో వేద్దామని రెండడుగులు వేసాడో లేదో ఇద్దరు జీవులు ఆ ద్వారాల వద్ద కేకలు వేస్తూ కనిపించారు.   దగ్గరకెళ్ళి చూద్దుడు కదా, వారిలో ఒక జీవి మహాకవి అరుణశ్రీ, మరొక జీవి మహా రచయిత హలం.  స్వర్గలోకంలోకి ప్రవేశం కల్పించాలని నినాదాలిస్తున్నారు. “

అంతేగా! అంతేగా!

చిత్రం
  తెలుగు రచయిత‌1: నాకు బట్టతల,చట్టిముక్కు ఇత్యాది కారాణాల వల్ల కలిగిన ప్రేమ వైఫల్యాలు,ప్రేమ పిచ్చివాడ్ని,పాత్రలేని బిచ్చగాడ్ని చేసిన ఘటనల వల్ల కలిగిన డిప్రెషన్లు,కంప్రెషన్లు,ఇన్‌ డైజెషన్లు వల్ల కలిగిన డిప్రైవేషన్లలను కతలరూపంలో వ్రాసి వ్రాసి చాలా చాలా పేరు అదీ ఇదీ సంపాదించి ప్రస్తుతం అవార్డుల లిస్టులో చాలా డిప్రెస్డ్ గా వెయిట్‌ చేస్తున్నా. నేనో గొప్ప రచయితనని మీరు గుర్తించి తీరాలి. అయోమయ తెలుగు పాఠకలోకం: అంతేగా! అంతేగా! తెలుగు రచయిత2: నాకు మనుస్మృతి అంటే తెలీదు. నా జీవితంలో చూడలేదు. అయినా దాన్ని తగలెట్టాలని కతలు రాస్తా. రామాయణం టీవీలో చూడ్డమే తప్ప ఎప్పుడూ చదివే తీరిక దొరకలేదు. అయినా రావణాసుడు గొప్పవాడని,శూర్పణఖ మాఇంటి ఆడపడుచు అని కతలు రాస్తా. నాకతలన్నీ సూపర్‌ హిట్‌. ఆల్రెడీ నాకు ఎన్నెన్నో అవార్డులు వచ్చాయిగానీ నేను అలుపెరగకుండా నేను ఎప్పుడూ మొహం కూడా చూడని పురాణాల మీద, దేవుళ్ళ మీద పుస్తకాల మీద పుస్తకాలు రాసి బళ్ళకెత్తిస్తున్నా.  అ.తె.పా: అంతేగా! అంతేగా!  తెలుగు కవి1: పొద్దున్నే పేపరు చూస్తా. అన్ని ముఖ్య వార్తల మీద కవితలు గిలికి మళ్ళీ ఆ వార్తాపత్రికలకే కవితల విభాగానికి పంపుతా. రైతులు Vs

వాయించడ్రా భజంత్రీలు!

  వెంకోజీ: ఈనెల మన  ఒక్క పొద్దుకి పెళ్ళి మంత్రాల మీద ఓ వ్యాసం రాద్దామనుకుంటున్నానోయ్‌! భాషేష్‌: మంత్రాలు,తంత్రాలు మనకేమొచ్చు గురూజీ? వెంకోజీ: పెద్ద ముండావాడిని కాబట్టి పెద్ద మనిషిని కూడా అయి ఉంటానని ఈమధ్య నన్ను పెళ్ళి పెద్దగా పిలుస్తున్నారోయ్‌. ఆ అనుభవంతో పెళ్ళి మంత్రాలన్నీ cut copy paste చేసి తాత్పర్యాలతో ఓ వ్యాసరూపం ఇస్తా.  భాషేష్‌: ఆ మంత్రాలు ఎక్కడైనా దొరుకుతాయి కదా గురూజీ? అలా మంత్రాలు గుదిగుచ్చితే వ్యాసం ఎలా అవుతుంది?  వెంకోజీ: వ్యాసంలా కనిపించేటట్టు built up ఇస్తానోయ్‌. దీని మీద పాఠకుల్నించి ఎంత ప్రతిస్పందన వస్తుందో నువ్వే చూస్తావుగా. అలా ఆ నెల “పెళ్ళినాటి ప్రమాణాలు” అన్న వెంకోజీ వ్యాసం ఒక్కపొద్దులో ప్రత్యేక వ్యాసంలా ప్రకటింపబడింది.   అనుకున్నట్టుగానే ఆస్థాన పాఠకులంతా స్పందించారు. తాతాచారి: పెళ్ళి గురించి మావాడు రాసిన వ్యాసం చదివి నాకు వెంఠనే పెళ్ళి చేసుకోవాలని సరదా పుట్టింది సుమండీ. అంత బాగా వ్రాసాడు మావాడు. వాడిని నేను, నన్ను వాడు ఎంత పొగిడినా తక్కువే.  ఇంతకీ ఈ పెళ్ళి మంత్రాలు ఎవడికీ అర్థం కావు. ఎందుకంటే మనకు సంస్కృతం రాదు. మనకి తెలుగూ రాదు. తెలుగు ప్రొఫెసర్ని నాకే తెలుగు సరిగ్