ఇదేనా ఇంతేనా జీవితసారమిదేనా
జీవన మరణ చక్రాన్ని మన పూర్వులు బాగా అర్ధం చేసుకుని వేదాంతాన్ని రక్తమాంసాల్లో ఇముడ్చుకున్నారు. కనుకనే వారి జీవితాల్లో అతి దుఃఖాలు,అతి సంతోషాలు మనం చూడము. స్థితప్రజ్ఞతను అణువణువునా అస్థిగతం చేసుకున్న జీవితాలు వారివి. డ్యూయెట్లు,రొమాంటిక్ పాటలు,సినిమాల మధ్య ఇలాంటి పాటలను అప్పుడప్పుడూ వింటూ ఉంటే, మన మనోవికారాల మీద,అల్ప సంతోషాల మీద,అకారణ రాగద్వేషాల మీద- మన మీద మనమే అద్దం ముందు నిలబడి కాసేపు నవ్వుకోవచ్చు. ఆనక ఆ దుమ్మును మనసుపైంచి తుడుచుకోవచ్చు. ********** చిత్రం: యోగి వేమన (1947) సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు గానం: చిత్తూర్ వి. నాగయ్య ఇదేనా ఇంతేనా జీవితసారమిదేనా అంతులేని ఈ జీవన వైభవమంతయు తుదకు నశించుటకేనా ఇదేనా ఇంతేనా బోసి నవ్వులను కువ్వలు బోసే పసి పాపాల బతుకు ఇంతేనా జీవితా సారమిదేనా ఆట పాటల నలరించుచూ సెలయేటి వోలె వెలివారే బ్రతుకు ఇదేనా ఇంతేనా కిలకిల నవ్వుచు తొలకరి వలపుల ఉలకవోయు జవరాలి వయ్యారమా ఇదేనా ఇంతేనా దాచుకున్న వయసంతయు మగనికి దోచి సు ఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా పురిటి పాప చిరు పెదవుల తాకునా మురిసిపోవు బాలింత బ్రతుకు ఇదేనా ఇంతేనా ...