పోస్ట్‌లు

జనవరి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

WhatsApp బీర్బల్‌?

  బీరేంద్ర ప్రసాద్‍ కి బీరంటే ప్రాణం.   “బీర్బల్స్‌” Whatsapp group వాళ్ళు తనని సభ్యుడిగా చేర్చుకోవడం అతన్ని ఎంతో అనందపరిచింది.  ఉత్సాహంగా బీరు మీద postలు పెట్టడం ప్రారంభించాడు.  “ఈజిప్టు బీరుకి,మెసపటేమియా బీరుకి గల పోలికలు-భేదాలు” ”బీరులో ఈగ పడితే ఎలా?” ”బంగాళా దుంపలతో ఇంట్లోనే బీరు చేసుకోవడం ఎలా?” వంటివి.  లైకులు,లవ్వులు,మెచ్చుకోళ్ళు వచ్చి పడ్డాయి.  బ్రహ్మానందభరితుడై ఇంకా కొత్త కొత్తగా-  “బీరుతో సాంబారు కాయడం ఎలా?” ”బీరు మాత్రమే తాగి 30 రోజులు బ్రతకడం ఎలా?”  వంటి వినూత్న postలు పెట్టడం మొదలు పెట్టాడు.  ఈసారి ఇంకా లైక్స్‌‌,లవ్స్‌,నమస్కారమ్‌స్,కా మెంట్స్‌ వెల్లువలా రాసాగాయి.  అలా ఓ నెల గడిచిందో లేదో బీరేంద్ర కు బీర్బల్స్‌ group admin నించి ఫోన్‌ వచ్చింది. WhatsApp Admin: మీరు చాలా ఎక్కువ messages పెడుతున్నారని group సభ్యులు complaint చేస్తున్నారు. ఇకనించీ ప్రతి సభ్యుడు రోజుకొక్క message కన్నా పెట్టరాదని rule పెట్టాం. బీరేంద్ర: చాలామంది నేను పెట్టే messages కి positive గా respond అవుతున్నారు కదండీ. Admin: వాళ్ళందరికీ కూడా warning ఇవ్వడం జరిగింది. ఇకనించీ ప్రతి సభ్యుడు ఒక్క message కే లై