పోస్ట్‌లు

ఆగస్టు, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓ మృత్యువు-కొన్ని ఆలోచనలు

 ఈ రోజుకు మా నాన్న గారు మరణించి సరిగ్గా పదిహేను సంవత్సరాలు. ఆత్మీయులు భౌతికంగా మరణించినా మన జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటారు.  మనం అభిమానించిన వారు మనని చులకన చేస్తున్నారని, మనం ఎంతో ప్రేమించిన వారికి మన మీద ప్రేమ ఏమీ లేదని తెలిసినపుడు మన స్నేహితులుగా వారు మన మనసులోంచి తొలగింపబడతారు. మనుషులుగా జీవించి ఉన్నా స్నేహితులుగా మరణిస్తారన్న మాట. లేదా ‘Best friends’ నించి ‘మామూలు పరిచయస్థులు’ గా మన మనసులో demote అవుతారు.  భౌతికంగా వెళ్ళిపోయినా, మానసికంగా దూరమైనా ఇదంతా మనసుకు చాలా బాధాకరమైన ప్రక్రియ.  అందుకే చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా అంటాడో కవి. అసలు మన మనసు ఎదుటి వారికి ఉచితంగా ఇవ్వడమెందుకు దాన్ని వాళ్ళు బద్దలు కొట్టారని వ్యధ చెందడమెందుకు? మన మనసును మన దగ్గరే ఉంచుకుంటే పోలా?  మనసు చెప్పినట్టల్లా వింటే ఇంతే సంగతులు.  అందుకే  సనాతన ధర్మం మనసు గినసు జాంతానై  నీ ధర్మం నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపో అని చెర్నాకోలుతో కొట్టినట్టే గట్టిగా అదిలించి చెబుతుంది. ప్రేమలు,అభిమానాలు మనసును బంధించి కర్మచట్రంలో ఇరికిస్తాయని హెచ్చరిస్తుంది.  ఎవరో అన్నట్టు చనిపోయిన వాళ్ళ కోసం చనిపోబోయే వాళ్ళు ఏడుస్తున్నట్టు ఉంటు

భాషే లేని భావమో

చిత్రం
 మనుషులు ప్రేమించడాన్ని ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తున్నామనుకుంటారని ఓ రచయిత అంటారు. ప్రేమించడాన్ని ప్రేమించేవారు పాటను ప్రేమించకుండా ఎలా ఉండగలరు? ఇంతకీ మాధవపెద్ది సురేష్ గారు సంగీతాన్ని‌ సున్నిత త్రాసులో తూచి పాటకు అద్దుతారు. శ్రోతల ప్రాణనాడులు సంగీతంలోని హాయిని అనుభవించేలా. ఈపాట సాహిత్యంలో కవిత్వం సనసన్నగా రాలిపడుతోన్న పువ్వుల్లా ఉంటుంది.  ఇది ‘ఇది’ అని తెలియని భావమో ఇది పలికే భాషే మౌనమో ప్రేమ గానమో  ఇది సరిగమలెరుగని రాగమో ఇది భాషేలేని భావమో సాహిత్యం అతి సహజంగాను,ఎక్కడా ఒక్క పదం ఎక్కువ వేయకుండా కనకాంబరాలు తూచినట్టు, సంగీతం ఎక్కడా ఎక్కువ కాకుండా మల్లెదండలో దారంలా అలా అలా యమన్‌ కల్యాణి రాగంలో అమిరిపోయిన అపురూపమైన పాట,  ఇవాళ మరోసారి.