విశిష్ట భాష తెలుగు
ప్రపంచంలో ప్రతి సమాజంలోను భాష రెండు రకాలుగా ఉంటుంది. భాష స్పష్టంగా తన స్వరూపాన్ని చాటుకునే “శిష్ట భాష”. రకరకాల వ్యక్తుల స్థాయిలను, పరిసర ప్రభావాలను అనుసరించి వివిధ రూపాలుగా విక్షేపం చెందిన “గ్రామీణ భాష”. యాసలు, మాండలికాలు వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. విద్య,పాండిత్యము ఎక్కువగా ఉండే ఉన్నత వర్గాలలో (Aristocrats) భాష తన స్వచ్ఛతను, స్వస్వరూపాన్ని సహజంగానే నిలుపుకుంటుంది. అందుచేతనే, దేశాధిపతులు,ఉన్నత అధికారులు, పండితులు,మేధావులు కలిసినప్పుడు, వారి చర్చలలో, ప్రసంగాలలో, సభల్లో శిష్ట భాషే వినిపిస్తుంది. వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో శిష్ట భాషే కనిపిస్తుంది. సభలో మాట్లాడ్డానికి నిలబడ్డ ప్రతి వ్యక్తీ సంస్కారవంతుడైతే, కష్టపడైనా సరే, శిష్ట భాషే మాట్లాడతాడు. మాట్లాడాలి. ఎందుకంటే శిష్ట భాష అనేది భాషాపరంగా ఆ సమాజం యొక్క అత్యున్నత నాగరికతకు,అభిరుచికి,పురోగతికి నిదర్శనం. అయితే, వివిధ యాసలను ఆనందించడం, వివిధ మాండలికాలను ఆస్వాదించడం,జానపద సాహిత్యాన్ని గౌరవించడం మన సంప్రదాయం. మరి ఇప్పుడు కొత్తగా భాషకు వర్ణం,కులం, ప్రాంతం,లింగభేదం వంటికి ఎందుకు ఆపాదిస్తున్నారు? నవీ...