The three universal truths
ఏమండీ, మొన్న సాహితీ సభలో అంతగా ప్రసిద్ధి కాని ఆ రచయితను అంతలా పొగిడారే? అతడు మా కేస్టు వాడండీ. అటుమొన్న సభలో పొగిడిన రచయిత? అతనూ మా కేస్టు వాడే. ఆగండాగండి. మీరేమనుకుంటున్నారో నాకర్థమైంది. మా కేస్టులో వ్రాసేవారే తక్కువ. ఉన్న నలుగురినీ నాలుగు మంచి మాటలు చెప్పి ప్రోత్సహించడం,పేరు తేవడం నా ధర్మం కదా. పైగా వాళ్ళంతా నాకు బాగా పరిచయస్ధులు కూడాను. మంచిదేలెండి. మరి ఓ సభలో ఆ కవిని తెగ పొగిడారు? అతడు మీ కేస్టు వాడు కాదే? అతను కమ్యూనిస్టండీ. కమ్యూనిస్టైతే ఏ కేస్టయినా మన కేస్టే. ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ కమ్యూనిస్టైనా మన కేస్టే. బాగా చెప్పారండీ. మరి ఇంకో సభలో ఆ రచయిత్రిని పొగిడారు? ఆవిడ మీ కేస్టూ కాదు, కమ్యూనిస్టూ కాదే? భలే వారే సార్, పాపం లేడీస్‌కి కేస్ట్ ఏంటి సార్? ఏ కేస్టయినా మనతో ఫ్రెండ్లీగా ఉన్నంతకాలం మన కేస్టే. ఏం చెప్పారండీ! చూడండీ, మీకు తెలియకుండానే మూడు సార్వకాలీన, సార్వజనీన సత్యాలు చెప్పారు సార్!