పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పువ్వు-పిల్ల

చిత్రం
https://www.koumudi.net/Monthly/2007/october/oct_2007_mamcikavita.pdf   

కథారచనలో లోపాలు-కారణాలు

చిత్రం

మెరుపు

ఆరడుగులు పైకిలేచి ఆగి ఆగి ఊగుతోంది నల్ల తాచు అలల మీది ఓడలా తూగి తూగి వాలుతోంది గడ్డి పోచ ఉండుండి గంతేసి వెర్రిగా పరుగెడుతోంది తుఫాను గాలి కాటుక కాయ నింగి చీలి కన్ను చెదిరే కాంతి కురిసి వెలుగుతున్నవి నల్ల తాచు గడ్డి పోచ

కాళీ పదములు-3

  1. కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను. 2. కాళీ, మాటలు నాకొద్దు జ్ఞానమనే చెట్టుకు మౌనమనే పండు కాసిందిట ఆ పండు కోసుకు నిశ్శబ్దంగా తిననివ్వు కాళీ, మహిమలు నాకొద్దు మౌనమనే పండులో వైరాగ్యమనే గింజ ఉందిట ఆ గింజని తీసి నిర్లిప్తంగా మింగనివ్వు కాళీ, మోక్షసాధన నాకొద్దు వైరాగ్యమనే గింజనించి జ్ణానమనే చెట్టు నాలోంచి పుడుతుందట ఆ చెట్టు కిందకు వచ్చి నిలబడు. 3. పక్షి ఒకటి క్షణం ఆగి నీళ్ళు తాగి వెళుతోంది లేత ఆకుల తీగె వెదురు గెడను అల్లుతోంది ఝుంఝుం తుమ్మెదల గుంపు గాలివాటుకు చెదురుతోంది గడియ పడ్డ మది చెవులకు ఘల్లు ఘల్లు గజ్జె సద్దు తోటలోకి కాళ రాత్రి వస్తోందని కీచురాయి పదే పదే అరుస్తోంది.

శిథిల రాజ్యం

అటు మొన్నెపుడో పరిఢవిల్లిన రాజ్యాల్‌ ఏవేవని అటూఇటూ వెతికితే రాళ్ళూరప్పలూ వాటి మధ్య పడి మొలిచిన మొక్కలూ శిథిలాల్లో నిద్రిస్తో భిక్షుకుడో సన్యాసో ఆకటితో అలమటిస్తో డొక్కలెండిన ఊర కుక్కో నగారాల్‌ మోగిన బుఱుజులపై పావురాళ్ళ రెట్టలో ఆ కిందన అవయవాలు కోల్పోయిన నల్లరాతి శిల్పాలో పడగొట్టిన స్తంభాలో ఆ పక్కన ఏ చాటునో మలిన ప్రేమ కాముకులో అజ్ఞానంతో వారు చెక్కుకున్న పొడి పేర్లో ఎండకు ఎండీనీ వానకు తడిసీనీ రుబ్బురోళ్ళ కిందను కాలి మెట్ల కిందను పోయినవేవో పోగా రాజు మాటే శాసనంగ మసక మసక మసగ్గా మిగిలిన తెలుగక్షరాలో సరిగ్గా ఇక్కడనే ఏ మహారాజు మూలుగులో ఏ మహారాణి రోదనలో ముష్కర మూకల మృత్యు పద ఘట్టనలో మరణించిన భృత్యుల పేగులు లాగుతోన్న రాబందుల కలకలలో క్షతగాత్రుల విలవిలలో మహారాజు మహారాణి పరివారము పడిపోగా ఏనుగులు గుర్రాలు పండితులు నాణ్యాలు రాజ సభల వైభవాలు కలలాగా కరిగిపోగ వందలేళ్ళు నిశీథిలో భారంగా గడిచిపోగ చివరకు మిగిలిందిదిగో రాళ్ళూరప్పలూ వాటి మధ్య పడి మొలిచిన మొక్కలూ శిథిలాల్లో నిద్రిస్తో భిక్షుకుడో సన్యాసో ఆకటితో అలమటిస్తో డొక్కలెండిన ఊర కుక్కో.

సాయం ఛాయ

చిత్రం
  నేనూ ఒకప్పుడు యువకుడినే అన్నాడు మామయ్య పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ జంధ్యాన్ని ముందుకు తోస్తూ నా పద్యాలకు ఒన్స్‌ మోరులు హోరెత్తేవి నా పాటలకు జనం విజిళ్ళు జోరెత్తేవి నా కొంటె మాటలకు యంగ్ గరల్స్ హార్ట్స్ అయిస్‌ క్రీముల్లా కరిగిపోయేవి! మన ఇలాకాలో మొనగాడిని బంగారు పతకాల వేటగాడిని ఏమనుకున్నావ్, మామయ్యంటే? ఆ పురవీథుల్లో యువసింహాన్ని నా బ్లాక్‌ అండ్ వైట్‌ కాలానికి నేనే ఈస్టమన్ కలర్ హీరోని! మామయ్య ఆ రోజుల్లో కథలన్నీ వెయ్యిన్నొకటోసారి విని ఎండ, ఎండ ముందు ఎండ ఎండ, ఎండ వెనకాల ఎండ మళ్ళొస్తానని మళ్ళిపోతే  కుర్చీ కింది మూడంకె నల్లపిల్లి మునివేళ్ళ మీద సందె చీకట్లలోకి జారిపోతే  నాలిక పీక్కుపోతోంది కాఫీ పట్రావే అని ఇంట్లోకి ఓ కేకేసి సుదూర ఆకాశంలోకి సాలోచనగా చూ–పు సారించి  నేనూ ఒకప్పుడు యువకుడినే ముక్తాయించాడు మామయ్య బొజ్జ నిమురుకుంటూను బొద్దు మీసాలు సవరించుకుంటూను

మణికర్ణిక

చిత్రం
ముసలి కట్టెల మీది మంటల గుబురుల్లోంచి గంగ వైపుకి పాకే తెల్లని పొగ పాము. నీళ్ళల్లో ఊగుతున్న నిర్జీవ హస్తాన్ని ఒడ్డుకి లాగే అఘోరా డేగ. అట్టలు కట్టిన జుట్టుముడి మడిచిన కాళ్ళు ముడిచిన వేళ్ళు మూసిన కళ్ళు సాధువు పిసినికాయ. పురాతన ధ్వనులేవో ముక్కున కరుచుకుని గంగ మీదుగా పడవల పైకెగిరి కాశీ ఇరుకువీధుల్లో రెక్కలార్చే గాలి వాయసం. తడి పాదాలను మోస్తున్న మూగ బండలను తట్టి నీళ్ళు తాగి బరువెక్కిన బట్టలను తాకి ఊరికే మెట్లెక్కి దిగే సూర్యుడు యాత్రికుడు పాములు ఆకారాలను మార్చే మబ్బులను చేరి వాయసాలు నిరామయంగా ఊగుతున్న పడవలను తాకి డేగలు గంగ మీదికి పంజాలు విసిరి పిసినికాయలు సీతాకోక చిలుకలై నలుదిక్కులా వెదికితే గంగ ఒడ్డున యాత్రికుడి దోసిలిలో దొరికిపోయింది అదిగో మణికర్ణిక. ( శివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని వెళుతున్నప్పుడు ఒక్కక్క అవయవము ఒక్కొక్కచోట పడిపోతూ ఈ ఘాట్‌ వద్ద చెవి కమ్మ పడిపోయిందని చెబుతారు. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఇది మణికర్ణికా ఘాట్‌. ) https://eemaata.com/em/library/2129.html  

కోటిగాని కతలు: బత్తాయిలు పోయినాయి

  చుక్కలు పొడిచాయి.   ఊరంతా బువ్వ తిని నిద్దర్లకి మళ్ళింది.  ఊళ్ళో ఆరుబయట నులక మంచాల మీద పడుకుని ఎప్పటిలాగే పాడేరు ముసలమ్మలు.  దొంగ లింగయ్య గారు ఉద్యోగపరులు  ఇల్లు దాటంగానే ఇల్లాలు తుమ్మె వాకిలి దాటంగానే వరుడు తాపలికే  నంబి తంబళెదురాయె నాగు పామెదురాయె చెవుల పిల్లెదురాయె చేటు వచ్చే  ​కన్నాన ​బో​యేవు ​కన్నాన వచ్చేవు కన్నాన నీ తల ఖండింతురయ్యా!  “కన్నాన కత్తిపీట పెట్టావా?” “ఆఁ… పెట్టాను!” అరిచారు పిల్లలు. “వంకిన మంగళం వేశావా?”  “ఆఁ… వేశాను!” అరిచి నవ్వేరు పిల్లలు.  ఈ పాట పాడితే దొంగలు పడరని బామ్మల నమ్మకం.  రామయ్య తోటలో ​ రెన్నాల్లనించి దొంగలు పడుతున్నారంట! చెప్పింది ఓ ముసలమ్మ ఇంకో ముసలమ్మతో.  అసలుకే పీకల్దాక అప్పుల్లో ఉన్నాడు. మళ్ళా అప్పుచేసి​ తోట మీద పెట్టాడంట​!​ ఈ ఏడు పిల్ల పెళ్ళి గూడా బెట్టుకున్నాడు. డబ్బులున్నా లేకున్నా మరి వయసొచ్చిన పిల్లకు పెళ్ళి జెయ్యాల్సిందేగా.  రామయ్య పెళ్ళాం ఆదెమ్మొచ్చి ఒకటే ఏడుపు. రెండ్రోలుగా తిండి గూడా సరింగా తింటంలేదంట. ఎవురో దొంగలు. అక్కడే మంచం మీద వెల్లికిలా పడుకుని చుక్కలు లెక్కపెడున్న కోటి ఈ మాటలన్నీ చెవినేసుకుని మనూళ్ళో అంత దొంగలు ఎవురబ్బా అనుకుంటూ నిద్దర

కవిత్వానికి ప్రేరణ

   I will be the gladdest thing     Under the sun!  I will touch a hundred flowers     And not pick one.  I will look at cliffs and clouds     With quiet eyes,  Watch the wind bow down the grass,     And the grass rise.  And when lights begin to show     Up from the town,  I will mark which must be mine,     And then start down!  (Edna Millay)  ఇంత సున్నితమైన కవిత రాయగలగడానికి ప్రేరణ ఏమై ఉండొచ్చు?     నిజమైన కవిత్వానికి నిజమైన ప్రేరణ-అనుభవాలు,జ్ఞాపకాలు వాటి గాఢత.  కళాకారులకి కళను రగిలించడానికి అనుభవాలు కావాలి. అనుభవాల నించి కళలు,కావ్యాలు.అయితే కళలు,అనుభవాలు రెండూ మనిషిని ఊపేస్తాయి.  తాత్కాలికంగానైనా గాఢ ప్రభావానికి లోనై రాస్తాడు లేకపోతే తన సునిశిత దృష్టి సోకిన చిట్టి పొట్టి విషయాల మీద కూడా రాయగలడు.రెండవదానికి  కొంత సున్నిత హృదయం కావాలి. అనుభవాలు అన్నీ కవిత్వంగా మారవు.ఎన్నో   ఏళ్ళ క్రితం కలిగిన అనుభవాలు,మర్చిపోయామనుకున్నవి ఆ తర్వాతెప్పుడో కవిత్వంగా బయటపడడం కద్దు.  దైనందిన ఘటనలు,ప్రకృతి,బాల్యం,ప్రేమ,స్నే హాలు,పరిచయాలు, వైఫల్యాలు,తాను చూసిన సమాజంలోని అన్యాయాలు జీవితంలోని పలు సందర్భాలు అన్

కాళిక

చిత్రం
  జొన్నవాడ   కామాక్షి   గజ్జెలు మధురలోని మీనాక్షి   గాజులు వారణాసి విశాలాక్షి మెట్టెలు ఘల్   ఘల్‌ ఘల్‌   ఘల్‌ మోగే   రాతిరి   నల్లని   కాళిక జగతికి   కాటుక నీలపు   నీలపు నీలపు   ఛాయల నింగి   నేలపై రహస్య   ఈళిక తీపి   హోళిక కాటుక   కన్నులు తెరిచిన   కాళిక తపించి   పోయే జీవుని   చేతికి అంజనమలదిన అంగుళి   ముద్రిక రహస్య   ఈళిక తీపి   హోళిక విచిత్ర   కేళిక కాళిక కాళిక

The great Indian rope trick

చిత్రం
కండెకు   చుట్టుకునే నూలు   పోగుల్లా పిప్పీ   పిల్లంగోవి చుట్టూ మంది పాటకు పడగ   విప్పిన తాడు   చుట్టుకు సాలె   పట్టుల్లా పైపైకి   లేచే సూటి   చూపుల జతలు వందలు మిడతలా కొనకి   చేరి న ఠింగణా   ఒకడు తెల్లబోయిన తెల్ల   మబ్బు నోట్లోంచి అప్పడంలా అంతంతగా జారిపోతే ఆకాశ   ప్పొ   ట్టలోకి రెప్ప   కొట్టడం వాయిదా   వేసిన కళ్ళ   వెనుక తుళ్ళి   పడ్డ తళుక్కు బంతులు . ఓయంటే ఓహ్హోయంటూ జన   సమూహాన పొడగడితే   బుడతడు ఇంద్రజాలపు గాలి   విసురుకు అట్టిట్టయినవి తలపాగాలు అహోరే ! భళి   భళీల కంబళీని ఎగరేసుకు   పోయేటి దీనార్ల   చిలకలు . బేరసారాల నడి   ఎండలో గారడీ   వాడి కనుమాయా కారు   మబ్బు కురిపించిన సోనవాన విచ్చుకత్తుల రాచ   వీథుల్లో పుట్టించిందో   ఉల్లాసపు హాళి   మడుగు .  

కాళీ పదములు-2

  1. కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను. 2. కాళీ, మాటలు నాకొద్దు జ్ఞానమనే చెట్టుకు మౌనమనే పండు కాసిందిట ఆ పండు కోసుకు నిశ్శబ్దంగా తిననివ్వు కాళీ, మహిమలు నాకొద్దు మౌనమనే పండులో వైరాగ్యమనే గింజ ఉందిట ఆ గింజని తీసి నిర్లిప్తంగా మింగనివ్వు కాళీ, మోక్షసాధన నాకొద్దు వైరాగ్యమనే గింజనించి జ్ణానమనే చెట్టు నాలోంచి పుడుతుందట ఆ చెట్టు కిందకు వచ్చి నిలబడు. 3. పక్షి ఒకటి క్షణం ఆగి నీళ్ళు తాగి వెళుతోంది లేత ఆకుల తీగె వెదురు గెడను అల్లుతోంది ఝుంఝుం తుమ్మెదల గుంపు గాలివాటుకు చెదురుతోంది గడియ పడ్డ మది చెవులకు ఘల్లు ఘల్లు గజ్జె సద్దు తోటలోకి కాళ రాత్రి వస్తోందని కీచురాయి పదే పదే అరుస్తోంది.

‘ఱ’ నవలిక-సమీక్షలు

చిత్రం
ఈమాట సమీక్ష: https://eemaata.com/em/issues/202008/23495.html మధురవాణి సమీక్ష: https://www.madhuravani.com/pustaka-jul17 కినిగె పత్రిక సమీక్ష : https://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-BandiRa.pdf సాక్షి సమీక్ష: కినిగె లంకె: https://kinige.com/book/Bandi+Ra