పోస్ట్‌లు

అక్టోబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సాహితీ భేతాళ ప్రశ్నలు

ఎప్పటివలే విక్రమార్కుడు శ్మశానంలో చెట్టు మీద నుంచి భేతాళుడిని దించి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.  అప్పుడు భేతాళుడు విక్రమార్కునితో- “హాయిగా అంతఃపురంలో నీ శయ్యాగారంలో హంసతూలికాతల్పంపై నిదురించవలసిన ఈ సమయంలో ఈవిధంగా శ్మశానంలో నడుస్తున్న నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తోంది,విక్రమార్కా! నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు కొన్ని సాహితీ ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది,జాగ్రత్త!” అంటూ ఇలా అడగసాగాడు. “మహాకవి అరుణశ్రీ మూడో భార్య తాలూకు నాలుగో బామ్మర్ది పేరేమిటి?” ఇది నా మొదటి ప్రశ్న అన్నాడు,కన్ను కొడుతూ.  విక్రమార్కుడు భుజాన ఉన్న భేతాళుడి వైపు కోపంగా చూసి,తిరిగి మౌనంగా నడవసాగాడు.  ఎందుకయ్యా అంత కోపం? నీకు అంతఃపురంలో చాలామంది “ఆవిడలు” ఉంటారని, నీవు నచ్చే ప్రశ్న అడిగానయ్యా! అన్నాడు భేతాళుడు ఎగతాళిగా నవ్వుతూ. విక్రమార్కుడు మళ్ళీ కోపంగా చూసి ముందుకు నడవసాగాడు.  సరే పోనీ, ఇది చెప్పు. ఆ తెలుగు పదాన్ని తిరగేస్తే స్వప్న సుందరి, మరగేస్తే పేడ పురుగు అన్న అర్థాలు వస్తాయి. ఏమిటా పదం?  విక్రమార్కుడు చేతిలో ఉన్న కత్తితో తల బాదుకున్నాడు. నోరు తెరిస్తే వచ్చిన పని