పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

మాట మంత్రమే!

  జీవితానుభవం నుండి వచ్చే మంచి సారవంతమైన మాటలు ప్రతి మనిషి నోటినించీ ఎప్పుడో అప్పుడు వెలువడతాయి ఆశ్చర్యంగా.అప్పుడవి చటుక్కున అందుకుని దాచుకుని,సందర్భం ఎదురైనప్పుడు ఆ మాటను ఒక సలహాగా జ్ఞాపకం చేసుకోవచ్చు.  విపరీతంగా దానధర్మాలు చేసి బీదరికంలోకి జారిన చిత్తూరు నాగయ్య గారు, “నా జీవితం పదిమందికి గుణపాఠం కావాలి” అనేవారట. అలా అనగలగడానికి మనిషికి ఎంత ఔన్నత్యం ఉండాలి?  ఓ ప్రముఖ నటీమణి ఓ Interview లో తన వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తూ, “నేను కూడా నిలుపుకోలేక పోయాను” అంటే- అనుభవంలోంచి వచ్చిన ఆమె పరిణితికి అచ్చెరువొందుతూనే అయ్యో అనుకున్నాను.  కందుకూరి వీరేశలింగం పంతులు గారు తన జీవిత చరిత్రలో తనకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని తీవ్రముగా దూషించే బలహీనత ఉన్నదని వ్రాసుకున్నారు.  “లోధ్ర” కేసరి గారు, “ధన పిశాచమావహించి” తోటను,అందమైన బంగ్లాను అమ్మివేసితినని చింతించారు.  “ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా” అనేది మా తాతమ్మ. భారతీయ సంస్కారం!  “ఎవ్వరి మాటలు పట్టించుకోనవసరం లేదు” అన్నారొక మిత్రులు. అది దూషణమైనా,భూషణమైనా. “తప్పొప్పులు ఎంచుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ పోతే ఎవరూ మిగలరు” అన్నారొకసారి మా గురువు గ

RGV and his రాముఇజం

  రాంగోపాల్‌ వర్మ గారు మా కాలేజీలోనే చదువుకున్నారు.  మేం చదువుకునేటప్పుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడూ ఇక్కడే కూచునే వాడట, ఇక్కడ తిరిగేవాడట, జేబులో కత్తి పెట్టుకుని తిరిగేవాడట అని చాలా కథలు చెబుతుండేవారు మా సీనియర్లు. నేను చదువుకునేటప్పుడు  RGV అక్కడ ఉండి ఉంటే ఖచ్చితంగా గురువు కమ్ స్నేహితుడిగా చేసుకుని ఉందును. అతను చెప్పేవాటికి అన్నింటికీ అంగీకరించను కానీ ఏ విషయం గురించైనా RGV analysis వేరే లెవల్లో ఉంటుంది.  Creative persons ఎలా ఆలోచిస్తారనేది RGV మాటల్లో వినవచ్చు. హృదయవ్యాపారం చాలా సంక్లిష్టమైనది. రకరకాల భావోద్వేగాలు ఎగిసిపడి మొదట సంతోషం ఆనక అపరిమితమైన దుఃఖం కలిగించడం అందరికీ అనుభవంలో ఉన్నదే.   ప్రేమ సఫలమైనా విఫలమైనా చాలామందికి ఒడ్డుకు చేరాక దుఃఖమే కలుగుతుంది. బంధానికి,మోక్షానికి మనసే కారణమని చివరాఖరికి ఎరుక కలుగుతుంది. చేరువైనా దూరమైనా ఆనందమే అనుకోగలిగితే వేదాంతం బాగా ఒంటబట్టినట్టే. ప్రేమ అనేది అందరికీ ఆసక్తికరమైన ఒక అంతులేని అధ్యయనాంశం.  అలాగే నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నువ్వు చూస్తున్న ప్రపంచం, నీలో ఉన్న ప్రపంచం,నీతో ఉన్నవారి ప్రపంచం అన్నీ వేరు,వేరు. ఈ ప్రపంచాలు మారుతూ ఉంటాయి. ఇది భారతీయ వ

రస భంగం

నేను నీకు   ఏ మాటా ఇవ్వలేను.  వెచ్చని ఈ గది  తలుపు తోసుకు  చల్ల గాలిని  వెంట తెచ్చావనో  కిటికీ దగ్గర    మాగన్ను              పావురాయి   నీ బూటు చప్పుడుకి  ఎగిరిపోయిందనో  తలలో  మెది లే      తలపు  చేప      పదాల గేలానికి      చిక్కకుండా  తిరుగుతోందనో    ఈ కుర్చీలో నే  గంటనించీ  అక్షరాలు ఆవరించి  కూచున్నాననో    అందుకనో  మరెందుకనో.

తెనుగుల సినిమా తెగులు

చిత్రం
  ఈమధ్య ఒక కొత్త విషయం తెలిసింది. సెన్సారు బోర్డు వారు ఉన్నది అభ్యంతరకర దృశ్యాలను కత్తిరించడానికి కాదుట! కేవలం అశ్లీలత/హింసాత్మకత స్థాయిని బట్టి వాటిని U,A లాంటి ఒక్కో అరలో పడెయ్యడమేనట వారి పని! కానీ పాకిస్థానును ఏమైనా అంటే వెంటనే ఆ దృశ్యాలు కత్తిరించేస్తారుట! హీరో హీరోయిన్లుకి ఒంటి పైన బట్టలు ఉంటే చాలు U certificate,ఆది మానవ స్వరూపాలైతే A certificate ఇచ్చి pass చేసి చేతులు దులుపుకుని ఇంటికి చక్కా పోతారట.  కోట్లమందిపై ప్రభావం చూపే సినిమా గురించి ముగ్గురు నలుగురు అపరిణిత బుద్ధులకి అధికారం ఇవ్వడమా?  ఇప్పుడు పెళ్ళి,పుట్టిన రోజు,పండగ ఏదైనా సినిమా పాట ఉండాల్సిందే. ఆ పాటలు నేర్చుకునే వాళ్ళు,పాడేవాళ్ళు.ఆ పాటలకి నృత్యాలు నేర్పించేవాళ్ళు,నేర్చుకునే వాళ్ళు ఎక్కడ చూసినా.  “సంగీత్‌” అంటే మా కుటుంబం నృత్యప్రతిభ చూడుడి అనే కార్యక్రమం. అచ్చంగా గంధర్వలోకం. వయసుతో సంబంధం లేదు,అందరూ గంధర్వులే. మదిరా సంయుక్త నృత్యగాన హేల! అదో లీల.  తగులుకున్న సచ్చినోడు మొగుడౌతాడా అని ఓ దిక్కుమాలిన సామెత ఉంది. అలాగే ఈ తగులుకున్న సినిమా సంస్కృతి మన తెలుగు జాతి సంస్కృతి ఎలా అవుతుంది? చిన్న పిల్లల చేత కూడా ఆ దరిద్రపు సినిమా

కవిత్వం-కవి

చిత్రం
  మనసును నిశ్చలంగా ఉంచు,భావోద్వేగాలకు అతీతంగా అని చెబుతుంది యోగశాస్త్రం. భావోద్వేగాలే కవిత్వాన్ని పుట్టిస్తాయి కానీ, అవి చల్లారి మనసు నిశ్చలమయ్యాకే కవిత్వం పుడుతుంది ఏ కవికైనా.                                                                    మరీ కిందికి వెళ్ళిపోకు  పెను దుఃఖపు పాకంలోకి    మరీ పైపైకి తేలిపోకు  అమందానందపు ఆవిరిలోకి    రెంటికీ మధ్యలో  సన్న గీత ఉందే,  సరిగ్గా అదిగో  అక్కడే ఉండు.   కవిత్వం హల్వాలా  ఉడుకుతూ ఉంటుందక్కడ కుతకుతలాడుతూ  రెప్పలు వేస్తూ.