పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

సాహిత్యంలో శబ్దము-నిశ్శబ్దము

  శబ్దశక్తి అనంతం.    ఈ ప్రపంచమే శబ్దమయం.   కొన్ని ప్రత్యేక శబ్దాలకు , వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు.   శబ్దాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు  ఎరుకే.    ఈ శబ్దాలు , అక్షరాలై , వాటి సముదాయం పదాలై , పదాల సముదాయం వాక్యాలై , ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది.    ఈ భాష పరిణితి చెంది , ఉన్నత స్థాయిలో కళగా , సాహిత్యంగా రూపొందుతోంది.పాటలు , నాటకాలు , ప్రసంగాలు , కధలు , కవిత్వం ఇలా వివిధరూపాల్లో భాష కళకు వాహకం అవుతోంది.    అయితే ఈ భావాలు పంచుకోవడం శబ్దంతోనూ , నిశ్శబ్దంతోనూ చేయవచ్చు.  Verbal and Non-verbal communication  అన్న మాట.   భావాలు పంచుకోవడమే కాదు , ఎదుటి వాడిని హేళన చెయ్యడానికి , కించపరచడానికి , అధికారం , కోపం , ధిక్కారం మొదలైనవి ప్రదర్శించడానికి ఈ భాష , సంకేతాలు , హావభావాలూ పనికొస్తాయి.             ఈ మాటల్లోని అర్ధాలు చెప్పే వ్యక్తి వయసుని , స్థాయిని , ఆడ , మగ వీటిని బట్టి ,  ఎదుటివాళ్ళు అంచనా వేసుకుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు.    ఆకలేస్తే అన్నం పెడత

కాళీ పదములు

  1. నల్లని గంగ గొంతుకలో ఊగే నాలిక  పంచవటి శిఖలో రెప్ప వేయని కన్ను  సుదూర నిశిలో పరుచుకున్న కురులు  బేలూరు మఠం మెట్ల మీద కూర్చున్న ఛాయ దక్షిణేశ్వర్ గర్భగుడి వైపు చీకటి ముసురులో ఉండి ఉండి వినిపించే గజ్జెల చప్పుడు కాళి.  2. నీడ నీడలో కరిగిపోయి చీకటి రేగుతున్న రాత్రి దొడ్డి దోవ దొంగల్ని తరిమి తల్లో తుమ్మెదలకు మత్తు మందు తాగించి లోకపు పచ్చి వాసనలను కప్పి పెడుతున్న రాత్రి కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లలో కరుకు గొంతుకతో గాలి హూంకరిస్తున్న రాత్రి వేయి చేతులతో ఆద్యా శక్తిని ఆవహించుకుని వేయి రేకులుగా విచ్చుకుంటున్న రాత్రి మనో యవనికపై కాళీ నర్తనకై నాల్క సాచిన రాత్రి నీడ నీడలో కరిగిపోయి చీకటి రేగుతున్న ఈ రాత్రి. 3. కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను. 4. కాళీ, మాటలు నాకొద్దు జ్ఞానమనే చెట్టుకు మౌనమనే పండు కాసిందిట ఆ పండు కోసుకు నిశ్శబ్దంగా తిననివ్వు కాళీ, మహిమలు నాకొద్దు మౌనమనే పండులో వైరాగ్యమనే గింజ

ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్

  ( మొదటి అంకము)   ( సాయం వేళ, ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్బు)  (అయ్యరుకి నిండా పని. తసిబిసి అయిపోతోంది.      ఓ పక్క కాఫీలు పుచ్చుకుంటూ,వాదులాడుకుంటున్న  చిలకమర్తి వారు,జయంతి రామయ్య పంతులు ,మానవల్లి రామకృష్ణ కవి, గిడుగు,కాశీనాధుని.   అక్కడే మరో బల్ల మీద  సాహితీచర్చల్లో సోలిపోతోన్న   పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి,వేటూరి ప్రభాకర శాస్త్రి,రాయప్రోలు సుబ్బారావు,మొక్కపాటి- ) (శ్రీపాద పెద్ద అంగలతో లోనికి ప్రవేశించుచూ)      నా వడ్లగింజలు  చూశారూ?  అయ్యరు: వడ్ల గింజల బస్తా పోయిందా ఏమి? అయ్యయ్యో! చెన్న పట్నంలో నిండా బయటి దేశపు దొంగలే.  మన జాగ్రత్తలో మనం ఉండవలె సామీ. (ఆ వెనకే గరిమెళ్ళ రొప్పుతూ వచ్చి)     మాకొద్దీ తెల్లదొరతనము  బాబూ,మాకొద్దీ తెల్లదొరతనము  (అంటూ కేకలు వేసుకుంటూ క్లబ్బులోకి  దూసుకొని వచ్చెను. ఓ మూలన ఒంటి చేత్తో  ఇడ్డెన్ల పని పడుతున్న  జరుక్ శాస్త్రి ) మాకొద్దీ చద్ది ఇడ్డెనలు! బాబూ,  మాకొద్దీ చద్ది ఇడ్డెనలూ!  అయ్యరు: అయ్యో,అయ్యో మీ పేరడీ కొరకు మా ఇడ్డెనలను తిట్టెదరేల సామీ?            గుండు మల్లెపువ్వుల వంటి ఇడ్డెనలు, ఏ పూటకు ఆ పూట తాజాగా వేయుదుము.   క్లబ్బు సదస్యులు:     రండి,రండి!   ఆంధ్

రాణి-దాసీ

                                    రాణీ, దాసీ అక్కడక్కడా పాచి పట్టి,కొండ రాళ్ళ మధ్యని పిచ్చిమొక్కలు మొలిచి,సగం కూలిన కోట మీద నిలబడి దూరంగా కనబడున్న పొలాలని,ఇళ్ళనీ చూస్తూన్నారు. అలవాటైన కాలక్షేపం.  రాణి ముసలిది.  దాసి ముసలిది.  రాణి తల్లి రాణి.  దాసి తల్లి దాసి.  దాసి తల్లి రాణి తల్లికి దాసి.  పాట ఒకటి పొలాల మీదుగా తేలుతూ  వచ్చింది. ఏరువాకమ్మకి ఏమికావాలి?  ఎర్రఎర్రని పూలమాల కావాలి  ఎరుపుతెలుపుల మబ్బుటెండ కావాలి  ఏరువాకమ్మకి ఏమి కావాలి?  పొలము గట్టున నిలిచి వేడుకోవాలి  టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి  రాణికి పెళ్ళి అయినప్పుడు రాణితో బాటు ఈ రాజ్యానికి వచ్చింది దాసి. రాణీ గారి ఏడు వారాల నగల మిసమిస,రాజావారి ఠీవీ చూసి ఏడ్చిపోయింది దాసి.  తన లేమితనానికి కుమిలిపోయింది.  అప్పుడు దానికింకా పెళ్ళి కాలేదు.  చక్కని గుంటా- రాయే నా ఎంటా  సరసన కూచుంటా -పెళ్ళి  సే సుకుంటా  గుర్రాన్నెక్కిస్తా -కూడా నేనొస్తా  సర్రూన ఊరంత -సైదిరిగి వత్తాము  అని రాజు గారి భటుడొకడు దాన్ని చూసి పాట పాడేడు.  ఆనక పెండ్లాడేడు.  పెళ్ళాడాక దాని మనసు కొంత కుదుటపడింది. రాజా వారు వేశ్యల చుట్టూ తిరుగుతూ రాణిని పట్టించుకోలేదు.  అప్పుడు

చెఱువు దగ్గర గృహిణి

  నీలాంబరపు ఛాయలలో నీ కన్నుల వెలుగులలో నిండు నీళ్ళకుండలున్నవి అవి తొణకకూడనివి తామర రేకుల వంపులలో నీ మాటల చోటులలో నలనల్లని నీడలున్నవి అవి చెప్పకూడనివి చేప పిల్లల మిసమిసలో నీ చేతుల అంచులలో రక్తకాంతి గుసగుసలున్నవి అవి విప్పకూడనివి నీళ్ళ కుండతో నల్లని నీడలను కలిచే నీ చేతులు అమ్మాయీ, నీళ్ళ కుండ నింపుతూ దుఃఖాన్ని నడుముకు ఎత్తుతున్నవి నిండు నీళ్ళ కుండలు, చిప్పిల్లకూడనివి.

కవిత్వము-కవి

  కవిత్వం రాయడం ఒక వృత్తి కాదు. కవుల గురించి చెప్పినట్టు చాలా రకాలైన పాత్రల మీద,వృత్తుల మీద సూక్తులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి అమ్మల మీద,నాన్నల మీద,ఉపాధ్యాయుల మీద,సైనికుల మీద ఇలాగ. దేనికదే దాని పరిధిలో గొప్పది (అని అనుకోకపోతే ఆయా పాత్రలు,వృత్తులు చేపట్టలేరు మరి). అయా వృత్తులు చేసుకుంటూ ఆటో నడిపే అతను,హోటల్ సర్వర్ కూడా కథలు,కవిత్వాలూ రాయొచ్చు. అవి రాసినందుకు ఎవరైనా డబ్బో,అవార్డో,ప్రశంసా పత్రమో ఇస్తే తీసుకోవడం ఎవరికైనా సంతోషమే.కానీ నేను మాట్లాడుతున్నది, కవులు,రచయితలు ఇటువంటి మెప్పుదలల కోసం ఆశ పడ్డం మొదలై తమ భావనా ప్రపంచాలను కలుషితం చేసుకోవడం గురించే. రాయడం ఒక సర్వ స్వతంత్రమైన వ్యాపకం. కీర్తికి,ఆదాయానికి మార్గం కాదు. నీ దోవలో నువ్వు నడుచుకుపోతుంటే అయాచితంగా ఎప్పుడైనా బంగారు నాణాలు దొరకవచ్చు కానీ అప్పుడిక నువ్వు నిధి వేటకు బయలుదేరితే దారి తప్పక తప్పదు. భయపడ్డా,ఆశ పడ్డా కవి కింద పడ్డట్టే.   దేవుడు  వీడిని  గాలి తిని బతికే  ఆనంద కుమారుడిని  విషాదప్పవుడరు  పూసుకున్న        మోహన మూర్తిని  గులక రాళ్ళని  రత్నాలుగా   దాచుకునే  వెర్రి వాడిని   లోక సంచారిని  బికారిని చేసి, అప్పుడు  నెత్తి  మీద కుండ పె