పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సంక్రాంతి

నల్లని నీ చేతులు   మెత్తని మన్ను  బొంత కింద  చిన్నారి కలలను  నిద్ర పుచ్చుతాయి అవి కలల్లో కులాసాగా ఎదుగుతాయి పగటి ఎండలో రాత్రి చలిలో జోగుతాయి ఆనక  తాపీగా కాంతుల కాయలు విచ్చుతాయి చిరు చిరు  నవ్వుల ధాన్యాలు  చిలుకుతాయి చిలుక ముక్కుల మొగ్గలు కులుకుతాయి ఎండు గడ్డి  మేజోళ్ళ తల్లి భూదేవికి ఊరి గాలి దారి చూపుతోంటే దుమ్ము రేగుతోంటే గణగణ గంటల నీ జోడెడ్ల బండెక్కి అన్నా, చివరికవి నీ ఇంటి గరిసెలో మెల్లిగా ఒత్తిగిల్లి సేద తీరుతాయి మాగన్ను నిద్రలో మునుగుతాయి నిద్రలో ధనలక్ష్మి గాజుల గలగలకు కలకలలాడుతూ అవి  నలుదెసలా సరిగెలు జల్లుతాయి మించులు చిప్పిల్లుతాయి!  

చిన్ననాటి ముచ్చట్లు-పుస్తక సమీక్ష

చిత్రం
 

నవద్వీపంలో గణపతి మునికి కావ్యకంఠ బిరుద ప్రదాన ఘట్టం.

చిత్రం
 

టమాటలు

  ఎప్పుడో చిన్నతనంలో ఒకసారి హైదరాబాదు రైల్వే స్టేషనులో చిన్న జియర్‌ స్వామి తన శిష్యులతో వెళుతూ ఎదురొచ్చారు. అంతమంది జనంలోను నమస్కరించాను అప్రయత్నంగా. వారు చిరునవ్వుతో అక్కడినించే ఆశీర్వదించారు. ఆనందించాను.  మరొక సందర్భంలో ఒక ప్రముఖ పాత్రికేయులు బెంగుళూరు రైల్వే స్టేషనులో కనిపించారు. గుర్తు పట్టి దగ్గరకు వెళ్ళి పలకరించాను. ఆయన కొంత అహం ప్రదర్శిస్తూ వెళ్ళమన్నట్టుగా చెయ్యి ఊపుతూ మొహం పక్కకు తిప్పుకున్నారు. నాకు అవమానంగా అనిపించి కోపతాపాలతో ఇంటికి వచ్చి మాఅమ్మగారితో జరిగింది చెప్పాను.  అవతలి మనిషి ఏ ఆరోగ్యంతోనో, మానసిక చింతలోనో ఉండి ఉండవచ్చు. పలకరించడం,మర్యాదగా నమస్కరించడం వరకే మనం చెయ్యాల్సింది. అవతలి వాళ్ళ ప్రతి స్పందనతో మనకు పనిలేదు అని అన్నారు. ఇది తరువాతీ కాలంలో జీవితంలో నాకు చాలా ఉపకరించింది. పూర్వ భాషీ చ రాఘవ అన్నది తరచూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను.  ఎవరైనా అవమానిస్తే ప్రతీకారం చెయ్యాలా,భగవంతుడే శిక్ష విధిస్తాడులే అని ఊరుకోవాలా అని మా కాలేజీలో లెక్చరరుని అడిగానోసారి. భగవంతుడికే వదిలిపెట్టాలి, సగం నువ్వు చేసి సగం భగవంతుడిని చేయమంటే కుదరదు. అన్నాడాయన. ఆయనో భక్తుడు.ఆధ్యాత్మిక దృష్టితో