పోస్ట్‌లు

సెప్టెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ

  అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి ముది మదితప్పిన మొదటివేల్పు నచటి రాజులు బంటునంపి భార్గవునైన బింకాన పిలిపింతు రంకమునకు అచటి మేటికిరాటు లలకాధిపతినైన మును సంచిమొదలిచ్చి మనుప దక్షు లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి నాదిభిక్షువు భైక్షమైన మాన్చు నచటి వెలయాండ్రు రంభాదులైన నరయ కాసెకొంగున వారించి కడపగలరు నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి నచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ ఇది  పెద్దన గారి మను చరిత్రము లేక స్వారోచిష మనుసంభవములోనిది.  ఇందులోని “అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ”  చాలా సుప్రసిద్ధ పాదం. అందరూ విరివిగా వాడుతూ వస్తున్నది.  అయితే, ఇక్కడ “చిగురు కొమ్మ” అన్నది అందరూ అనుకుంటున్నట్టు “లేత కొమ్మ” కాదుట!  విశ్వనాథ వారిచ్చిన వివరణ ప్రకారం, కృష్ణదేవరాయల వారి పెనుగొండ కోట వద్ద అనేక “చిగురు చెట్లు“ ఉండేవి. ఈ చిగురు చెట్టు, మునగ చెట్టులాగా పెళుసైన కొమ్మలు గలది. చిగురు కొమ్మ చాలా పెళుసు కానీ “అచట” పుట్టింది కాబట్టి “చేవ”గలది!  పెద్దన గారు వ్రాసింది, ఈ చిగురు చెట్ల కొమ్మ గురించి అని-విశ్వనాథ వారి వివరణ. ఇంకో చిన్న విషయం ఇక్కడ- ఇచట పుట్టిన చిగురు,కొమ్మైన చేవ గాలైన కదలాడు సరిగమల త్రోవ అని రుద్రవీణలో పాడించ