Very good,very good

 

బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత మిరియాలమ్మ కవిత:


సీత 
మోకాళ్ళ ప్రార్దన
చేస్తాంటే
రాముడు 
బయట వెయిటింగు
సీత
ఉపవాస ప్రార్దన
చేస్తాంటే
రాముడు
బయట వెయిటింగు
మరి రాముడు
మారేదెప్పుడో?


సెక్యులర్‌ హిందూ: very good. Very good.

పండిత భాషేష్‌: రామాయణం మీద వేరే వేరే కథనాలకి ఆస్కారం లేదా? రామాయణాన్ని విమర్శించే పుస్తకాన్ని నిషేధించడం నిరంకుశత్వం. విమర్శించే వారికి పెద్ద పీట వెయ్యాలి. 

సెక్యులర్‌ హిందూ: very good. Very good.

రంధ్రాన్వేషణమ్మ: రామాయణంలో నేను కనిపెట్టిన బొక్కలు ఇంకెవరూ కనిపెట్టలేదు. నేనంటే నేనే! నేనే గ్రేట్‌! 

సెక్యులర్‌ హిందూ: very good. Very good.

బక్వాస్‌ భాయి: ఇది హిందూ symbol. ఎలా display చేస్తారు? ఇది తీసెయ్యాలి అని నేను రాసిన వ్యాసం పెద్ద హిట్‌.

సెక్యులర్‌ హిందూ: very good. Very good.

అటుగా వెళుతున్న సనాతని, సెక్యులర్‌ హిందూ సమాధానాలు విని, 

ఏంటి బాబు, ఏం జరుగుతోందో నీకు అర్థం అవుతోందా అసలు?

సెక్యులర్‌ హిందూ ( విసుగ్గా) : నువ్వుండవయ్యా, నేను very good అనాలి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన