Very good,very good
బీభత్స అకాడెమీ అవార్డు గ్రహీత మిరియాలమ్మ కవిత:
సీత
మోకాళ్ళ ప్రార్దన
చేస్తాంటే
రాముడు
బయట వెయిటింగు
సీత
ఉపవాస ప్రార్దన
చేస్తాంటే
రాముడు
బయట వెయిటింగు
మరి రాముడు
మారేదెప్పుడో?
సెక్యులర్ హిందూ: very good. Very good.
పండిత భాషేష్: రామాయణం మీద వేరే వేరే కథనాలకి ఆస్కారం లేదా? రామాయణాన్ని విమర్శించే పుస్తకాన్ని నిషేధించడం నిరంకుశత్వం. విమర్శించే వారికి పెద్ద పీట వెయ్యాలి.
సెక్యులర్ హిందూ: very good. Very good.
రంధ్రాన్వేషణమ్మ: రామాయణంలో నేను కనిపెట్టిన బొక్కలు ఇంకెవరూ కనిపెట్టలేదు. నేనంటే నేనే! నేనే గ్రేట్!
సెక్యులర్ హిందూ: very good. Very good.
బక్వాస్ భాయి: ఇది హిందూ symbol. ఎలా display చేస్తారు? ఇది తీసెయ్యాలి అని నేను రాసిన వ్యాసం పెద్ద హిట్.
సెక్యులర్ హిందూ: very good. Very good.
అటుగా వెళుతున్న సనాతని, సెక్యులర్ హిందూ సమాధానాలు విని,
ఏంటి బాబు, ఏం జరుగుతోందో నీకు అర్థం అవుతోందా అసలు?
సెక్యులర్ హిందూ ( విసుగ్గా) : నువ్వుండవయ్యా, నేను very good అనాలి.