తాతాచారికి కన్నడ వడదెబ్బ

 


కన్నడ శతావధాని: తాతాచారి గారు, శ్రీనాథుడిది ఆశు కవిత్వం, పెద్దనది ఆలోచనామృతమని తమరు షూలేసుతో కలిసి వ్రాసి పడేశారు.

అంటే, శ్రీనాథుడికి ఆశువుగా పద్యం చెప్పడమేగానీ, ఆలోచన లేదంటారా? 
లేక పెద్దనకు ధార లేదు, ఆలోచించి ఆగి ఆగి వ్రాస్తాడంటారా పద్యం? 

రెండూ తప్పే కదూ తాతాచారి గారు? 

తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ.

కన్నడ శతావధాని: శ్రీనాథుడిది, పెద్దనది, తెనాలి రామకృష్ణులది, కృష్ణదేవ రాయలది వేరే వేరే schools అని మాట్లాడారేమి మీరు,మీ షూలేసు?  

కవి మనోధర్మాన్ని అనుసరించి భిన్నంగా వ్రాసినంత మాత్రాన వారివి వేరే వేరే school of thought ఎలా అవుతుందండీ? 

తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ.

కన్నడ శతావధాని: తమరిద్దరు సృజనకారులు కారే?
 జన్మలో ఒక పద్యం రాయలేదు, కవిత్వం చెప్పలేదు. 
కవి కాకుండా, ఒక్క పద్యమూ వ్రాయకుండా, పద్యంలో ఒడుపు తెలియకుండా కవుల పద్యాలను ఏ జ్ఞానంతో బేరీజు వేసి వ్యాఖ్యానాలు చేస్తున్నారయ్యా? 

తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ.

కన్నడ శతావధాని: సంప్రదాయం తెలియకుండా, అవిచ్ఛిన్న సాంస్కృతిక ధారకు వారసుడవు కాకుండా, తెలుగు ప్రాచీన కవులను గురించి, వారి రచనలను గురించి అవాకులు,చెవాకులు వ్రాస్తారా? 

తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ.

తాతాచారి అలా అనగానే భజంత్రీలు మోగాయి. ఎవరా అని చూస్తే అది - షూలేస్. తాతాచారి టింగ్లీషును షూలేస్, షూలేస్ ఠెల్గూను తాతాచారి సరిదిద్దుకుంటూ ఉంటారు పాపం.

షూలేస్ కు ఏమీ అర్థం కాకుండా భజన చేసేంతలో భాషేష్‌ గుసగుసగా చెప్పాడు, అవతల కన్నడం ఆయన మనల్ను ఏకుతున్నాడు. నువ్వు తెలుగు రాకుండా ఏదో ఊహించుకోవద్దు.

ఆయన మాట్లాడేది కెనడా భాష కాదా? అది నీకొచ్చా? - సందేహంగా అడిగాడు షూలేస్.

కెనడా కాదు. కన్నడ. నాకు ప్రపంచ భాషల్లో రానిది ఏదీ లేదు 
అన్నాడు భాషేష్‌.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5