నృత్యము-అనుభూతి
మా బడిలో పాటలు పాడే అబ్బాయంటే మా ఆడపిల్లలందరికీ అదో ఇది.
నా స్నేహితురాలు అభిమానం దాచుకోలేక,నువ్వంటే నాకిష్టం అంది.
ఎందుకు? అడిగాడు అబ్బాయి.
నువ్వు పాటలు బాగా పాడతావని, అంది నా స్నేహితురాలు,సరళ హృదయ.
అప్పుడు నా బాల్యమిత్రుడు ఒక గొప్ప మాట చెప్పాడు, ‘పాటలు పాడతాడని,డాన్సులు వేస్తాడని ఇష్టపడకూడదమ్మా ఎవరినీ’ అని. అదిప్పటికీ నాకు గుర్తుండి పోయిన మాట.
అయితే మనిషి పాటలు పాడే కోకిలను, మాటలు చెప్పే చిలుకను,నృత్యం చేసే నెమలిని ఎందుకు ఇష్టపడతాడు? అవి కూడా పక్షులేగా? కాకి పొడుస్తుంది. నెమలి అంతకన్నా ఎక్కువగా దాడి చేస్తుంది. దొంగ మొహం కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెట్టేసి వస్తుందిట! అయినా చిలుకలు,కోకిలలు,నెమళ్ళు మనకిష్టం. ఎందుకు?
మనిషి మనసును రంజింపజేసే కళ ఈ పక్షుల ద్వారా వ్యక్తీకరింపబడుతోంది. అదీ సంగతి!
పాటగాని పట్ల స్త్రీలు ఆకర్షితులౌతారని వేదకాలం నాటి వాక్యం!! లోకానికి స్త్రీలు నేర్చిన విద్యలు వద్దు,ఆ విద్యలు నేర్చిన స్త్రీలు కావాలి అంటారో రచయిత.
ఏది ఏమైన మనిషికి ఆత్మోన్నతి కలిగించి మోక్షం దాకా తీసుకువెళ్ళగలిగే కళలను భారతీయులు ఏనాడో అభివృద్ధి పరిచి సాధన చేసారు,చేస్తున్నారు.
మీకు భారతీయ నృత్యాల పట్ల ఆసక్తి ఉంటే దూరదర్శన్ నృత్యం పై నిర్మించిన అపురూపమైన లఘ చలనచిత్రాలు ఇక్కడ చూడవచ్చును:
నృత్యానుభవ:
నాట్యశాస్త్ర:
జాయప సేనాని సంస్కృతంలో రచించిన ‘నృత్తరత్నావళి’ కి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు చేసిన తెలుగు అనువాదం ఇక్కడ చదవచ్చు: