పుట్టపర్తి వారి స్మరణలో-


 కళ-కళాకారులు, వీరికి లభించే ఖ్యాతి, లేక లభించని ఖ్యాతి లేక అవార్డులు వంటివి,జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ చక్రానికి అతీతమైనవి కావు. తేలిగ్గా చెప్పాలంటే “ప్రాప్తం“. ప్రాప్తాల సంగతి పక్కన పెట్టండి. అసలు, కళామతల్లి దేవాలయంలో పూజారిత్వానికి అర్హత సాధించడం ఏ సాధకుడికైనా బహు కష్టసాధ్యం. తగినంత సాధన లేక, సాధనకు సమయం లేక,వేరే వ్యాపకాల మధ్య అప్పుడప్పుడూ కళాసాధనకు పదును పెట్టాలని ప్రయత్నిస్తూ, తుప్పును వదిలించలేక తంటాలు పడేవాళ్ళు-సాటి కళాకారులను గురించి చాడీలు,పుకార్లు చెప్పుకోవడంలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీళ్ళు కళామ తల్లి దేవాలయం బయట బిచ్చమెత్తుకునే భిక్షగాళ్ళు. ఇంకొక శాఖవారు ఆ వాదం,ఈ వాదం అని జెండాలెత్తి అరుస్తూ, వాటి ప్రచారం కోసం సంపాదక పీఠాలెక్కి అక్కడనించీ తస్మదీయుల మీద విమర్శలనే రాళ్ళవర్షం కురిపించే అల్లిబిత్తిరి జెఫ్ఫా భాయిలు. వీళ్ళను కళామతల్లి ఎడమకాలితో తంతుంది. 

కళను కళగా ఆరాధిస్తూ,తమ జీవితాలను కళకు అర్పించిన వారికే కళామతల్లి గుడిలో అమ్మకు పూజ చేసే అవకాశం. వాళ్ళు ప్రజల మదిలో నిలుస్తారు,వారి కళ ప్రజల నాల్కల మీద నర్తిస్తుంది. 

ఆ కళామతల్లి పూజరుల్లో విశ్వనాథ ఒకరు. మా ముగ్గురిలో జ్ఞానపీఠానికి ఆయన ఒక్కడే అర్హుడు అని ఆ అవార్డు అందుకున్న మిగిలిన ఇద్దరు తెలుగు వారూ సవినయంగా అంగీకరిస్తారు. శ్రీశ్రీ కి అంతటి కవిత్వధారని ఈశ్వరుడిచ్చినా, కళామతల్లి గుడిలో పూజారిత్వం వచ్చినా, పూజ చేసినట్టే చేసి సహజ చిత్తచాంచల్యం చేత మెట్ల మీద బిక్షగాళ్ళ పక్కన కూచుండి పోయాడు! (ఒక రాజకీయ పార్టీకి మెగాఫోన్‌గా మారి తనలోని కవిత్వపు ఊటను ఇకింపజేసుకుని, తనను తానే అనుకరించుకుంటూ తిట్టు కవిత్వంలోకి దిగాడని శ్రీశ్రీని జరుక్‌ శాస్త్రి గట్టిగా విమర్శించాడు.)

జ్ఞానపీఠానికి అర్హుడై ఉండీ ప్రాప్తం లేక అందుకోలేక పోయిన మహాకవి,కళామతల్లి గుడిలో పూజారి మరొకరున్నారు. వారే “శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు” జ్ఞానపీఠం జారిపోయిన మహాకవి,పుట్టపర్తి!

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన