WhatsApp బీర్బల్?
బీరేంద్ర ప్రసాద్ కి బీరంటే ప్రాణం. “బీర్బల్స్” Whatsapp group వాళ్ళు తనని సభ్యుడిగా చేర్చుకోవడం అతన్ని ఎంతో అనందపరిచింది. ఉత్సాహంగా బీరు మీద postలు పెట్టడం ప్రారంభించాడు. “ఈజిప్టు బీరుకి,మెసపటేమియా బీరుకి గల పోలికలు-భేదాలు” ”బీరులో ఈగ పడితే ఎలా?” ”బంగాళా దుంపలతో ఇంట్లోనే బీరు చేసుకోవడం ఎలా?” వంటివి. లైకులు,లవ్వులు,మెచ్చుకోళ్ళు వచ్చి పడ్డాయి. బ్రహ్మానందభరితుడై ఇంకా కొత్త కొత్తగా- “బీరుతో సాంబారు కాయడం ఎలా?” ”బీరు మాత్రమే తాగి 30 రోజులు బ్రతకడం ఎలా?” వంటి వినూత్న postలు పెట్టడం మొదలు పెట్టాడు. ఈసారి ఇంకా లైక్స్,లవ్స్,నమస్కారమ్‌స్,కా మెంట్స్ వెల్లువలా రాసాగాయి. అలా ఓ నెల గడిచిందో లేదో బీరేంద్ర కు బీర్బల్స్ group admin నించి ఫోన్ వచ్చింది. WhatsApp Admin: మీరు చాలా ఎక్కువ messages పెడుతున్నారని group సభ్యులు complaint చేస్తున్నారు. ఇకనించీ ప్రతి సభ్యుడు రోజుకొక్క message కన్నా పెట్టరాదని rule పెట్టాం. బీరేంద్ర: చాలామంది నేను పెట్టే messages కి positive గా respond అవుతున్నారు కదండీ. Admin: వాళ్ళందరికీ కూడా warning ఇవ్...