ఏఅయ్యయ్యయ్యయ్యో
కృత్రిమ మేధ వచ్చేస్తోందొచ్చేస్తోందొచ్చేస్తోం ది! Coding, Analysis, critical thinking దగ్గర నుంచీ వ్యాసాలు వ్రాయడం, బొమ్మలు గీయడం, కవిత్వం గిలకడం దాకా అన్ని పనులూ ఇంచక్కా అదే చేసి పెడుతుంది! అవునా?? ఇదంతా ఎలా? ముందు మనకు తెలిసిందంతా దానికి నేర్పాలి. అది బుడిబుడి అడుగులు వేస్తూ అన్నీ నేర్చేసుకుని ఇంకా ఇంకా తెలివితేటలు పెంచుకుంటూ పోతుంది. అలాగన్న మాట. అంతా అదే చేస్తే ఇంక మనమేం చేస్తాం? మనమేం చెయ్యక్కర లేదు. హాయిగా పేకాటాడుకోవడమే! మరి మన ఉద్యోగాలు? ఇంక అందరూ కాడి పట్టి వ్యవసాయం చెయ్యాలేమో? నీకన్నా వ్యవసాయం అదే బాగా చేస్తుంది. ఎప్పుడు ఎలా ఎన్ని విత్తనాలు వేయాలి, కలుపు తీయాలి, నీరు పెట్టాలి ఇవన్నీ కృ.మే ఆధారిత పరికరాలు జప్ జప్‌మని చేసేస్తాయి! మరైతే మనకు డబ్బు? బువ్వ? నెలకింతని కృ.మే మనకు డబ్బులిస్తుంది. దాంతో మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. అన్ని పనులు అదే చేస్తూ మనకు డబ్బులు బాంకులో పడుతూ ఉంటే జీవితమంతా మనకు నచ్చినట్టు హాయిహాయిగా గడపొచ్చన్న మాట! భలే! ఆగాగు. కొన్నాళ్ళకు ఇంకా ఇంకా తెలివి పెంచుకున్న కృ.మే కి ఈ మనుషులకి అరవ చాకిరీ చేస్తూ వీళ్ళని మేప...