పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

కుబెగ్గరేరా!

  సార్‌,మన సినిమాలో హీరో ఒక బెగ్గరన్న మాట. హీరో ఏంటీ? బెగ్గరేంటీ? బాగోదేమోనయ్యా? అదే వెరైటీ సార్‌!  పరిస్థితుల ప్రభావం వల్ల బెగ్గరై, పెద్దయ్యాక కూడా ఆ బెగ్గింగ్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తుంటాడు. అందువల్ల అతని స్నేహితులంతా బెగ్గర్సే.  ఓకే,సార్‌? ఇక మన హీరోయిన్‌ కూడా బెగ్గరే! హీరోయిన్‌ బెగ్గరా?? అంటే మీరనుకుంటున్న బెగ్గర్‌ కాదు సార్!  ఆమె మొదట ప్రేమ బెగ్గర్‌! తరువాత పెళ్ళి బెగ్గర్‌!   చివరగా ఉద్యోగం బెగ్గర్‌! ఓకే,సార్‌? ఇక మన విలన్‌ కూడా బెగ్గరే!  విలన్‌ బెగ్గరా?? అవును సార్‌! అతనొక ఆయిల్‌ బెగ్గర్! పవర్‌ బెగ్గర్‌!  ఏమిటయ్యా, ఈ బెగ్గింగ్‌ గోల?? ఇంతకీ కథ ఏమిటి? కథలోకే వస్తున్నా సార్‌. మన హీరో తిరుపతిలో తిండి కోసం బెగ్గింగ్‌ చేస్తూ బతుక్కుంటూ ఉంటాడు.  తిరుపతిలో ఒకటికి రెండు శ్రీవారి ఉచిత భోజన సత్రాలున్నాయి కదయ్యా?? అయినా కాళ్ళూ చేతులు బావున్న హీరో అడుక్కోడమేమిటయ్యా? చెప్పాగా సార్‌, అలవాటైన వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడని. శ్రీవారంటే గుర్తొచ్చింది, విలన్‌ ఫామిలీ కూడా శ్రీవారి భక్తులే. బిజినెస్‌ కోసం హత్యలు చేస్తూ పనైతే వజ్రాల కిరీటాలు చేయిస్తామని మ...