కుబెగ్గరేరా!
సార్,మన సినిమాలో హీరో ఒక బెగ్గరన్న మాట.
హీరో ఏంటీ? బెగ్గరేంటీ? బాగోదేమోనయ్యా?
అదే వెరైటీ సార్!
పరిస్థితుల ప్రభావం వల్ల బెగ్గరై, పెద్దయ్యాక కూడా ఆ బెగ్గింగ్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తుంటాడు. అందువల్ల అతని స్నేహితులంతా బెగ్గర్సే.
ఓకే,సార్?
ఇక మన హీరోయిన్ కూడా బెగ్గరే!
హీరోయిన్ బెగ్గరా??
అంటే మీరనుకుంటున్న బెగ్గర్ కాదు సార్!
ఆమె మొదట ప్రేమ బెగ్గర్! తరువాత పెళ్ళి బెగ్గర్!
చివరగా ఉద్యోగం బెగ్గర్!
ఓకే,సార్?
ఇక మన విలన్ కూడా బెగ్గరే!
విలన్ బెగ్గరా??
అవును సార్! అతనొక ఆయిల్ బెగ్గర్! పవర్ బెగ్గర్!
ఏమిటయ్యా, ఈ బెగ్గింగ్ గోల?? ఇంతకీ కథ ఏమిటి?
కథలోకే వస్తున్నా సార్. మన హీరో తిరుపతిలో తిండి కోసం బెగ్గింగ్ చేస్తూ బతుక్కుంటూ ఉంటాడు.
తిరుపతిలో ఒకటికి రెండు శ్రీవారి ఉచిత భోజన సత్రాలున్నాయి కదయ్యా?? అయినా కాళ్ళూ చేతులు బావున్న హీరో అడుక్కోడమేమిటయ్యా?
చెప్పాగా సార్, అలవాటైన వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడని. శ్రీవారంటే గుర్తొచ్చింది, విలన్ ఫామిలీ కూడా శ్రీవారి భక్తులే. బిజినెస్ కోసం హత్యలు చేస్తూ పనైతే వజ్రాల కిరీటాలు చేయిస్తామని మొక్కుకుంటూ ఉంటారు.
ఇంక కథ మొత్తం ఒక్క ముక్కలో చెప్పాలంటే,
డబ్బున్న విలన్ను చంపి ఆ డబ్బును బెగ్గర్స్ కి పంచడం!
ఓకే,సార్?
బెగ్గర్స్ కి పంచడమేమిటయ్యా??
అదే సార్, మన హైద్రాబాదు,సికిందరాబాదు,అహ్మదా బాదు,ముంబాయి,కలకట్టా ఇలా అన్ని ఊళ్ళలో ఉండే బెగ్గర్ పాపులేషన్ కి బెడ్లు, బ్రెడ్లు,డబల్ బెడ్‌రూం అపార్టుమెంట్లు ఇవ్వడం. ఓకే సార్?
ఇంకా ఈ సినిమాలో తిరుపతి ఎలాగూ ఉంది. ఇంకా వేరే మతాలను కూడా కవర్ చెయ్యాలి కాబట్టి మన బెగ్గింగ్ హీరో వేరే మతం వాళ్ళ దగ్గరికెళ్ళి బిర్యానీ బెగ్గింగ్ చేసినట్టు, పైన్నుంచి కిందకు దూకినప్పుడు వేరే మతం దేవుడు కాపాడినట్టు చూపిస్తాం.
హీరో హిందూ అయితే వేరే మతం దేవుడు కాపాడ్డం ఏమిటయ్యా?
ఎప్పుడూ హిందూ దేవుళ్ళే కాపాడాలా ఏంటి సార్? వెరైటీగా ఇలా చూపెడదాం. ఓకే,సార్?
ఇంకా రెండు అనాథ శవదహనాలు పెడదాం. సెంటిమెంటు పండడానికి ఓ శవం ఊరేగింపులో మన బెగ్గర్ హీరో ప్రేక్షకుల గుండెలు పిండేసేలా నాటు స్టెప్పులు వేస్తూ డప్పుల చప్పుళ్ళకి డాన్సు చేస్తాడు.
ఓకే,సార్?
ఇంకా నాలుగు లారీ కింద పడే సీన్లు, హీరో,హీరోయిన్లు చెత్త బండిలో వెళ్ళి చెత్త కుప్పలో పడి, చెత్తలో ఫైట్ చేసి, చెత్త విలన్ను చిత్తు చిత్తుగా చంపి, అతని దగ్గర ఉన్న డబ్బంతా తీస్కుని,
మన హైద్రాబాదు,సికిందరాబాదు,అహ్మదా బాదు,ముంబాయి,కలకట్టా ఇలా అన్ని ఊళ్ళలో ఉండే బెగ్గర్ పాపులేషన్ కి బెడ్లు, బ్రెడ్లు,డబల్ బెడ్‌రూం అపార్టుమెంట్లు ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది.
బావుందా సార్??
నీ ముష్టి వారి కథ విన్నాక తేరుకోడానికి నాకు నాలుగు రోజులు పట్టేటట్టుంది గానీ, బుర్ర ఖాళీ లేదు, ఇంకోసారి కనిపించకు.