వీరతాళ్ళ వెంకయ్య అవార్డులు


ప్రముఖ రచయిత్రి పప్పుల పెద్దమ్మ రచన నుండి: 


 ఓ చల్లని మాఘ మాసపు ఉదయాన నా స్కూటీ మీద హైడ్రాబాడ్ రోడ్ మీద ట్రావెల్‌ చేస్తుంటే ముంగురులు అలా అలా గాలికి మూవ్‌ అవుతుంటే నా బ్లూ దుప్పట్టాని పట్టుకు లాగుతున్నట్టున్న ఎదురు గాలిని ఆ ఎయిర్‌ ని అనుభవిస్తూ జాగింగ్‌ వెళుతున్న చిన్నాపెద్దని చూస్తూ అలాఅలా గాల్లో తేలుతూ నా స్కూటీ స్లో గా మూవ్‌ అవుతుంటే ఉన్నట్టుండి ఎక్కడినించో మగ వాసన! వావ్‌! ఎస్‌! అది మగవాసనే! నా వెంటే వస్తోంది ఘప్పుమని, ఓహ్‌! అదే మగ వాసన! ఎక్కడ్నించి? ఎక్కడ్నించి? అంతా సర్‌ప్రైజింగ్‌ గా మెస్మరైజింగ్‌‌ గా ఉంది. గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఎక్కడిది ఆ వాసన? పక్కకు తలతిప్పి చూసాను, మురిక్కాలువ! ఓహ్‌! అర్థమైంది! ఉదయానే ఆఫీసెస్‌కి, వర్క్ కి రెడీ అవడానికి బాత్‌ చేస్తున్న మగవారి వంటినుండి వచ్చిన ఆ వాటర్‌ ఈ కాలువలో కలిసి ఓహ్‌, ఎన్‌ఠైర్‌ హైడ్రాబాడ్‌ మగ పరిమళాలతో నిండిపోయింది. ఓహ్‌! ఓహ్‌! …

వీరతాళ్ళ వెంకయ్య: “మాఘ మాసంలో మగ పరిమళం” అన్న ఈ అద్భుతమైన వెయ్యి పేజీల రచనకు ఈ సంవత్సరం “ఫ్రీ ఫ్రీ అవార్డు“ ఇస్తున్నాం. 

ప్రముఖ కవయిత్రి బేబీ బూబమ్మ ప్రసంగం నుండి: 

నేను ఫెమినిజమ్‌ మీద బర్మనీలో ట్రైనింగ్‌ తీస్కుని వచ్చాను హై. నేను ఇండ్యాలో యాక్టివిస్ట్ హై. నేను తెల్గులో పెద్ద పొయెట్‌ హై.
 
నా పోయెం ఒక్టి మీకోసం-

నాది ఒక
మంచం ఉంది
దాన్మీద
బుక్స్ ఉంటయ్‌
సాక్స్ ఉంటయ్‌
హాండ్‌బాగ్‌ ఉంటయ్‌
దోస్త్ సే చాయ్‌
బైఠక్స్ ఉంటయ్‌
గానీ అసల్కి
లైఫ్ పార్టనర్‌ లేడు హై
మేరా మంచం
పరేషాన్‌ హై!
పరేషాన్‌ హై!

వీరతాళ్ళ వెంకయ్య: “పరేషాన్‌” అన్న పొయెట్రీ బుక్‌ ను ఈ సంవత్సరం “ఉమెన్స్ రెడ్‌ యాంట్స్ అవార్డు“ కు ఎంపిక చేసాం. 

ప్రముఖ రచయిత్రి రెండు చింతలమ్మ రచన నుండి:

రాజేష్‌, వరుణ కుమారి ప్రేమించుకున్నారు. పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే రాజేష్‌ లో ఏదో తెలియని అలజడి. అదేమిటో తెలుసుకోవడానికి కొంత కాలం పట్టింది. అవును, మీరూహించింది రైటే. రాజేష్‌ రాజేశ్వరి కావాలనుకుంటున్నాడు. ఆ విషయం వరుణ కుమారికి  చెప్పాడు. ఆమె నువ్వు రాజేశ్వరివైతే నేను వరుణ్‌ అవుతానంది. అలా వారిద్దరూ అటూఇటూ అయ్యి పెళ్ళి చేసుకున్నారు. అప్పుడు రాజేశ్వరిలో ఏదో అలజడి. అవును, రాజి తిరిగి రాజేష్‌ కావాలనుకుంటోంది. మరి అందుకు వరుణ్‌ ఒప్పుకుంటాడా? మిగిలిన భాగం నా రెండు వేల పేజీల బృహత్‌ నవల “అటా-ఇటా” తప్పక చదవండి.

వీరతాళ్ళ వెంకయ్య: “అటా-ఇటా” నవలకు ఈ సంవత్సరం తాటా అవార్డు ఇస్తున్నాం.

ఇదంతా చూసి మన బ్రహ్మీ కొంచెం కూడా political correctness లేకుండా ఎలా నవ్వుతున్నాడో చూడండి:


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన