ఓ మృత్యువు-కొన్ని ఆలోచనలు
ఈ రోజుకు మా నాన్న గారు మరణించి సరిగ్గా పదిహేను సంవత్సరాలు. ఆత్మీయులు భౌతికంగా మరణించినా మన జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటారు. మనం అభిమానించిన వారు మనని చులకన చేస్తున్నారని, మనం ఎంతో ప్రేమించిన వారికి మన మీద ప్రేమ ఏమీ లేదని తెలిసినపుడు మన స్నేహితులుగా వారు మన మనసులోంచి తొలగింపబడతారు. మనుషులుగా జీవించి ఉన్నా స్నేహితులుగా మరణిస్తారన్న మాట. లేదా ‘Best friends’ నించి ‘మామూలు పరిచయస్థులు’ గా మన మనసులో demote అవుతారు. భౌతికంగా వెళ్ళిపోయినా, మానసికంగా దూరమైనా ఇదంతా మనసుకు చాలా బాధాకరమైన ప్రక్రియ. అందుకే చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా అంటాడో కవి. అసలు మన మనసు ఎదుటి వారికి ఉచితంగా ఇవ్వడమెందుకు దాన్ని వాళ్ళు బద్దలు కొట్టారని వ్యధ చెందడమెందుకు? మన మనసును మన దగ్గరే ఉంచుకుంటే పోలా? మనసు చెప్పినట్టల్లా వింటే ఇంతే సంగతులు. అందుకే సనాతన ధర్మం మనసు గినసు జాంతానై నీ ధర్మం నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళిపో అని చెర్నాకోలుతో కొట్టినట్టే గట్టిగా అదిలించి చెబుతుంది. ప్రేమలు,అభిమానాలు మనసును బంధించి కర్మచట్రంలో ఇరికిస్తాయని హెచ్చరిస్తుంది. ఎవరో అన్నట్టు చనిపోయిన వాళ...