భాషే లేని భావమో

 మనుషులు ప్రేమించడాన్ని ప్రేమిస్తూ మనుషులను ప్రేమిస్తున్నామనుకుంటారని ఓ రచయిత అంటారు.


ప్రేమించడాన్ని ప్రేమించేవారు పాటను ప్రేమించకుండా ఎలా ఉండగలరు?


ఇంతకీ మాధవపెద్ది సురేష్ గారు సంగీతాన్ని‌ సున్నిత త్రాసులో తూచి పాటకు అద్దుతారు. శ్రోతల ప్రాణనాడులు సంగీతంలోని హాయిని అనుభవించేలా.


ఈపాట సాహిత్యంలో కవిత్వం సనసన్నగా రాలిపడుతోన్న పువ్వుల్లా ఉంటుంది. 


ఇది ‘ఇది’ అని తెలియని భావమో

ఇది పలికే భాషే మౌనమో

ప్రేమ గానమో 


ఇది సరిగమలెరుగని రాగమో

ఇది భాషేలేని భావమో


సాహిత్యం అతి సహజంగాను,ఎక్కడా ఒక్క పదం ఎక్కువ వేయకుండా కనకాంబరాలు తూచినట్టు,

సంగీతం ఎక్కడా ఎక్కువ కాకుండా మల్లెదండలో దారంలా అలా అలా యమన్‌ కల్యాణి రాగంలో అమిరిపోయిన అపురూపమైన పాట,

 ఇవాళ మరోసారి.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన