సినిమా పాటల సంగతులు

 



పాటకు సమాంతరంగా సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను నడిపించడం ఓ పద్ధతి. 

ఉదాహరణకు వాగ్దానం సినిమాలో రేలంగి గారి హరికథకు సమాంతరంగా సినిమాలో ముఖ్య సన్నివేశాలు జరుగుతాయి. 


అలాంటిదే స్వాతిముత్యం సినిమాలో హరికథ పాట-పాటకు సమాంతరంగా ముఖ్య సన్నివేశాల అల్లిక.


ఇక మన సినిమాల్లో నేరగాళ్ళకి ఐటమ్‌ సాంగ్సుకి అవినాభావ సంబంధం. సాధారణంగా వారంతా కలుసుకొనేది బార్లలోనే. ఐటం సాంగ్‌ జరుతుండగానే అక్కడ విలన్లు,హీరోల మధ్య సన్నివేశాలు జరగడం పాత సినిమాలనించీ మనకు ఆచారంగా వస్తోంది. ఇటీవల వచ్చిన కిక్‌  సినిమాలోనూ  దిల్‌ ఖలాసే అనే ఐటం సాంగుకి సమాంతరంగా సినిమాలోని ముఖ్య సన్నివేశాలను తెలివిగా నడపడం కనిపిస్తుంది.



పాటలోనే సన్నివేశాన్ని నడపడం మరో పద్ధతి.

ఉదాహరణకు మల్లెపువ్వులో ఈ పాట:


 సిరివెన్నెలలో ఈ పాట:



రుద్రవీణలో ఈ పాట:



సాధారణంగా ఆ ప్రత్యేక భావం యొక్క తీవ్రతను పెంచడానికి పాట ఉపయోగపడుతుంది. 

ఒక పాటకి సమాంతరంగా సన్నివేశాల కల్పన,పాటలోనే సన్నివేశాలు జరిగిపోవడం మరో రెండు మంచి ప్రభావవంతమైన పద్ధతులు. చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే ఈ టెక్నిక్సు చక్కగా వాడగలిగారని నా గమనిక. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన