సాహిత్యంలో శబ్దము-నిశ్శబ్దము
శబ్దశక్తి అనంతం. ఈ ప్రపంచమే శబ్దమయం. కొన్ని ప్రత్యేక శబ్దాలకు , వాటి ఉచ్చారణకు ఉన్న శక్తి గురించి మన ప్రాచీనులు చెప్పిన విషయాలు మనకి తెలియనివి కావు. శబ్దాలకు ఉన్న అధిదేవతలను గురించిన నమ్మకం మనకు ఎరుకే. ఈ శబ్దాలు , అక్షరాలై , వాటి సముదాయం పదాలై , పదాల సముదాయం వాక్యాలై , ఇదంతా ఒక ప్రత్యేక మానవ సమూహం వారిలో వారు ఒకరి భావాలు ఒకరితో పంచుకోవడానికి ఒక భాష అయ్యి భాసిల్లుతోంది. ఈ భాష పరిణితి చెంది , ఉన్నత స్థాయిలో కళగా , సాహిత్యంగా రూపొందుతోంది.పాటలు , నాటకాలు , ప్రసంగాలు , కధలు , కవిత్వం ఇలా వివిధరూపాల్లో భాష కళకు వాహకం అవుతోంది. అయితే ఈ భావాలు పంచుకోవడం శబ్దంతోనూ , నిశ్శబ్దంతోనూ చేయవచ్చు. Verbal and Non-verbal communication అన్న మాట. భావాలు పంచుకోవడమే కాదు , ఎదుటి వాడిని హేళన చెయ్యడానికి , కించపరచడానికి , అధికారం , కోపం , ధిక్కారం మొదలైనవి ప్రదర్శించడానికి ఈ భాష , సంకేతాలు , హావభావాలూ పనికొస్తాయి. ఈ మాటల్లోని అర్ధాలు చెప్పే వ్యక్తి వయసుని , స్థాయిని , ఆడ ,...