చెఱువు దగ్గర గృహిణి

 


నీలాంబరపు ఛాయలలో
నీ కన్నుల వెలుగులలో
నిండు నీళ్ళకుండలున్నవి
అవి తొణకకూడనివి

తామర రేకుల వంపులలో
నీ మాటల చోటులలో
నలనల్లని నీడలున్నవి
అవి చెప్పకూడనివి

చేప పిల్లల మిసమిసలో
నీ చేతుల అంచులలో
రక్తకాంతి గుసగుసలున్నవి
అవి విప్పకూడనివి

నీళ్ళ కుండతో
నల్లని నీడలను
కలిచే నీ చేతులు
అమ్మాయీ,
నీళ్ళ కుండ నింపుతూ
దుఃఖాన్ని
నడుముకు ఎత్తుతున్నవి

నిండు నీళ్ళ కుండలు,
చిప్పిల్లకూడనివి.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన