గులకరాయి!





నేనొక

చిన్న 

గులకరాయిని


కొందరు నన్ను

ఎత్తినట్టే ఎత్తి

దూరంగా

విసిరి కొడతారు


కొందరు

కాలక్షేపానికి

నిమిరి

కింద పడేసి

పోతారు


కొందరు

ఎందుకైనా

పనికొస్తానని

జేబులో వేసుకు

పోతారు


కొందరు

నేనున్నా

చూడకుండా

తొక్కుకుంటూ

పోతారు


పర్వాలేదు,

నాకే బాధాలేదు.


నేనొక

చిన్న 

గులకరాయినేగా.


 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి