వాన – గులాబీ – పాము





ముసురులో
మెత్తని
మన్నొదిలి
రాతిగుండె
రోడ్డు పైకి
సాగుతూ
మెత్తని
గులాబీ రంగు
వాన పాము. 

గులాబీలు అద్దిన
గొడుగు వేసుకుని
లేత గులాబీ రంగు
పెదాలకు పూసుకుని
తాజా గులాబీ
అత్తరు రాసుకుని
గాలికి ఊగే
గులాబీలా
ఆమె. 

చటుక్కున
గులాబీ రేకుల
కళ్ళు దించి
గులాబీ రంగు
ఎత్తు మడమ
నజ్జు చేసిన
గులాబీ పామును
అభావంతో దాటి 

నల్ల మబ్బుల
కురులు ఊగే
తూగుతో
పాములా
వానలో
సాగిపోయింది.





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి