The great Indian rope trick



కండెకు చుట్టుకునే

నూలు పోగుల్లా

పిప్పీ పిల్లంగోవి

చుట్టూ

మంది


పాటకు

పడగ విప్పిన

తాడు చుట్టుకు

సాలె పట్టుల్లా

పైపైకి లేచే

సూటి చూపుల

జతలు

వందలు


మిడతలా

కొనకి చేరి

ఠింగణా ఒకడు

తెల్లబోయిన

తెల్ల మబ్బు

నోట్లోంచి


అప్పడంలా

అంతంతగా

జారిపోతే

ఆకాశ ప్పొ 

ట్టలోకి


రెప్ప కొట్టడం

వాయిదా వేసిన

కళ్ళ వెనుక

తుళ్ళి పడ్డ

తళుక్కు

బంతులు.


ఓయంటే

ఓహ్హోయంటూ

జన సమూహాన

పొడగడితే 

బుడతడు


ఇంద్రజాలపు

గాలి విసురుకు

అట్టిట్టయినవి

తలపాగాలు


అహోరే!

భళి భళీల

కంబళీని

ఎగరేసుకు పోయేటి

దీనార్ల చిలకలు.


బేరసారాల

నడి ఎండలో

గారడీ వాడి

కనుమాయా

కారు మబ్బు

కురిపించిన

సోనవాన


విచ్చుకత్తుల

రాచ వీథుల్లో

పుట్టించిందో 

ఉల్లాసపు

హాళి మడుగు.


 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన