తోపులో పిల్లలు



పోగు చేసేం

ఎండిన కాయలు

వాటి టోపీలు

ఎండు పుల్లలతో

ఎండను కాచేం


మట్టి గీతలు గీసేం

చెట్టు మొదల్లో

కూలబడి

పుల్ల కలంతో

నీడల్ని కోసేం.


దులిపేం

చొక్కాల మీది

గండు చీమల్ని

కంగారు గాలిని

తోసేం


ఎండ దుమ్ముని

మీద పోసుకుంటూ

పొద్దు పచ్చిక

మేసేం.


ఎగజల్లేం

చూపులు

ఎగిరే తూనీగపై

పంజా విసిరే

టామీని దువ్వేం


చెట్ల గుసగుసకి

కువకువ సవ్వడికి

రిక్కించేం చెవులు

కోతుల కొక్కిరింతకి

నవ్వేం.


నవ్వేం చాలా

ఊరూరికే నవ్వేం.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన