నేనే కవిత్వాన్ని

 

నేనే కవిత్వాన్ని

నిలబడ్డ సత్యాన్ని

నిలువలేని హృదయాన్ని


రాణిగారి ఒంటి

గులాబీ అత్తరుని

ఏడు మల్లెలెత్తు

కోర్కెల మెత్తని

వేయి శరత్తుల

వెన్నెల మత్తుని


నడిమి సూరీడి

వేడి ఆవులింతని

సోమరి కలల

బికారి కాపరిని

చిత్త భ్రాంతుల

బంతులాటలో

ఆనంద నర్తనని


ఎద లోయలో

మాగన్ను పాముని

మది కొలనులో

రహస్యాలు మింగిన

చేప పిల్లని

అక్షరాల వనంలో

విహరించే వ్యాఘ్రాన్ని


నిలబడ్డ సత్యాన్ని

నిలువలేని హృదయాన్ని

కవిత్వాన్ని.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన