తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? ఆహా! ఎంత బాగా చెప్పాడో కదా మహాకవి? వినడానికి బానే ఉంది. కానీ లాజిక్ లేదు. అదేంటి? అలా అనేసావ్? ఆ అన్నది మహాకవి! కావొచ్చు. విషయం ఎవరన్నారని కాదు. అసలు ఎవడైనా కూలీ పనికి ఎందుకు వెళ్తాడు? డబ్బు కోసం? కదా. వీడు శ్రమ ఇచ్చాడు, వాడు డబ్బిచ్చాడు. అయిపోయింది లావాదేవీ. డబ్బూ ఇచ్చి, పేరు కూడా కూలీకే ఇవ్వాలంటే ఎలా చెప్పు? దీన్నే కొంచెం వివరంగా చెబుతా విను. ఎవరైనా తాజ్ మహలో, రాజ్ మహలో ఎందుకు కట్టిస్తారు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి? పేరు కోసం! కట్టిన వాడికి కూలీ, కట్టించిన వాడికి పేరు. ఇప్పుడా డబ్బూ కూలీకి ఇచ్చి, పేరు కూడా కూలీకే రావాలంటే ఆ కట్టించే వాడు ఎందుకు కట్టించాలి? ఇంకొంచెం వివరంగా చెబుతా విను. చాలా డబ్బు ఖర్చు పెట్టి నువ్వో ఇల్లు కట్టించావనుకో. ఫలానా సుబ్బారావు గారిల్లు ఎంత బావుందండీ? అని ఎవరైనా అంటే, అబ్బే, ఆయనేమన్నా రాళ్ళెత్తడా? సిమెంటు మోసాడా? ఆ ఇల్లు కట్టింది మాఊళ్ళో కూలీలు. అంటే నీకెలా ఉంటుంది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్...
చిన్నప్పుడంతా కిందకే చూస్తుండే వాడిని. ఎందుకు? తల వంచుకుని పుస్తకాలు చదవడం,బొమ్మలు గీయడం చేత! ఓహో! తర్వాత? యవ్వనంలో ఎటెటో చూస్తుండే వాడిని. ఎందుకు? భావుకత పొంగులు వారుతూ ఉండడం చేత! ఓహో! తర్వాత? తర్వాత నడి వయసులో అటూ ఇటూ చూసేవాడిని. ఎందుకు? స్నేహాల కోసం,పరిచయాల కోసం తహతహలాడడం చేత! ఓహో! సినిమా ఇంటర్వెల్కొచ్చినట్టుంది. ఇప్పుడెటు వైపు చూస్తున్నావ్? ఇప్పుడు పైకి చూస్తున్నా. ఏముందీ పైన?? పైనంటే భగవంతుడి వైపురా! ఓహో! ఆధ్యాత్మికత! బావుంది. అవును, మొన్ననే ఒక spiritual పుస్తకం రాసా. నాకు మోక్షం గ్యారెంటీ! కానీ సమీక్షలు సరిగ్గా రాలేదు. నా పుస్తకాన్ని ఎవరూ గుర్తించ లేదు. అందరికీ కుళ్ళే. ఒళ్ళు మండిపోయింది నాకు. అయ్యో పాపం! అలాగా! యోగా, ధ్యానం చేస్తున్నా. రోజూ దేవుడితో మాట్లాడుతున్నా. ఇహ నాకు మోక్షం గ్యారెంటీ! కానీ ఆ యోగా టీచరు డబ్బు మనిషి. ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. వేరే యోగా టీచరు కోసం చూస్తున్నా. ఓ! అలాగా! రోజూ పూజలు రెగ్యులర్గా చేస్తున్నా. నాకు మోక్షం గ్యారెంటీ! ఓ! అలాగా! బావుంది. అవునూ, హడావిడిగా ఎక్కడికీ పోతున్న...
సార్,మన సినిమాలో హీరో ఒక బెగ్గరన్న మాట. హీరో ఏంటీ? బెగ్గరేంటీ? బాగోదేమోనయ్యా? అదే వెరైటీ సార్! పరిస్థితుల ప్రభావం వల్ల బెగ్గరై, పెద్దయ్యాక కూడా ఆ బెగ్గింగ్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తుంటాడు. అందువల్ల అతని స్నేహితులంతా బెగ్గర్సే. ఓకే,సార్? ఇక మన హీరోయిన్ కూడా బెగ్గరే! హీరోయిన్ బెగ్గరా?? అంటే మీరనుకుంటున్న బెగ్గర్ కాదు సార్! ఆమె మొదట ప్రేమ బెగ్గర్! తరువాత పెళ్ళి బెగ్గర్! చివరగా ఉద్యోగం బెగ్గర్! ఓకే,సార్? ఇక మన విలన్ కూడా బెగ్గరే! విలన్ బెగ్గరా?? అవును సార్! అతనొక ఆయిల్ బెగ్గర్! పవర్ బెగ్గర్! ఏమిటయ్యా, ఈ బెగ్గింగ్ గోల?? ఇంతకీ కథ ఏమిటి? కథలోకే వస్తున్నా సార్. మన హీరో తిరుపతిలో తిండి కోసం బెగ్గింగ్ చేస్తూ బతుక్కుంటూ ఉంటాడు. తిరుపతిలో ఒకటికి రెండు శ్రీవారి ఉచిత భోజన సత్రాలున్నాయి కదయ్యా?? అయినా కాళ్ళూ చేతులు బావున్న హీరో అడుక్కోడమేమిటయ్యా? చెప్పాగా సార్, అలవాటైన వృత్తిని కంటిన్యూ చేస్తున్నాడని. శ్రీవారంటే గుర్తొచ్చింది, విలన్ ఫామిలీ కూడా శ్రీవారి భక్తులే. బిజినెస్ కోసం హత్యలు చేస్తూ పనైతే వజ్రాల కిరీటాలు చేయిస్తామని మ...