బ్రహ్మచారులం కర్మవీరులం అద్దె కొంప గాలిస్తున్నాం ! ఇల్లు ఇర్కటం అద్దె మిక్కుటం ఎన్ని కొంపలో చూస్తున్నాం ! ఇది చిత్రం భళారే విచిత్రం అనే చిత్రంలోని సరదా పాట . ప్రేమ గీతాలు తేలిగ్గానే రాసిపారెయ్యొచ్చు ఎలాంటి గీత రచయిత అయినా . సందర్భానికి తగ్గట్టు ఇలాంటి హాస్యగీతాలు రాయడం కొంచెం కష్టమే ( రుద్రవీణలో “ రండి , రండి , రండి , దయ చేయండీ ” పాట కూడా ఇలాంటి కోవలోదే ). ఇది చిరుద్యోగ , నిరుద్యోగ కాలంలో అత్యధికులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్ళలో ఒదిగి మర్యాదగాను , ఒబ్బిడిగాను ఇల్లుగలవారికి విధేయంగాను బతికిన కాలంలో రాసిన పాట . ఈ పాటలో రాసినదంతా అచ్చంగా నిజం . వయస్సులో పిల్లుందంటే భయస్తులై మెలగాలి ! గృహస్థుకి ...